»   » అయ్యో: కపిల్‌ శర్మకు అనారోగ్యం... కామెడీ నైట్స్‌కు బ్రేక్

అయ్యో: కపిల్‌ శర్మకు అనారోగ్యం... కామెడీ నైట్స్‌కు బ్రేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ హిందీ టెలివిజన్‌ ఛానల్‌లో బహుళ ప్రజాదరణ పొందిన కామెడీ షో 'కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌' వ్యాఖ్యాత కపిల్‌ శర్మ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో కార్యక్రమం చిత్రీకరణ పూర్తి కావచ్చిందని, అది కాగానే షోకి విరామం ఇచ్చి తాను కొంతకాలం విశ్రాంతి తీసుకుంటానని కపిల్‌ పేర్కొన్నారు. బాలీవుడ్‌ ప్రముఖులు తమ చిత్రాల ప్రమోషన్‌కి కపిల్‌ కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవడం తెలిసిందే.

ఇక ఆ మధ్యన ....

Kapil Sharma not well, takes break from ‘Comedy Nights With Kapil’

'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంతో స్టార్ హోదాను సంపాదించుకున్న కపిల్ శర్మ రిటైరైన పోలీస్ కుక్కను దత్తత తీసుకున్నారు. పలు సంవత్సరాలుగా పోలీసు విభాగానికి సేవలందించిన లాబ్రడార్ జాతికి చెందిన కుక్కను జంతు సంరక్షణ సంస్థ నుంచి దత్తత తీసుకున్నారు.

కపిల్ దత్తత తీసుకున్న కుక్క పేరు జంజీర్ అని ట్విటర్ లో పోటోలతోపాటు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. నా కుటుంబంలో ఓ కొత్త భాగస్వామి చేరింది. ముంబై పోలీసులకు సేవలందించింది. జంజీర్ గురించి మరిన్ని విషయాలు త్వరలో మీతో పంచుకుంటాను అని కపిల్ ట్వీట్ చేశారు.

జంతువుల సంరక్షణ పట్ల ఉన్న కపిల్ అభిరుచిని ప్రశంసిస్తున్నారు. కపిల్, ఆయన సతీమణి ప్రీతిలకు కేవలం కృతజ్క్షతలు మాత్రమే చెప్పలేమని.. జంతు ప్రేమికులను తమ సంస్థ ఎల్లప్పుడు గౌరవించడానికి సంస్థ సిద్దంగా ఉంటుందని నిర్వహకులు తెలిపారు.

English summary
Stand-up comedian Kapil Sharma is taking a break from his popular TV show “Comedy Nights with Kapil” because of bad health. The 34-year-old funnyman, whose show is one of the most favourite places for Bollywood stars to promote their upcoming films, will shoot the “last episode” with superstar Salman Khan before taking the break.
Please Wait while comments are loading...