Don't Miss!
- Finance
Vistara: రికార్డు సృష్టించిన విస్తారా ఎయిర్ వేస్.. కంపెనీ పెట్టాక తొలిసారిగా..
- News
KTR: ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్.. చూస్తే ఆగమే ఇగ..!
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్లో Aura ఫేస్లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Janaki Kalaganaledu January 21st: వెన్నెలను మార్చేందుకు మల్లిక తప్పుడు ఆలోచనలు.. అడ్డుకున్న జానకి
జానకి కలగనలేదు సీరియల్ ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తికరంగా మారింది. తమ్ముడి జాబ్ కోసం రామ చేసిన అప్పు కారణంగా జ్ఞానాంబ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. ఆ సమస్యల వలన రామ భార్య జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 483 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఊహించని సమస్యలు
తాకట్టులో ఇల్లును వదిలేసిన జ్ఞానాంబ కుటుంబ సభ్యులు మరో ఇంటికి వస్తారు. ఇక అక్కడ ఆర్థిక సమస్యలతో ఊహించిన విధంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక రామచంద్ర ఇంట్లో పరిస్థితులను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. తన వల్ల అందరికీ సమస్య వచ్చింది అని అతను ప్రతిసారి కూడా తన భార్య ముందు బాధను చెప్పుకుంటూ ఉంటాడు.
అయితే పరిస్థితులు అన్నీ తొందరగానే తొలగిపోతాయని అతని భార్య జానకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే రామచంద్ర మాత్రం ఇంటిని గడపాలి కాబట్టి ఏదో ఒక పని చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. బయట అతను ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు.

ఏ పని లేకుండా అఖిల్ కోపం
అయితే అతని తమ్ముడు అఖిల్ మాత్రం ఏ పని లేకుండా ఇంట్లో కూర్చుని ఉంటాడు. దీంతో జెస్సి అతనిని ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. ఇక జెస్సి ఫై అఖిల్ తీవ్రస్థాయిలో కోప్పడుతూ ఉంటాడు. నువ్వు జాబ్ చేయకపోతే నేను చేస్తాను అని జెస్సి అనడంతో అతను కోపంతో బయటకు వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు జ్ఞానాంబ తన భర్త ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
పక్షవాతం వచ్చి చేయి పని చేయకపోవడంతో ఆ చేయికి ఆమె నూనెతో మర్దన చేస్తూ ఉంటుంది. ఇక కూతురు వెన్నెల వచ్చి నేను సహాయం చేస్తాను అని అంటుంది. ఇక కూతురిని చూసిన జ్ఞానాంబ మళ్ళీ మీ నాన్నమ్మ ఇంటికి వెళ్ళిపో అని పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ రా అని అంటుంది. కానీ వెన్నెల మాత్రం ఈ పరిస్థితుల్లో మీ అందరిని వదిలేసి నేను వెళ్ళిపోలేను మీరందరూ బాధపడుతూ ఉంటే నేను అక్కడ సంతోషంగా ఎలా ఉండగలను అని వెన్నెల మాట్లాడుతూ ఉంటుంది.

పొరపాటు చేసిన రామ
ఇక ఆమె మాటలు జానకి విని ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. ఇక జ్ఞానాంబ తన కూతురు పెళ్లి ఎలా చేయాలో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు రామచంద్ర ఏదో ఒక పని చేసుకోవాలి అని తెలిసిన వారందరినీ కూడా అడుగుతూ ఉంటాడు. అయితే అతనికి దారి మధ్యలో హఠాత్తుగా తనను మోసం చేసిన చరణ్ వెళుతున్నట్లుగా అనిపిస్తుంది.
ఇక ఆ కారుని ఫాలో అవుతూ అతని అడ్డుకోవాలని అనుకుంటాడు. తీరా కారు ఆపి చూస్తే అతను చరణ్ కాదని తెలుస్తుంది. వెంటనే రామచంద్ర అతనికి క్షమాపణలు చెప్పి దూరం నుంచి చూసి నన్ను మోసం చేసిన వ్యక్తి అని అనుకున్నాను అని పొరపాటు పడ్డాను అని అంటాడు. దీంతో ఆ వ్యక్తి అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

విష్ణు మంచి ఆలోచన
ఇక ఆ తర్వాత జానకి ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా అప్పుడే వెన్నెల కూడా ఆమెకు సహాయం చేయాలని అనుకుంటుంది. అయితే వెన్నెల చేత జానకి ఏ పని చేయించకూడదు అని అనుకుంటుంది. నువ్వు అత్తగారింటికి వెళ్లిన తర్వాత అక్కడ ఎలాగూ పని ఉంటుంది ఇక్కడ చేయకూడదు అని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది.
ఇక ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోవడంతో పండగకు బట్టలు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రామచంద్ర రెండవ తమ్ముడు విష్ణు తన భార్య దగ్గర ఉన్న కొంత డబ్బులు తీసుకుని ఇంట్లో బట్టలు కొనాలని అనుకుంటాడు.

మల్లికను ప్రశ్నించిన జానకి
కానీ అతని భార్య మల్లిక మాత్రం అందుకు అసలు ఒప్పుకోదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని తెలిస్తే మళ్లీ అందరూ మన దగ్గరికి వస్తారు అని ప్రతి పండుగకు మీ అన్నయ్య ఎలాగో బట్టలు తీస్తున్నాడు అలాగే ఈసారి కూడా అతనే అందరికీ తెస్తాడు అని మీరు అనవసరంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టవద్దు అని పొగరుగా మాట్లాడుతుంది.
దీంతో విష్ణు ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఇక మరోవైపు వెన్నెల కిచెన్లో పనిచేసుకుంటూ ఉంటే మెల్లగా అక్కడికి వచ్చిన మల్లికా ఆమెకు ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేయాలని అనుకుంటుంది. నువ్వు అనవసరంగా ఇక్కడ కష్టపడడం కంటే మీ నానమ్మ ఇంటికి వెళ్లిపోవచ్చు కదా అని అనవసరమైన అనుమానాలు కలిగిస్తూ ఉంటుంది. ఇక ఆ విషయాన్ని పసిగట్టిన జానకి మల్లికతో మాట్లాడాలని అనుకుంటుంది.
ఎందుకు మల్లికా నువ్వు లేనిపోని విధంగా అనవసరంగా అందరికీ చెడు ఆలోచనలను కలిగిస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. మరి ఈ విషయంలో మల్లికా ఇలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.