Don't Miss!
- Sports
IND vs NZ: చెలరేగిన రోహిత్ శర్మ.. భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం!
- Lifestyle
2023లో బుధగ్రహం నుండి పంచ మహాపురుష రాజయోగం: ఈ 5 రాశుల వారికి రాజయోగం చాలా శుభప్రదం!ఇందులో మీ రాశి ఉందా?
- News
Wife: కాన్ఫు కోసం వెళ్లిన మహిళ, 50 రోజుల బిడ్డను చంపేసి తల్లి ఆత్మహత్య, విలన్ ఎవరంటే !
- Finance
Wipro Layoffs: ఫ్రెషర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. 452 మంది తొలగింపు..
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Technology
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
Janaki Kalaganaledu Weekly Roundup: మాధురిని మర్థర్ చేసే ప్లాన్ లో న్యూ ట్విస్ట్.. తెలివిగా కనిపెట్టిన జానకి
జానకి కలగనలేదు సీరియల్ డిసెంబర్ మొదటి వారం వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

డిసెంబర్ 5వ ఎపిసోడ్
రామచంద్రను జానకి సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక రామచంద్ర కూడా ప్రేమతో జానకి నడుమును గిల్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నన్ను రెచ్చగొట్టొద్దు అని చెప్పినప్పటికీ కూడా జానకి అలానే చేయడంతో రామచంద్ర ఆమెను పట్టుకొని ఒక్కసారిగా కౌగిలించుకుంటాడు.
ఇక తర్వాత ఈరోజు చా సంతోషంగా ఉన్నాను అని.. ఎందుకంటే మా ఈరోజు మా అమ్మ నాన్న పెళ్లి రోజు అని చెప్పడంతో రామచంద్ర కూడా కొంత ఆలోచనలో పడతాడు. అయితే నేను బాధపడడం వాళ్లకు ఇష్టం ఉండదు అని జానకి చెబుతుంది. ఇక రామచంద్ర వాళ్లకు ఎంతో ఇష్టమైన ఐపిఎస్ చదవును ఎందుకు వదిలేయాలని అనుకుంటున్నారు అని, మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఆలోచించాలని అని మోటివేట్ చేస్తాడు.

డిసెంబర్ 6 వ ఎపిసోడ్
ఇక మల్లిక జానకి ఎక్కడ తన దొంగ ప్రెగ్నెన్సీ గురించి చెబుతుందో అని భయపడుతూ ఉంటుంది. మరొక వివాదంలో జానకిని ఇరికిస్తే తన గొడవ మరిచిపోతుంది అని అనుకుంటుంది. అయితే జానకి ఏం చేయాలని ఆలోచిస్తున్నా సమయంలో ఆమె పుస్తకాలు పట్టుకోవడం చూస్తుంది.
జానకి మళ్ళీ చదివింది అంటే సమస్య మొదలైనట్లే అని ఇప్పుడు ఏం చేయాలో అని ఆమె బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది. ఇక మల్లిక దొంగ ప్రెగ్నెన్సీ విషయంలో జానకి మరొక కీలక నిర్ణయం తీసుకుంటుంది. నువ్వే స్వయంగా వెళ్లి అత్తయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణలు చెబుతూ నీ దొంగ ప్రెగ్నెన్సీ నాటకం బయట పెట్టాలి అని హెచ్చరిస్తుంది. మల్లిక కూడా అత్తగారికి అసలు విషయం చెబుతుంది.

డిసెంబర్ 7 వ ఎపిసోడ్
అఖిల్ ఫ్రెండ్ మాధురి తలకు ముందు భాగంలో ఎవరో రాడ్డుతో కొట్టడం వలన మరింత తీవ్రంగా గాయాలు అయ్యాయి అని అందుకే ఆమె కోమల్లోకి వెళ్ళింది అని డాక్టర్ చెబుతుంది. అయితే అఖిల్ మాత్రం వెనకాల నుంచి కర్రతో కొట్టాడు కదా అని జానకి చెబుతుంది. మళ్ళీ సందిగ్ధంలో పడిన జానకి అసలు విషయం తెలుసుకోవడానికి మాధురి కింద పడిపోయిన స్థలానికి ఒకసారి వెళుతుంది. అక్కడ ఆమె పరీక్షించిన తర్వాత ఒక ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం ఎవరిదాని కనుక్కోవడానికి ఆమె ఒక గోల్డ్ షాప్ దగ్గరకు వెళుతుంది. ఆ ఉంగరం కన్నబాబుది అని తెలిసి షాక్ అవుతుంది.

డిసెంబర్ 8వ ఎపిసోడ్
మల్లిక దొంగ ప్రెగ్నెన్సీ విషయంలో నీలావతి డాక్టర్ కు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పలని అంటుంది. ఇక నీలావతి పై జానకి అనుమానం వ్యక్తం చేస్తుంది. కానీ నీలావతి అప్పుడే అక్కడి నుంచి జంప్ అవుతుంది. ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో మల్లికకు కడుపు పోయిందని అందరూ బాధపడుతూ మల్లికను ఇంటికి తీసుకు వెళతారు. మరో ఐదు నెలల్లో మల్లిక ఇంటికి వారసుడిని తీసుకొస్తుంది అని అందరూ సంతోషంగా ఉండగా ఇలా జరగడం బాధాకరమని రామచంద్ర జానకి తో చెబుతూ ఉంటాడు. మీరు కూడా ఈ విషయంలో బాధపడి ఉంటారు అని అంటాడు. కానీ జానకి మాత్రం నేను బాధపడలేను అని చెబుతుంది. అసలు మల్లికా ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు.

డిసెంబర్ 9వ ఎపిసోడ్
పోలీసులు సునంద దేవి ఇంటికి వచ్చి కన్నబాబుని అరెస్ట్ చేయాలని అనుకుంటారు. కానీ సునంద దేవి మాత్రం కొడుకుని అరెస్ట్ చేస్తే పరువు పోతుందని తన డ్రైవర్ మీద కేసును పెట్టిస్తుంది. ఇక ఆ తరువాత జానకి తన ఇంట్లో మాధురిపై జరిగిన హత్యప్రయత్నం కన్నబాబు చేసినట్లు చెబుతుంది. దీంతో జ్ఞానాంబ అలాగే అందరూ కూడా షాక్ అవుతారు. అలాగే అఖిల్ ఎలాంటి తప్పు చేయలేదు అని నిజం తెలియడంతో అందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా రామచంద్ర అయితే తన తమ్ముడు తప్పు చేయడని తనకి ముందే తెలుసని అంటాడు. ఇక జానకి నిజం తెలుసుకొని ఒక ఆడపిల్ల గురించి ఆలోచించడంపై కూడా జ్ఞానాంబ మెచ్చుకుంటుంది. ఇక ఆ తరువాత జానకి సునంద దగ్గరికి వెళ్లి హెచ్చరిక చేస్తుంది.