»   » ఆయనతో నాకు పోలికేంటి? అమీర్‌ఖాన్‌పై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఆయనతో నాకు పోలికేంటి? అమీర్‌ఖాన్‌పై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటుడు కమల్ హసన్ ఏది మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు. అందుకే ఆయన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారుతారు. తాజాగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌పై కమల్ హాసన్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. బిగ్ బాస్ తమిళ వెర్షన్‌కు హోస్ట్‌గా వ్యవహరించే సందర్భంగా కమల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సత్యమేవ జయతే కార్యక్రమాన్ని చేయడం ద్వారా నేను సామాజిక బాధ్యతను చెప్పుకోవాల్సిన ఖర్మ పట్టలేదు అని ఆయన అన్నారు.

హోస్ట్‌గా కమల్ హాసన్

హోస్ట్‌గా కమల్ హాసన్

దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన బిగ్ బాస్ తమిళ వెర్షన్‌కు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. హిందీలో ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. టెలివిజన్ రంగంలోకి తొలిసారి ప్రవేశిస్తూ ఈ కార్యక్రమ హోస్ట్ బాధ్యతలను ఇటీవల చేపట్టారు. ఈ సందర్భంగా సత్యమేవ జయతే లాంటి సామాజిక అంశాలున్న కార్యక్రమాన్ని వదిలేసి బిగ్ బాస్‌ను ఎందుకు ఎంచుకొన్నారు అనే ప్రశ్నకు నా సామాజిక బాధ్యత ఏంటో నాకు తెలుసు అని అన్నారు.

అమీర్‌తో నాకు పోలికా..

అమీర్‌తో నాకు పోలికా..

సత్యమేవ జయతే లాంటి కార్యక్రమాలు రాకముందే నేను అలాంటి పనులు ఎన్నో చేశాను. ఆ తర్వాత అమీర్ ఖాన్ ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. అతడితో పోల్చుకోవాల్సిన పని నాకు లేదు అని కమల్ అన్నారు. ఈ సందర్భంగా తమిళ బిగ్ బాస్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

అందరికీ నచ్చుతుంది..

అందరికీ నచ్చుతుంది..

తమిళ బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రజలు బాగా ఆదరించడం ఖాయం. ఆర్భాటమేమీ ఉండదు. సింపుల్‌గా, సహజంగా ఈ కార్యక్రమం ఉంటుంది. అందరికీ నచ్చుతుంది అని కమల్ పేర్కొన్నారు. ఈ షో కోసం రూ.1 కోటి వెచ్చించి బంగ్లాను నిర్మించారు.

జూన్ 25వ తేదీ నుంచి..

జూన్ 25వ తేదీ నుంచి..

ఈ కార్యక్రమం స్టార్ విజయ్ టెలివిజన్‌లో జూన్ 25వ తేదీ నుంచి ప్రసారం కానున్నది. ఈ కార్యక్రమంలో 14 మంది పార్టిసిపెంట్స్ దాదాపు 100 రోజులు ఈ ప్రత్యేకంగా నిర్మించిన గృహంలో ఉంటారు. ప్రతి శనివారం రోజున కమల్ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తారు.

English summary
Actor Kamal Haasan on Friday said he does not have to do a show like Aamir Khan’s Satyamev Jayate to prove he is socially responsible. Kamal has come on board as the host of the Tamil version of Bigg Boss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu