Karthika Deepam 2 August 27th: జ్యోత్స్నకు ఎదురుదెబ్బ.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన దీపా
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 26వ తేదీ 446వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లిని ఆపాలని జ్యోత్స్న శత విధాలు ప్రయత్నిస్తుంది. కానీ జ్యోత్స్న ప్రయత్నాలేవీ ఫలించవు. శౌర్యను కిడ్నాప్ చేయాలన్న ప్లాన్ బెడిసి కొడుతుంది, పాలల్లో మత్తు మందు కలిపి ఇవ్వాలనుకున్న ప్లాన్ ను పారిజాతం చెడగొడుతుంది. చివరిగా తాళి దొంగతనం చేయాలని ప్రయత్నించి కూడా విఫలం అవుతుంది. దాంతో జ్యోత్స్న అప్సెట్ అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి మాత్రం ఆగడం లేదే అని లోలోపల కంగారు పడుతుంది. మరోవైపు తండ్రి దశరథ జ్యోత్స్న ను తన పక్కనే ఉండమని చెప్పడంతో ఇక పూర్తిగా పెళ్లిని చెడగొట్టే ప్రయత్నాలు మూసుకుపోయాయని అనుకుంటుంది. ఇక చివరిగా తాళిబొట్టును లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది. ముహుర్తం సమయం దగ్గర పడటంతో తాళిని అతిథుల అందరికీ చూపిస్తారు. ఇదే సమయంలో జ్యోత్స్న తాళిని దొంగలించాలని ప్రయత్నిస్తుంది. కానీ అలా చేయదు.
అయితే చివరల్లో తాళి కట్టించే సమయానికి తాంబూళంలో తాళి కనిపించదు. దాంతో కార్తీక్ బాబు, దీపా, జ్యోత్స్న, పారుజాతం అందరూ షాక్ అవుతారు. అసలు తాళి ఎక్కడికి వెళ్లిపోయింది. ఎవరు తీసి ఉంటారని అంతా వెతకడం ప్రారంభిస్తారు. కానీ ఎంత వెతికినా కూడా తాళి కనిపించదు. దీంతో దీపా జ్యోత్స్ననే తీసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తుంది. అందరి ముందే జ్యోత్స్న నే తీసి ఉంటుందని, నా మెడలో తాళిని తెంచింది కూడా ఆమెనే కదా అని జ్యోత్స్నపై నింద వేస్తుంది. కానీ దశరథ అలా ఎలా తీసి ఉంటుంది అని దీపాను ప్రశ్నిస్తాడు. మన కళ్ల ముందే కదా జ్యోత్స్న ఉందని అంటాడు. ఇక జ్యోత్స్న మాత్రం షాక్ అవుతుంది. అసలు తాళిని ఎవరు తీసి ఉంటారని మనసులో అనుకుంటుంది. పారిజాతం, శ్రీధర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇక ముహుర్తానికి సమయం దగ్గర పడుతుండటంతో శివ నారాయణ తన మొదటి భార్య తాళిని తీసుకొచ్చి ఇస్తాడు. ముహుర్తం సమయం దాటకుండా కార్తీక్ బాబు, దీపాల పెళ్లిని జరిపిస్తాడు. దాంతో కార్తీక్ బాబు, దీపా, కాంచన, దశరథ సంతోషం వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 27వ తేదీ 447 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

మొత్తానికి శివ నారాయణ తన మొదటి భార్య తాళిని ఇవ్వడంతో కార్తీక్ బాబు, దీపాల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. తాళి కట్టిన అనంతరం నూతన వధూవరులతో అగ్ని హోమం చుట్టూ ఏడడుగులు వేయిస్తారు. కార్తీక్ బాబు, దీపా అలా జంటగా నడుస్తుంటే కాంచన, దశరథ, అనసూయ ఎంతో సంతోషిస్తారు. మరోవైపు జ్యోత్స్నకు, పారిజాతానికి, శ్రీధర్, సుమిత్రలకు ఒళ్లు మండిపోతుంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపుదామని అనుకుంటే చివరిగా ఘనంగానే జరిగింది కదా అని లోలోపల అనుకుంటారు. ఇక పెళ్లి కార్యక్రమం పూర్తి అవ్వడంతో కార్తీక్ బాబు దీపాలను ఇరువైపుల తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి అని అయ్యగారు చెబుతారు. దాంతో కార్తీక్ బాబు దీపా కూడా అలానే చేస్తారు. ముందుగా కాంచన , శ్రీధర్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ సమయంలో శ్రీధర్ కు ఆశీర్వాదం ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఇస్తాడు. నా చేతులతో చెడగొట్టాల్సిన మీ పెళ్లిని చివరికి నేనే ఆశీర్వదించాల్సి వస్తుందని మనస్సులో అనుకుంటాడు. బయటికి మాత్రం ఆశీర్వదిస్తాడు. ఆ వెంటనే కాంచన కూడా నిండు మనస్సుతో కార్తీక్ బాబు, దీపాలను ఆశీర్వదిస్తుంది. దీపా నుదిట ముద్దు పెట్టి మెచ్చుకుంటుంది.
