For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Evaru Meelo Koteeswarulu నుంచి ఊహించని ప్రకటన: తారక్ డైలాగ్స్ కేక.. ప్రోమోనే ఇలా ఉంటే షో ఎలా!

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తుంటాయి. అయితే, వాటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి మద్దతు, ఆదరణ దక్కుతూ ఉంటుంది. అలా ఎక్కువ రెస్పాన్స్‌తో సూపర్ డూపర్ హిట్ అయిన షోలలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. క్విజ్ నేపథ్యంతో సాగే ఈ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' ఆధారంగా మొదలైంది. ఈ క్రమంలోనే తెలుగులో నాలుగు సీజన్లను సైతం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఐదోది కూడా మొదలవబోతుంది. తాజాగా దీని గురించి ఓ అదిరిపోయే ప్రోమో వీడియో విడుదలైంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  Jr NTR, Man Of Masses తారక్ ని Troll చేసేవాళ్ళు చూడాల్సిన వీడియో | #KomarbheemNTR | Filmibeat Telugu
  తెలుగులో ప్రారంభం.. స్టార్ హీరోలతో

  తెలుగులో ప్రారంభం.. స్టార్ హీరోలతో

  తెలుగులో సామాన్యుల షోగా మొదలై సూపర్ సక్సెస్ అయిన షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. సరికొత్త కంటెంట్‌తో వచ్చిన ఈ షో.. ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం చిరంజీవి హోస్ట్ చేశారు. షో జరిగే తీరుకు వీళ్ల హోస్టింగ్ తోడవడంతో ఇది సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.

  BiggBossTelugu5 నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్: అసలైంది రివీల్ చేసిన బిగ్ బాస్.. ఈ సారి చాలా కొత్తగా!

  సరికొత్తగా ఐదో సీజన్.. అంచనాలతో

  సరికొత్తగా ఐదో సీజన్.. అంచనాలతో

  సూపర్ హిట్ షోగా పేరొందిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగు సీజన్లు పూర్తైనా కంటిన్యూ చేయలేదు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత ఈ షోను తీసుకొస్తున్నారు. అయితే, ఈ సారి దీనికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు' అని పేరు మార్చారు. అంతేకాదు, ఈ సారి ఈ షోను స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేయబోతున్నారు. అలాగే, కంటెంట్‌లోనూ కొన్ని మార్పులు చేశారు.

  కోవిడ్ ఎఫెక్టుతో షో చాలా ఆలస్యంగా

  కోవిడ్ ఎఫెక్టుతో షో చాలా ఆలస్యంగా

  గ్యాప్ తర్వాత వస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రోమోను ఆ మధ్య విడుదల చేశారు. ‘మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ‘‘ఎవరు మీలో కోటీశ్వరులు'' త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి' అంటూ వీడియో ద్వారా ప్రకటించారు. కానీ, ఆ తర్వాత కరోనా సెకెండ్ వేవ్ కారణంగా షూట్ లేట్ అయింది. దీంతో ప్రసారం కూడా ఆలస్యమైంది.

  తారక్ రీఎంట్రీ... ఈ సారి రామారావు

  తారక్ రీఎంట్రీ... ఈ సారి రామారావు

  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'ను గతంలో ఇద్దరు సీనియర్ హీరోలు నడిపించగా.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ షోను సక్సెస్‌ చేసిన అతడు.. ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు'ను కూడా అదే రీతిలో నడిపించేందుక రెడీ అవుతున్నాడు. అతడి పరిచయ ప్రోమోలో తన పేరు రామారావు అని చెప్పిన తారక్.. ఈ గేమ్‌ షోపై అంచనాలను పెంచేశాడు.

  షూట్ పూర్తి.. ఏకంగా అన్ని ఎపిసోడ్స్

  షూట్ పూర్తి.. ఏకంగా అన్ని ఎపిసోడ్స్

  తాజా సమాచారం ప్రకారం.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు సంబంధించి ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తైందట. అంతేకాదు, మొదటి షెడ్యూల్‌లో భాగంగా ఏకంగా 16 ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. అందులో ప్రారంభ ఎపిసోడ్ కూడా ఉందని అంటున్నారు. అలాగే, రామ్ చరణ్‌తోనూ ఓ ఎపిసోడ్ చేశారని తెలిసింది. ఇవన్నీ ఎంతో చక్కగా వచ్చాయన్న టాక్.

  అందాలు ఆరబోస్తూ సెగలు రేపుతోన్న బాలయ్య హీరోయిన్: బ్యూటీ దెబ్బకు సోషల్ మీడియా షేక్

  షో నుంచి అదిరిపోయే ప్రోమో రిలీజ్

  ‘ఎవరు మీలో కోటీశ్వరులు' నుంచి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో ఓ టీచర్‌ కరోనా పరిస్థితుల కారణంగా ఉద్యోగం కోల్పోతాడు. దీంతో రోడ్డు పక్కన హోటల్ పెట్టుకుని నడుపుతుంటాడు. అలాంటి సామాన్యుడికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు' ఛాన్స్ వస్తుంది. అందులో అతడు రూ. 25 లక్షలు గెలుస్తాడు. ఆ తర్వాత గేమ్ ఆడేందుకు వచ్చిన వ్యక్తి ఇచ్చిన మెసేజ్ అదిరిపోయింది.

  సెంటిమెంట్‌తో కొట్టిన యంగ్ టైగర్

  సెంటిమెంట్‌తో కొట్టిన యంగ్ టైగర్

  ఈ ప్రోమోలో రూ. 25 లక్షలు గెలిచిన వ్యక్తి ఆ డబ్బులో సగం స్టూడెంట్లకు ఇస్తానని అంటాడు. దీంతో అతడిని అభినందించిన తారక్ ‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది.. కల మీది. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటీశ్వరులు' అని డైలాగ్ చెబుతాడు. ఇక, ఈ సీజన్‌ ఆగస్టులో మొదలవుతుందని ప్రోమో చివర్లో ప్రకటించారు.

  English summary
  Jr NTR is Reentry to the small screen as a host for the upcoming season of Evaru Meelo Koteeswarulu. Now This Show Coming Soon Promo Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X