twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kannada Vs Telugu టెలివిజన్ నటుడు చందన్‌పై దాడి.. భగ్గుమన్న ప్రాంతీయ బేధాలు!

    |

    కన్నడ నటుడు, శ్రీమతి శ్రీనివాస్ ఫేమ్ చందన్‌పై తెలుగు టెలివిజన్ సీరియల్స్‌కు చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటన కన్నడ, తెలుగు టెలివిజన్ సీరియల్స్ మధ్య వివాదాస్పదంగా మారే అంశంగా కనిపిస్తున్నది. జూలై 31వ తేదీన జరిగిన దాడి ఘటన తర్వాత ఆగస్టు 1వ తేదీన బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించిన చందన్ సంచలన విషయాలను వెల్లడించారు. నటుడు చందన్ చెప్పిన విషయాల్లోకి వెళితే..

    పక్కా ప్రకారమే దాడి

    పక్కా ప్రకారమే దాడి

    శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ షూటింగ్‌లో నాపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగింది. కన్నడ నటులపై వారికి ఉన్న అసహనం, విద్వేషం కారణంగానే దాడి చేశారు. మూడు గంటలపాటు నన్ను వేధించారు. బండబూతులు తిడుతూ నన్ను గాయపరిచారు. నాపై దాడికి పాల్పడుతూ వీడియోలు చిత్రీకరించారు. వీడియోను ఎడిట్ చేసి కొన్ని సీన్ల మాత్రమే సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేశారు అని చందన్ ఆరోపించారు.

    మా అమ్మ అనారోగ్యంతో

    మా అమ్మ అనారోగ్యంతో

    శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ షూటింగ్‌లో దాడికి కారణమైన సంఘటన గురించి చందన్ వివరిస్తూ.. మా అమ్మ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరింది. టెలికాస్ట్‌కు సరిపడే ఎపిసోడ్స్ ఉండటంతో తాను షూటింగుకు రాలేనని చెప్పాను. అయినా షూటింగుకు రావాలని చెప్పడంతో నేను సరే అన్నాను. నాతో షూటింగ్ చేయకుండా నన్ను వెయిటింగ్ చేయించారు అని చందన్ మీడియా సమావేశంలో చెప్పారు.

    అసిస్టెంట్ డైరెక్టర్‌తో గొడవ

    అసిస్టెంట్ డైరెక్టర్‌తో గొడవ

    నేను గదిలో విశ్రాంతి తీసుకొంటుండగా రంజిత్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచాడు. అయితే షాట్‌ రెడీనా అంటే.. లేదు.. ఇంకా సమయం ఉందన్నాడు. దాంతో నేను రెస్ట్ తీసుకొందామని నిద్రపోయాను. ఆ తర్వాత కొద్ది సేపటికి రంజిత్ వచ్చి నాతో అమర్యాదగా మాట్లాడారు. అయితే నాతో ఎందుకు అమర్యాదగా మాట్లాడుతున్నావని నిలదీశాను. దాంతో అతను నాపైకి దూసుకొచ్చాడు. దాంతో నాతో ఇలా మాట్లాడకు అంటూ నేను అతడిని వెనుకకు తోశాను. అక్కడి నుంచి రంజిత్ బయటకు వెళ్లి నాపై కట్టుకథలు అల్లి మరోలా చెప్పాడు అని చందన్ తెలిపారు.

    చిన్న విషయాన్ని పెద్దగా చేసి వివాదంగా

    చిన్న విషయాన్ని పెద్దగా చేసి వివాదంగా

    రంజిత్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది. ముందు రోజే అతడితో పార్టీ చేసుకొన్నాం. కానీ గోటితో పోయే విషయాన్ని గొడ్డలి వరకు తెచ్చాడు. నాతో గొడవ జరిగిన వెంటనే వాళ్లు బయటి వాళ్లను పిలిచారు. నేను వెళ్తుంటే నా కారును కొందరు అడ్డగించారు. సుమారు 40 మంది నన్ను చుట్టుముట్టారు. అందులో ఒకరు నన్ను కొట్టాడు. బయటకు వినిపించకుండా దుర్బాషలాడుతూ నాపై దాడికి ప్రయత్నిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. నేను ఒక దశలో సారీ కూడా చెప్పాను. అయినా నాపై దాడికి పాల్పడ్డారు అని చందన్ మీడియాకు వెల్లడించారు.

    పథకం ప్రకారమే దాడి..

    పథకం ప్రకారమే దాడి..

    నాపై దాడి పథకం ప్రకారమే జరిగింది. నాతో షూటింగులో పాల్గొనే వారు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు నాకు సపోర్ట్ చేయలేదు.నాపై దాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఎవరూ ఆపలేరు. నాపై దాడికి ప్రయత్నించిన వ్యక్తి అసహనంతో ఊగిపోయాడు. అంకిత అనే సహచరి నటి కూడా రెండు, మూడు సందర్భాల్లో కంటతడి పెట్టుకొన్నది. బయటి వాళ్లమనే అసహనం వారిలో ఉందనే విషయం వారి ప్రవర్తన, మాటల్లో స్పష్టంగా కనిపించింది. వారు బెదిరించినప్పటికీ.. షూటింగ్‌కు ఇబ్బంది కలుగకూడదని మౌనంగా వర్క్ చేశాను అని చందన్ తెలిపారు.

    నిర్మాత కన్నడ వాళ్లే..అయినా

    నిర్మాత కన్నడ వాళ్లే..అయినా

    సీతారత్నం గారి అబ్బాయి సీరియల్ నిర్మాతలు కన్నడిగులే. నిర్మాత ప్రశాంతి నాకు బాగా పరిచయం. అందుకే నటించడానికి వెళ్లాను. కానీ నేను చేయ్యెత్తిన అబ్బాయికి క్షమాపణ చెప్పినా వినకుండా నాపై దాడికి పాల్పడ్డాడు.నాపై దాడికి పాల్పడిన వ్యక్తి క్షమాపణ చెప్పేంత వరకు నేను షూటింగుకు వెళ్లకూడదని నిర్ణయించుకొన్నాను. షూటింగ్ ప్రదేశంలో వాతావరణం సేఫ్ అనే నమ్మకం ఉంటే షూటింగ్‌కు వెళ్తాను. అలాంటి పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉంది.లేకపోతే సీరియల్ నుంచి తప్పుకొంటానుఅని చందన్ చెప్పాడు.

     కన్నడ నటుల సీరియల్స్ ఆపివేయాలని వార్నింగ్

    కన్నడ నటుల సీరియల్స్ ఆపివేయాలని వార్నింగ్

    నాపై దాడికి పాల్పడిన తర్వాత తెలుగులో ఏ కన్నడ యాక్టర్ కూడా నటించవద్దని వార్నింగ్ ఇచ్చారు. కన్నడ నటులు నటించే సీరియల్స్ ప్రసారాలను ఆపివేయాలని డిమాండ్ చేశారు. దాంతో వారి మనసులో ఉన్న విషయం బయటకు స్పష్టంగా తెలిసింది. ఈ విషయాన్ని మరింత వివాదంగా చేయడానికి నాకు ఛాన్స్ ఉంది. కానీ నేను అలా చేయదలచుకోలేదు. వారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. వారిపై కేసు నమోదు చేయవచ్చు. అలా చేస్తే నాకు వాళ్లకు తేడా ఏముంది అని చందన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

    English summary
    Kannada television and film actor Chandan was attacked on the set of a Telugu serial on July 31st. actor Chandan held a press conference in Bangalore today and spoke about it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X