కార్తీక్ బాబు, దీపా సంతోషంగా ఉండటం చూసి జ్యోత్స్న, పారుజాతం తట్టుకోలేకపోతారు. ఇక ఆ తర్వాత నూతన వధూ వరులు దశరథ, సుమిత్రల ఆశీర్వాదం తీసుకుంటారు. ఇదే సమయంలో సుమిత్రకు దీపాను ఆశీర్వదించడం ఇష్టం లేకపోయినా ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత కార్తీక్ బాబు మిగిలిన వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవ్వరూ ఆశీర్వదించరు. శివ నారాయణ మాత్రం సుఖంగా ఉండడని దీవిస్తాడు. ఆ తర్వాత అనసూయను కూడా ఆశీర్వదించమని అడుగుతారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఒక విషయంలోనే కోపం ఆగడం లేదని అనసూయ అంటుంది. వెంటనే కార్తీక్ బాబు ఏ విషయంలో అని ప్రశ్నిస్తాడు. దీంతో అనసూయ మాట్లాడుతూ ఆ తాళిబొట్టు విషయంలో అని అంటుంది. అసలు ఆ తాళిని ఎవ్వరు తీసి ఉంటారని ప్రశ్నిస్తుంది. అసలు కార్తీక్ బాబు, దీపాల తాళి బొట్టును దాచాల్సిన అవసరం ఎవ్వరికీ ఉందని అంటుంది. అది ఎవరనే విషయం తెలుసుకోలేకపోయామని అనసూయ అంటుంది. ఈరోజుల్లో బయటి వాళ్లు కూడా ఎంతలా మాయం చేస్తున్నారో తెలిసిందే అని శ్రీధర్ అంటాడు. బయటి దొంగలే ఇలాంటి పని చేసి ఉంటారని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత సంహపంక్తి భోజనాలకు ఏర్పాట్లు చేస్తారు. అందరూ కలిసి భోజనాలకు కూర్చొంటారు. ఈ సమయంలో పారుజాతం, జ్యోత్స్న, శ్రీధర్ అసలు తాళి ఎవరు దొంగలించారని ఒకరితో ఒకరు అడుగుతూ ఉంటారు. పారు, శ్రీధర్ కు జ్యోత్స్న పై అనుమానం ఉంటుంది. కానీ నేను కాదని జ్యోత్స్న చెప్పడంతో షాక్ అవుతారు. మరి అసలు దొంగ ఎవరంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక భోజనాలు చేయడం ముగిసిన తర్వాత అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్ర మాత్రం అందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కతే మౌనంగా బయటికి వెళ్తుంది. ఇక కార్తీక్ బాబు గమనించి వెంటనే వెళ్తాడు. ఏమైంది అత్త ఇక్కడికి వచ్చావని ప్రశ్నిస్తాడు. నా మనసేం బాలేదు అని సుమిత్ర బదులిస్తుంది. ఎందుకు ఉంటుంది అత్త, తాళి బొట్టును దొంగలించింది నువ్వే అయ్యినప్పుడు అని కార్తీక్ బాబు అంటాడు. నువ్వు తాళిని తీసి దాయడం నేను చూశాను అత్త అని చెబుతాడు. దాంతో సుమిత్ర షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్లందరూ నువ్వని తెలియక అలా మాట్లాడుతుంటే బాధగా ఉంది అత్త అని అంటాడు. ఇక ఆ తర్వాత సుమిత్ర, కార్తీక్ బాబు ఇంట్లోకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదాపడింది.


Click it and Unblock the Notifications











