»   » గర్భవతిని చేసాడంటూ దర్శకుడిపై శ్రీజ ఫిర్యాదు

గర్భవతిని చేసాడంటూ దర్శకుడిపై శ్రీజ ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Junior Artist Sreeja
హైదరాబాద్: సినిమా అవకాశాల కోసం వచ్చే యువతులకు పరిశ్రమలోని కొందరు వ్యక్తులు అవకాశాలు ఇస్తామని మాయమాటలు చెప్పి లైంగికంగా లోబరుచుకోవడం లాంటి సంఘటనలు గతంలో పలు సందర్భాల్లో బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన మరొటి చోటు చేసుకుంది.

సినిమాల్లో హీరోయిన్ అవకాశం ఇస్తానని నమ్మించిన దర్శకుడు చాంద్ పాషా మోసం చేసాడని, తనను లైంగికంగా వాడుకుని గర్భవతిని చేసాడని శ్రీజ అనే టీవీ నటి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తనను మోసం చేస్తూ వస్తున్నాడని, ఈక్రమంలోనే గర్భవతిని చేసాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. లవ్ ఈజ్ గేమ్ అనే చిత్రంలో తనను హీరోయిన్‌ను చేస్తానని చంద్ పాషా నమ్మించాడని ఆమె తెలిపారు.

కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ అయితే బాగుండదని చెప్పపి నిర్మాతగా చేయమన్నాడని, తనతో 5 లక్షలు ఖర్చు పెట్టించాడని శ్రీజ మీడియాకు వెల్లడించింది. ఇలాంటి మోసగాడి వలలో మరెవరూ పడొద్దని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని శ్రీజ తెలిపారు. 

గర్భం తొలగించుకోవాలని ఆమెపై ఒత్తిడి తెస్తుండటంతో పాటు, బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిని శ్రీజ...నటీనటులు కావాలంటూ పేపర్లో చాంద్ పాషా ఇచ్చిన పత్రిక ప్రకటన చూసి హైదరాబాద్ ఉప్పల్‌లోని అతని కార్యాలయానికి చేరుకుని అతని వలలో చిక్కుకుంది.

శ్రీజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చాంద్ పాషాపై కేసు నమోదు చేసారు. విచారణ అనంతరం చాంద్ పాషాను అరెస్టు చేసే అవకాశం ఉంది. చాంద్ పాషాకు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీజను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి ఆమెను లైంగికంగా లోబరుచుకున్నాడని స్పష్టమవుతోంది.

English summary
Junior Artist Sreeja Filed complaint on Tollywood Director Chand Pasha. As per the reports, the Director had deceived the Junior artist by assuring her of a heroine role in his upcoming movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu