»   » 'మాటీవీ' పై మండిపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

'మాటీవీ' పై మండిపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆల్రెడీ ఇంతకు ముందు ఓ సారి ఎన్టీఆర్ విషయమై మాటీవి పై సోషల్ మీడియాతో రచ్చ జరిగింది. అప్పట్లో ఎన్టీఆర్ మాట్లాడిన ప్రసంగాన్ని మాటీవి అడ్డంగా ఎడిట్ చేసి, తనకు తోచిన వెర్షన్ ని ప్రసారం చేసిందే ప్రచారం జరిగింది. ఆ విషయమై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడ్డారు.

ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ అభిమానుల అగ్రహానికి మాటివి గురి అయ్యింది. మాటీవిపై ఎన్టీఆర్ వీరాభిమానులు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా లో ఈ విషయమై పెద్ద దుమారమే రేగుతోంది. ఈ సారి కారణం జనతాగ్యారేజ్ ప్రసారం గురించి.

ఇది ఎన్టీఆర్ 'సర్కార్' ... ('జనతా గ్యారేజ్‌' రివ్యూ)

పూర్తి వివరాల్లోకి వెళితే.. గత నెలలో ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోని కలెక్షన్లతో భాక్సాఫీస్ ని దున్నేసింది. అలాగే.. తెలుగు చిత్ర పరిశ్రమలో.. బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తరువాత మూడో అతిపెద్ద తెలుగు హిట్ గా నిలిచింది.

Jr.NTR Fans angry on MAA TV

అయితే ఇప్పుడు అభిమానులకు జనతా గ్యారేజ్ విషయంలో ఎదురైన సమస్య ఏమిటీ అంటే.. ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోగానే, అలా మాటీవిలో రాబోతోంది. ఈ నెల 23వ తేదిన ఈ సినిమాని సాయంత్రం 5:30 గంటలకి టెలికాస్ట్ చేయనుంది మాటీవి. ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులకి నచ్చట్లేదు. మాటీవిలో వారిని సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు. అక్కడితో ఆగకుండా ఇలా మాటివిపై తమకు తోచిన రోతిలో నిరసనలు తెలుపుతున్నారు. సినిమా ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుండగా టీవీలో ఎలా వేస్తారన్నది ఫ్యాన్స్ కోపం.

అయితే వాస్తవానికి ఇక్కడ ఎవరూ కూడా... మాటీవీని కూడా తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే శాటిలైట్స్ హక్కులను అమ్మేటప్పుడు నిర్మాతకు ఛానల్‌కు మధ్య పక్కా అగ్రిమెంట్ ఉంటుంది. ఎన్ని రోజుల తర్వాత సినిమాను టీవీలో టెలికాస్ట్ చేయవచ్చన్నది అగ్రిమెంట్‌లో స్పష్టంగా రాసుకుంటారు. కాబట్టి జనతా గ్యారేజ్ వంద రోజులు పూర్తి కాకుండానే మాటీవీ ప్రసారం చేస్తే, అది నిర్మాత తప్పు అవుతుంది కానీ టీవీ చానెల్ ది కాదు కదా... ఏమంటారు.

English summary
Tarak fans are very excited and they want that Janatha Garage will have the run of 100 days too in theaters but MAA TV Chaneel, that acquired the Satellite rights of Janatha Garage is going to telecast it on 23rd October.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu