For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Evaru Meelo Koteeswarulu షోకు బిగ్ షాక్: భారీగా తగ్గిపోయిన రేటింగ్.. దీని వెనుక కారణం ఇదే

  |

  తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో కొత్త కొత్త కాన్సెప్టులతో కార్యక్రమాలు వస్తున్నాయి. అందులో కేవలం కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులు దోచుకుని సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అలాంటి వాటిలో క్విజ్ ఆధారంగా నడిచే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. దాదాపు 100కు పైగా దేశాల్లో ప్రసారం అవుతోన్న ఈ కార్యక్రమం చాలా కాలం క్రితమే 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' అనే పేరుతో ఇండియాలోకి వచ్చింది.

  ఆ తర్వాత పలు భాషల్లోకి పరిచయమైంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఐదోది కూడా ప్రసారం అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి తాజాగా భారీ షాక్ తగిలింది. ఆ వివరాలు మీకోసం!

  నాలుగు సీజన్లు.. ఇద్దరు స్టార్ హీరోలు

  నాలుగు సీజన్లు.. ఇద్దరు స్టార్ హీరోలు

  అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' ఆధారంగా తెలుగులోకి వచ్చిన షోనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. జనరల్ నాలెడ్జ్‌ ఆధారంగా నడిచే ఈ షో మన దగ్గర కూడా విజయవంతం అయింది. ఫలితంగా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ కింగ్ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి నడిపించారు.

  Bigg Boss: ఆ కంటెస్టెంట్‌కు బుల్లితెర బ్యూటీల సపోర్ట్.. కొత్త విషయాలు బయటకు.. ఆమెకు కూడా భారీగానే!

  ఐదో సీజన్ రామారావుతో మొదలైంది

  ఐదో సీజన్ రామారావుతో మొదలైంది


  నాలుగు సీజన్ల తర్వాత 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో నిర్వహకులు గ్యాప్ తీసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్‌తో ఐదో సీజన్ మొదలు పెట్టారు. దీన్ని స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేస్తున్నారు. ఈ సీజన్‌ను టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ రామారావు హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

  ఫస్ట్ ఎపిసోడ్‌తోనే బద్దలైన రికార్డులు

  ఫస్ట్ ఎపిసోడ్‌తోనే బద్దలైన రికార్డులు

  భారీ అంచనాలతో 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను ఆగస్టు 22న అంగరంగ వైభవంగా ప్రారంభించారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సారథ్యంలో మొదలైన ఈ సీజన్‌ కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఎపిసోడ్‌కు 11.40 రేటింగ్ దక్కింది. దీంతో ఈ షో చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  చరిత్ర సృష్టించారు.. అసంతృప్తిగానే

  చరిత్ర సృష్టించారు.. అసంతృప్తిగానే


  సామాన్యులను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మొదలైన షోనే 'ఎవరు మీలో కోటీశ్వరులు'. ఇప్పుడు ఐదో సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేస్తుండడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మొదటి వారం సగటున దీనికి 5 పైచిలుకు రేటింగ్ దక్కింది. గతంలో కంటే ఇది ఎక్కువే అయినా.. ఎన్టీఆర్ రేంజ్‌కు మాత్రం చాలా తక్కువే అని అనుకుంటున్నారు.

  వారం వారం పెరుగుతోన్న స్పందన

  వారం వారం పెరుగుతోన్న స్పందన


  'ఎవరు మీలో కోటీశ్వరులు' ఫస్ట్ వీక్ రేటింగ్ పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత నుంచి దీనికి ప్రేక్షకుల స్పందన క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ అద్భుతమైన హోస్టింగ్‌తో ఇది ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తోంది. దీంతో రెండో వారం 6కు దగ్గరగా రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత మూడో వారం కూడా మరికాస్త పెరిగింది. నాలుగో వారం ఏకంగా 6.18 రేటింగ్ దక్కింది.

  బెడ్‌పై అర్ధనగ్నంగా ఇలియానా రచ్చ: వామ్మో అదొక్కటి అడ్డు లేకుంటే అంతే సంగతులు

   ఐదో వారం ఎన్టీఆర్ షోకు భారీ షాక్

  ఐదో వారం ఎన్టీఆర్ షోకు భారీ షాక్


  ఎన్నో అంచనాల నడుమ ప్రసారం అవుతోన్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు టీఆర్పీ రేటింగ్ వారం వారం పెరుగుతూ వచ్చింది. దీంతో ఐదో వారం ఇది సరికొత్త రికార్డును నెలకొల్పడం ఖాయమన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బార్క్ రిలీజ్ చేసిన రేటింగ్‌లో ఈ షోకు భారీ షాక్ తగిలింది. ఈ వారానికి సగటున 4.70 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది.

  Recommended Video

  NTR Buys Fancy Number For 17 Lakhs | Lamborghini Urus || Filmibeat Telugu
  షో రేటింగ్ పడిపోడానికి కారణమిదే

  షో రేటింగ్ పడిపోడానికి కారణమిదే


  జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ఐదో వారం టీఆర్పీ రేటింగ్ పడిపోడానికి కారణం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుస్తోంది. సరిగ్గా ఈ షో ప్రసారం అయ్యే సమయంలోనే మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయి. అందుకే దీనికి ఆదరణ తగ్గిపోయిందని అంటున్నారు. రాబోయే రోజుల్లో రేటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని టాక్.

  English summary
  Jr NTR's Doing Evaru Meelo Koteeswarulu Show in Gemini Tv. Now This Show Got 4.70 TRP in 5th Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X