For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 7th Episode: మాటలతో జానకిని గాయపరిచిన రామ.. మొదటిసారి గుండె బద్దలయ్యేలా..

  |

  జానకి కలగనలేదు సీరియల్ లో అసలు ఘట్టం మొదలైనట్లు అనిపిస్తోంది. ఇంతవరకు రామచంద్ర, జానకి మధ్య ఎలాంటి విభేదాలు రాలేవు. జానకి ఎంతో పెద్ద నిజాలను దాచినా కూడా భర్త రామ వాటిని పెద్దగా పట్టిఎంచుకోలేదు. వీలైనంత వరకు జానకి కోసం ఆమెను కాపాడాలని అనుకుంటూ వస్తున్నాడు. జానకి ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా ఆమెకు మద్దతుగా నిలిచాడు. అయితే మొదటిసారి జానకి అత్త మాటకు ఎదురు చెప్పడంతో భర్త రామచంద్ర తీవ్ర స్థాయిలో అప్సెట్ అయ్యాడు. మొదటిసారి వారి మధ్య గొడవలు పెరుగుతున్నాయి.

  ఐపీఎస్ అవ్వాలని జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా వేసే అడుగులకు భర్త రామచంద్ర కూడా తోడుగా వస్తున్నాడు. అబద్దాలు అంటేనే గిట్టని జ్ఞానాంబ ముందు జానకి పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటుంది. మరోవైపు మల్లిక పగతో అంతకంతకూ రెచ్చిపోతూనే ఉంటుంది. రొటీన్ గా అత్త కోడళ్ల గొడవలు కాకుండా క్యూట్ రొమాంటిక్ సీన్స్ కూడా హైలెట్ అవుతున్నాయి. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని పరిస్థితులను క్రియేట్ చేస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 122వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవి హాట్ ఫొటోలు.. 'కార్తీక దీపం'లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

  కీలకం నిర్ణయం

  కీలకం నిర్ణయం

  వరలక్ష్మి పూజ కోసం ప్రత్యేకంగా ఇంట్లో వాళ్ళు అందరు కూడా తోట లోకి వెళ్లి సంబరాలు చేసుకోవడం ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడే జ్ఞానాంబ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. అందరితో ఆటలు ఆడిన తర్వాత ఆ విషయాన్ని చెప్పాలని అనుకుని చేతిలో ఉన్న తాళాలను అమ్మవారి ముందు ఉంచుతుంది. ఇక ఆ తర్వాత ఈ రోజు మనం అందరం ఎంతో సంతోషంగా ఉండాల్సిన రోజు ఉంటూ ఏ టెన్షన్ పెట్టుకోకుండా సరదాగా గడపాలని చెబుతుంది.

  ఇంటి బాధ్యతను జానకి చేతుల్లో..

  ఇంటి బాధ్యతను జానకి చేతుల్లో..

  ఇక ఆట పాటలు ముగిసిన అనంతరం జ్ఞానాంబ తీసుకోవాలనుకున్న నిర్ణయం ఏమిటి అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న తాళాలును జానకి చేతుల్లో పెట్టి ఇక నుంచి మొత్తం బాధ్యత కూడా నీదే అని జ్ఞానాంబ చెబుతోంది. మన ఇంటి పరువు కాపాడే అర్హత నీకు ఉందని ఒక్కరోజులోనే నువ్వు మనకు ఐదు లక్షలు లాభాన్ని అందించేలా వ్యాపార సలహాలు ఇచ్చావు భవిష్యత్తులో కూడా నీ నిర్ణయాలు కుటుంబ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే నా బాధ్యతలు నీ చేతుల్లో పెడతాను అంటూ జ్ఞానాంబ చెబుతుంది.

  అందరిలో సంతోషం.. మల్లికలో గుబులు

  అందరిలో సంతోషం.. మల్లికలో గుబులు

  జ్ఞానాంబ ఆలోచనకు అందరూ సంతోషిస్తూ ఉండగా మల్లిక మాత్రం గుండె బద్దలయ్యేలా ఆలోచిస్తుంది. ఇంటి పెత్తనం మొత్తం ఇస్తే ఇక నా పని అయిపోయినట్టే అని కంగారు పడుతుంది. భర్త రామచంద్ర తో పాటు మామయ్య గోవిందరాజులు కూడా ఆ నిర్ణయానికి ఎంతగానో సంతోషిస్తారు తప్పకుండా జానకి మన ఇంటి పరువు బాధ్యత కూడా సక్రమంగా నిర్వర్తిస్తుందని గోవిందరాజులు కూడా పాజిటివ్ గా కనిపిస్తూ ఉంటాడు.

