»   » రాంగోపాల్ వర్మకు దిమ్మ తిరిగే షాక్.. జీఎస్టీకి ఝలక్!

రాంగోపాల్ వర్మకు దిమ్మ తిరిగే షాక్.. జీఎస్టీకి ఝలక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Gopal Varma's GST Removed From Youtube

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) వీడియో డ్యాక్యుమెంటరీని రూపొందించిన రాంగోపాల్ వర్మకు ఎదురుదెబ్బ తగిలింది. కాపీరైట్ వివాదంలో చిక్కకున్న జీఎస్టీ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించడంతో వర్మకు దిమ్మ తిరిగే షాక్ తగలింది. సినీ రచయిత జయకుమార్ ఫిర్యాదు మేరకు కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద జీఎస్టీ వీడియోను తొలగించినట్టు ఓ ప్రకటనను యూట్యూబ్‌ పెట్టడం గమనార్హం. దీంతో వర్మపై జయకుమార్ పై చేయి సాధించినట్టు అయింది.

 యూట్యూబ్‌ నుంచి జీఎస్టీ అవుట్

యూట్యూబ్‌ నుంచి జీఎస్టీ అవుట్

ఈ సందర్భంగా సినీ రచయిత జయకుమార్ మాట్లాడుతూ.. కాపీరైట్ ఉల్లంఘన అంశంతో నేను చేసిన ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మ తీసిన జీఎస్టీ వీడియోను యూట్యూబ్ తొలగించింది. జనవరి 26న నేను ఫిర్యాదు చేశాను. నా ఫిర్యాదుపై స్పందించి యూట్యూబ్ నుంచి జీఎస్టీని తొలగించింది.

 అందుబాటులో లేని జీఎస్టీ

అందుబాటులో లేని జీఎస్టీ

జీఎస్టీ వీడియోను ప్రమోట్ చేస్తూ రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ లింకును షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ లింక్‌ను క్లిక్ చేయగా.. ఈ వీడియో అందుబాటులో ఉండదు. జయకుమార్ చేసిన కాపీరైట్ ఉల్లంఘన ఫిర్యాదు మేరకు దానిని తొలగించాం అని ఓ ప్రకటన కనిపిస్తున్నది.

 ఆర్జీవీపై పోరాటానికి ఫలితం

ఆర్జీవీపై పోరాటానికి ఫలితం

నేను రాసిన స్క్రిప్టును రాంగోపాల్ వర్మ దుర్వినియోగం చేశాడు. నా కథను వాడుకొని కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించాడు. ఆర్జీవిపై నేను చేసిన పోరాటానికి ప్రతిఫలం దక్కింది. వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే నా ప్రయత్నానికి ముందడుగు పడింది అని జయకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

 అధికారుల సహకారం లేకుంటే

అధికారుల సహకారం లేకుంటే

జీఎస్టీ విషయంలో కాపీరైట్ ఉల్లంఘన వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాను. అమెరికాలోని పెటెంట్, కాపీరైట్ చట్టం అధికారి శ్రీనివాస్, హైదరాబాద్ మేధోసంపత్తి హక్కుల న్యాయవాదుల సహాకారం మరువలేనిది. ఈ పోరాటంలో నాకు అండగా నిలిచిన మీటూ బృందం, నా స్నేహితులు, సన్నిహితులకు రుణపడి ఉంటాను అని జయకుమార్ అన్నారు.

త్వరలో స్వచ్ఛంద సంస్థ

త్వరలో స్వచ్ఛంద సంస్థ

కాపీరైట్, పెటెంట్, మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన, కథా చౌర్యంపై పోరాటం చేయడానికి నేను ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్నాను. స్రవంతి జూలూరి, సంగీత దర్శకుడు రాజశేఖర్ లాంటి వ్యక్తులు నా ఎన్జీవోలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. అందరి సహకారంతో కథాచౌర్యం అనే జాడ్యంపై పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాం అని జయకుమార్ తెలిపారు.

English summary
Ram Gopal Varma's God, Sex and Truth removed from youtube channel on complaint of Writer Jayakumar. As per Jayakumar, Youtube has taken down RGV's GST based on my copyright claims. I filed my claim on 26th Jan and Youtube has responded saying that the video is removed. The video is now replaced with a message which reads: "RGV's God, Sex and Truth tr..." This video is no longer available due to a copyright claim by P Jaya Kumar."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu