For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 18th: అఖిల్ విడుదల.. ఐపీఎస్ డ్రీమ్ విషయంలో జానకి ట్విస్ట్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ కథ రోజురోజుకు ఊహించని మలుపులు తిరుగుతోంది. రామచంద్ర తమ్ముడు అఖిల్ తన స్నేహితురాలు మాధురి పై హత్యాయత్నం చేస్తాడు. అయితే ఆ ఘటనను జానకి చూస్తుంది. అఖిల్ డ్రగ్స్ అమ్ముతూ మాధురికి కనిపించడంతో ఆమె ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా మీ ఇంట్లో ఈ విషయం చెబుతాను అని కూడా అంటుంది. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న అఖిల్ అనుకోకుండా ఒక కర్ర తీసుకొని కొడతాడు. దాంతో రక్తపు మడుగులో మునిగిపోయిన మాధురిని జానకి వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 435 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  నమ్మలేము అనడంతో..

  నమ్మలేము అనడంతో..

  రామచంద్ర తమ్ముడు అఖిల్ తన స్నేహితురాలు మాధురిపై హత్యాయత్నం చేయడం జానకి చూస్తుంది. ఇక అతనిపై పోలీస్ కేసు కూడా నమోదు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. ఇంట్లో వాళ్ళు జానకిని కోపంగా చూస్తూ ఉంటారు. ఎవరు కూడా సరిగ్గా భోజనం కూడా చేయరు. ఇక అందరూ బాధలో ఉండడం రామచంద్ర తట్టుకోలేక పోతాడు. అసలు మీరు చూసింది ఎంతవరకు నిజమని జానకి పై అనుమానంగా అడుగుతాడు. జానకి ఎంత చెప్పినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళు ఆ విషయాన్ని పెద్దగా నమ్మరు. అఖిల్ అలా చేశాడు అంటే మేము ఏమాత్రం నమ్మలేము అని అంటూ ఉంటారు.

  అఖిల్ కు బేయిల్

  అఖిల్ కు బేయిల్

  ఒకవైపు మాధురి తల్లిదండ్రుల బాధను చూసి తప్పకుండా న్యాయం చేస్తానని కాబోయే పోలీస్ ఆఫీసర్గా ఎలాంటి పక్షపాతం చూపకుండా ఉండాలి అని జానకి అఖిల్ పై పోలీస్ కేసు పెడుతుంది. కానీ కుటుంబ పరిస్థితులు చేంజ్ కావడంతో ఆమె మరోసారి తన నిర్ణయం గురించి ఆలోచిస్తుంది. భర్త ఒక షరతు కూడా విధించడంతో జానకి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కేసు వెనక్కి తీసుకుంటాను అని పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. ఇక పోలీస్ స్టేషన్లో అఖిల్ తన అన్నయ్యను చూడగానే ఎంతగానో సంతోషపడతాడు. నీకు బెయిల్ ఇప్పించడానికి వచ్చాము అని ఇదంతా మీ వదిన నిర్ణయం వల్లే అని చెబుతారు.

  అఖిల్ ఇంటికి రాగానే

  అఖిల్ ఇంటికి రాగానే

  అయితే జానకి మాత్రం అఖిల్ విషయంలో ఏమాత్రం సంతోషంగా ఉండదు. అనవసరంగా తప్పు చేసిన అఖిల్ ను బయటకు రప్పిస్తూ ఉండడం ఆమె తట్టుకోలేక పోతుంది. మరోవైపు ఇంటిదగ్గర రామచంద్ర అఖిల్ ను ఇంటికి తీసుకువస్తాడా లేదా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మల్లిక మాత్రం ఏమో జానకి మళ్ళీ నిర్ణయం మార్చుకుంటుందేమో అని అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది. దీంతో ఆమె భర్త విష్ణు తనపై కోపం పడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అనుకున్నట్లే అఖిల్ ఇంటికి వస్తాడు. అఖిల్ ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు.

  కడుపునిండా భోజనం చేశాను

  కడుపునిండా భోజనం చేశాను

  అఖిల్ ను చూసి ఆనందంలో అతని భార్య జెస్సి కూడా ఎంతగానో సంబరపడిపోతుంది. అఖిల్ రావడంతో మళ్లీ ఇంటికి పూర్వ వైభవం వచ్చింది అని ఇదంతా జానకి కేసు వెనక్కి తీసుకోవడం వల్లనే అని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. అయితే జానకి మనసులో మాత్రం మాధురి పరిస్థితి గురించి మనోవేదన చెందుతూనే ఉంటుంది. ఇక తర్వాత ఇంట్లో మొత్తం సందడిగా అనిపించడంతో రామచంద్ర కూడా సంతోషపడుతూ ఉంటాడు. జానకితో మరోసారి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత నేను సంతోషంగా ఉన్నాను అని రెండు రోజుల నుంచి అఖిల కోసం ఆలోచించి భోజనం కూడా సరిగ్గా చేయలేదు అని, ఇప్పుడు కడుపునిండా భోజనం చేశాను అని అంటాడు. అంతేకాకుండా కంటి నిండా నిద్రపోతాను అని కూడా చెబుతాడు.

  ఐపీఎస్ గురించి ఆలోచించకూడదు

  ఐపీఎస్ గురించి ఆలోచించకూడదు

  ఇక రామచంద్ర ఆ విధంగా మాట్లాడడంతో జానకి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇప్పుడు అన్యాయంగా అఖిల్ ను బయటికి తీసుకువచ్చాను. కాబట్టి నేను నా ఐపీఎస్ చదువుకు న్యాయం చేయనట్లే.. కాబట్టి ఇంతటితో చదువును వదిలేయాలని జానకి నిర్ణయం తీసుకుంటుంది. కుటుంబం కోసం ఆలోచించాను కాబట్టి నాకు చదివే అర్హత లేదు అని కూడా తన మనసులో తాను అనుకుంటుంది. ఇక కన్నీళ్లు తుడుచుకుంటూ ఇక నుంచి ఐపీఎస్ గురించి ఆలోచించకూడదు అని, కుటుంబం గురించి ఆలోచించాలని అనుకుంటుంది.

  జానకి నిర్ణయం.. రామ సీరియస్

  జానకి నిర్ణయం.. రామ సీరియస్

  ఇక తర్వాత రామచంద్ర, జానకిని మళ్లీ ఎప్పటిలానే ఐపీఎస్ కోచింగ్ కోసమని కాలేజ్ లో దింపాలి అని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం మాట మారుస్తూ నాకు వేరే పని ఉంది అని చెబుతూ ఉంటుంది. ఇక మరోవైపు జెస్సి ఇల్లు తుడుస్తూ కిందపడే ప్రమాదంలో ఉంటుంది. ఇక మరొకవైపు రామచంద్ర జానకి విషయంలో సీరియస్ గా అడిగే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు చదువుకోవడం లేదు అని అడుగుతాడు. దీంతో జానకి నాకు ఐపిఎస్ చదువు ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా అంటే కుటుంబమే ముఖ్యం అనే ఆలోచనకు వచ్చాను. అందుకే చదువు వదిలేసాను అని చెబుతుంది. మరి ఆమె నిర్ణయం పై రామచంద్ర ఎలా స్పందిస్తాడో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 435
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X