  షాక్ ఇచ్చిన జానకి

  షాక్ ఇచ్చిన జానకి

  అయితే అందరూ సంతోషంగా ఉన్న సమయంలో జానకి ఎవరూ ఊహించని విధంగా ఒక సమాధానం ఇస్తుంది. ఇంటి బాధ్యత తాను తీసుకోలేనని ఉంటూ నన్ను క్షమించాలి అని అంటుంది. ఎంతమాత్రం ఆ బాధ్యతలు నేను నిర్వర్తించలేనని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మల్లిక కూడా ఒక్కసారిగా కన్ఫ్యూజన్లో పడుతుంది. ఇంత మంచి అవకాశం వస్తే ఎందుకు వద్దు అని ఉంటుంది అని ఆలోచనలో పడుతుంది

  జానకిపై రామ ఆవేశం..

  జానకిపై రామ ఆవేశం..

  అమ్మ బాధ పడుతుంది అని తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో బాధ పడతారు. ఇది కేవలం మీ నిర్ణయం వల్లనే ఉంటూ రామచంద్ర కూడా జానకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అమ్మ చెప్పినట్లుగా ఇంటి తాళాలు తీసుకుని మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని ఒక విధంగా హెచ్చరిక చేస్తాడు. అయినప్పటికి జానకి ఏమాత్రం పట్టించుకోదు. ఇక మరోవైపు గోవిందరాజులు కూడా రామచంద్ర కోపం తగ్గించుకోవాలి అని చెబుతాడు. అయినప్పటికీ రామచంద్ర మొదటిసారి జానకి పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తాడు.

  ఏదో రహస్యం ఉందని..

  ఏదో రహస్యం ఉందని..

  అందరూ సైలెంట్ గా ఇంటికి వస్తున్న సమయంలో జ్ఞానాంబ మాత్రం ఒంటరిగా కూర్చుని దిగులుగా ఉంటుంది. మరోవైపు మల్లిక అతి తక్కువ కన్ఫ్యూజన్ లో పడుతుంది. అసలు ఇంత మంచి అవకాశం వస్తే ఎవరు కూడా వదిలి పెట్టుకోరు. అలాంటిది జానకి ఆ బాధ్యతను ఎందుకు తీసుకోవడానికి నిరాకరించింది అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఏదో రహస్యం ఉందని అనుకుంటుంది. ఇక జ్ఞానంబని చూస్తూ జానకి కూడా ఇంట్లో అలాగే నిలబడి ఉంటుంది. కొద్దిసేపటికి హఠాత్తుగా లేచి లోపలికి వెళ్ళి పోతుంది.

  జానకి మనసును గాయపరిచిన రామ

  జానకి మనసును గాయపరిచిన రామ

  ఇక రామచంద్ర షాపులో ఉంటూ జానకి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో గిరాకి రాగా కాస్త కన్ఫ్యూజన్ అవుతాడు. అప్పుడే జానకి కూడా ఫోన్ చేయడంతో కట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక చివరికి ఫోన్ కాల్ ఎత్తి పనిలో ఉన్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అని అప్సెట్ అవుతాడు. ఆ మాటలకు జానకి కూడా కంటతడి పెట్టుకుంటుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జానకి పై రామచంద్ర ఆగ్రహాన్ని చూపిస్తాడు. మీకు ఎదుటి మనిషిని బాధ పెట్టే ఆలోచన ఉందని సూటిపోటి మాటలతో బాధపెడతాడు.

  Real Reason behind memes and trolls on Thaman | Filmibeat Telugu
  అమ్మ మాటకు విలువ ఇవ్వరా?

  అమ్మ మాటకు విలువ ఇవ్వరా?

  ఇక చివరికి ఇంటికి వచ్చినప్పుడు జానకి భర్తతో అర్థమయ్యేలా చెప్పాలనుకుంటుంది అయినప్పటికీ రామచంద్ర ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. నా భర్త మనసు ఏంటో నాకు తెలియదా? అని జానకి అన్నప్పుడు.. ఎందుకు రామచంద్ర మరి ఇన్ని తెలిసిన మీకు భర్త మనసు బాధ పెట్టే విషయం సరికాదని తెలియదా అని అంటారు.

  అలాగే అత్తయ్య హ్యాపీగా లేకపోతే భర్త కూడా బాధ పడతాడు అనే విషయం తెలియదా? అని కౌంటర్ ఇస్తాడు. నమ్మకంతో ఇంటి బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని తీసుకోవాలని ధర్మ ఉండాలి కదా. అమ్మ మాటకు విలువ ఇవ్వాలి అని అంటారు. ఈ విషయం నన్ను ఎంతగానో బాధ పెడుతుంది. అది ఎన్ని రోజులైనా పోదు అంటూ రామచంద్ర మరోసారి మనసును గాయపరిచి వెళ్లిపోతాడు. మరి జానకి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 122
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X