»   » 'జనతాగ్యారేజ్' కొత్త రికార్డ్... అఫీషియల్ ప్రకటన, దటీజ్...ఎన్టీఆర్ సత్తా

'జనతాగ్యారేజ్' కొత్త రికార్డ్... అఫీషియల్ ప్రకటన, దటీజ్...ఎన్టీఆర్ సత్తా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌కి 2016 బాగా కలిసొచ్చింది. కెరర్ పరంగా కొద్దిగా వెనక్కి వెళ్లిన ఆయన ఊహించని వేగంతో రికార్డ్ లు బ్రద్దలుకొడుతూ ముందుకు వచ్చారు. ఆయని కి అది నిజంగా ఇది గోల్డెన్ ఇయర్. యంగ్ టైగర్ కు దాదాపు 12 ఏళ్లుగా సరైన హిట్ పడలేదు.

జనతా గ్యారేజ్ సక్సెస్ సందర్భంగా ఎన్టీఆర్ స్వయంగా ఈ సంగతి చెప్పాడు. ఇంతకాలానికి తన కృషి ఫలించిందన్నాడు. ఇన్నేళ్లుగా హిట్ కోసం తపించానన్నాడు. అలాంటిది ఒకే ఏడాది రెండు హిట్స్ కొట్టేసి నిజంగా టైగర్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా జనతాగ్యారేజ్ అయితే జెన్యూన్ గా ఇప్పటికీ రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది.


ఈ విషయం మాకు తెలుసు కదా ..మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటారా. ఇప్పుడు ఆయన సూపర్ హిట్ జనతాగ్యారేజ్...2016 లో ఎక్కువ మంది టీవిలో చూసిన తెలుగు చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. తెలుగులోని అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ప్రసారం చేసిన చిత్రాల్లో ఇది టాప్ లో నిలిచింది. BARC ఇండియా వారు ఈ విషయం ఎనౌన్స్ చేసారు. BARC టీవి ఆడియన్స్ మోటరింగ్ ఏజన్సీ.


Janatha Garage: Most watched Telugu movie on TV

ఇక జనతాగ్యారేజ్ చిత్రాన్ని మాటీవి 50 రోజులు పూర్తి కాకుండానే ప్రసారం చేసేసింది. ఈ విషయంలో అభిమానులు మండిపడ్డారు. అయితే ఈ రోజు ఈ చిత్రమే హైయిస్ట్ రేటింగ్ తెచ్చుకున్న చిత్రంగా నిలివటం జరిగింది.


ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోని కలెక్షన్లతో భాక్సాఫీస్ ని దున్నేసింది. అలాగే.. తెలుగు చిత్ర పరిశ్రమలో.. బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తరువాత మూడో అతిపెద్ద తెలుగు హిట్ గా నిలిచింది.


మరోప్రక్క ..బాక్సాఫీస్ కలెక్షన్స్ లో ఇంతకు ముందు ఎన్నడూ ఏ టాలీవుడ్ హీరోకూ దక్కని రికార్డు ఎన్ టిఆర్ కు దక్కింది అదీ జనతాగ్యారేజ్ రూపంలో. జయహో జనతా అంటున్నారు అభిమానులు. రికార్డుల సునామీ సృష్టించారు. ఎన్టీఆర్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.


ఈ సినిమాతో జూనియర్ నెలకొల్పిన కొత్త రికార్డ్ ఏంటంటే...ఎన్టీఆర్ ఈ ఏడాది 200 కోట్ల రూపాయల కలెక్షన్ రికార్డును క్రియేట్ చేసాడు. ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు... నాన్నకు ప్రేమతో..., జనతాగ్యారేజ్ ఈ ఏడాది రిలీజయ్యాయి. మొదటిది సెంటిమెంట్ మూవీ అయితే... రెండోది మెసేజ్ మూవీ. నాన్నకు ప్రేమతో... సినిమా వరల్డ్ వైడ్ గా 90 కోట్లు కలెక్ట్ చేసింది.

English summary
Now 'Janatha Garage' film has emerged as the most watched Telugu movie on Television in year 2016, as per the latest announcement of BARC India, TV audience monitoring agency.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu