Karthika Deepam 2 August 28th: జ్యోత్స్నపై కార్తీక్ బాబు ఫైర్.. దీపాను మరింత బాధపెడుతున్న సుమిత్ర

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 27వ తేదీ 447వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మొత్తానికి కార్తీక్ బాబు, దీపాల పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఇక వారు సంతోషంగా ఉండటం చూసిన పారుజాతం, జ్యోత్స్న తట్టుకోలేకపోతారు. ఈ సమయంలో కార్తీక్ బాబు, దీపాలకు దశరథ, సుమిత్రలు ఆశీర్వాదం ఇస్తారు. అయితే దీపాను ఆశీర్వదించడం సుమిత్రకు ఇష్టం లేకపోయినా ఆశీర్వదిస్తుంది. అంతకు ముందు శ్రీధర్, కాంచనలు కూడా నూతన వధూ వరులను ఆశీర్వదిస్తారు. శివ నారాయణ కూడా వారిని సుఖంగా ఉండమని నిండు మనస్సుతో దీవిస్తాడు. అలాగే అనసూయ కూడా కార్తీక్ బాబు దీపాలకు ఆశీర్వాదం అందిస్తోంది. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశిస్తున్నట్టు చెబుతుంది. ఇదే సమయంలో తనకు ఒక విషయంలోనే సందేహం కలుగుతుందని అనసూయ అంటుంది. పెళ్లిలో తాళిబొట్టును ఎవరు మాయం చేసి ఉంటారని మళ్లీ అనసూయ గుర్తు చేస్తుంది. కార్తీక్ బాబు, దీపా పెళ్లికి సంబంధించిన తాళి బొట్టును దాచాల్సిన అవసరం ఎవ్వరికి వచ్చిందని అంటుంది. వాళ్లు ఎవరనే సంగతి తెలుసుకోవాలని అనసూయ అంటుంది.

ఇక శ్రీధర్ స్పందిస్తూ ఈరోజుల్లో బయటి వాళ్లు ఇంటి వాళ్లలాగానే కనిపిస్తున్నారని, ఎవ్వరికి తెలియకుండా అన్ని వస్తువులు మాయం చేస్తున్నారని అంటాడు. ఇక తాళిబొట్టును ఎత్తుకెళ్లడం పెద్ద విషయమా అని అంటాడు. అది కూడా నిజమేలే అని అనసూయ అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి సహపంక్తి భోజనాలకు కూర్చొంటారు.ఈ సమయంలో జ్యోత్స్న, పారుజాతం, శ్రీధర్ అసలు ఆ తాళిబొట్టు ఎవరు దొంగలించారని ఒకరితో ఒకరు గుసగుసలు పెడుతూ ఉంటారు. శ్రీధర్ నేను కాదని చెబుతాడు. ఇక వీరిద్దరూ జ్యోత్స్నపై అనుమానం వ్యక్తం చేస్తారు. ఇదే విషయాన్ని జ్యోత్స్న ను అడగడంతో నేను తీయలేదని బదులిస్తుంది. దాంతో పారు, శ్రీధర్ షాక్ అవుతారు. మన ముగ్గురిలో ఎవరూ కాకుండా పెళ్లిని ఆపాలని ఇంకెవ్వరు చూస్తారని పారుజాతం సందేహిస్తుంది. ఇంట్లోనే మనకంటే గజదొంగ ఒకరు ఉన్నారని అంటుంది. ఇక భోజనాలు అయ్యాక అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సుమిత్ర మాత్రం మౌనంగా పక్కకు వెళ్లిపోతుంది. ఆ వెంటనే కార్తీక్ బాబు వెళ్లి తాళి బొట్టు తీసింది నువ్వే అని నాకు తెలుసు అత్త అని అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 28వ తేదీ 448 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 448 August 28th 2025

కార్తీక్ బాబు సుమిత్రతో మాట్లాడిన మాటలకు చిన్నబోతుంది. తన మనస్సులో దీపాపై ఎంత కోపం ఉందో కార్తీక్ బాబుకు తెలిసి పోయినందుకు షాక్ అవుతుంది. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా సుమిత్ర కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటుంది. కార్తీక్ బాబు చేతిలో దీపా చేతిని పెట్టి జాగ్రత్తలు చెబుతాడు దశరథ. మా ఇంటి పిల్లను మీ ఇంట్లో మంచిగా చూసుకోండి అని చెల్లి కాంచనకు, అల్లుడు కార్తీక్ బాబుకు దశరథ చెబుతాడు. దీంతో మీకంటే బాగానే చూసుకుంటామని చెబుతారు. ఇక వెళ్లి వస్తామని శివ నారాయణతో కూడా చెబుతారు. దీంతో శివ నారాయణ మీకు ఇవ్వడానికి సమయానికి ఎలాంటి బహుమతి లేదని చెబుతాడు. దాంతో దీపా స్పందిస్తూ పెద్ద మనస్సుతో ఈ ఇంటి ఇల్లాలి తాళిని కలకాలం నా గుండెలపై మోసేలా తాళిబొట్టును కానుకగా ఇచ్చారని అంటుంది. అంతకంటే నాకు ఇంకేమీ గొప్ప బహుమతి ఉండదని చెబుతుంది. మీరు చూపిస్తున్న ప్రేమ నాకు చాలని అంటుంది. నాకు చాలా సంతోషంగా ఉందని దీపా అంటుంది. దీపా మాటలతో శివ నారాయణ కూడా ఖుషి అవుతాడు. ఆ తర్వాత వెళ్లి వస్తామని కాంచన అందరితో చెబుతుంది. ఇక తమ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉందని కాంచన చెబుతుంది.

నాన్న శివ నారాయణ, అన్నయ్య దశరథను రమ్మనమని అంటుంది. వాళ్లు తప్పకుండా వస్తామని కాంచనతో చెబుతారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతారు. అయితే దీపా మాట్లాడిన మాటలకు జ్యోత్స్నకు సందేహం కలుగుతుంది. శివ నారాయణకు సొంత మనవరాలిగా ఎందుకు ప్రవర్తిస్తుందని మనస్సులో అంటుంది. ఒకవేళ దాసు దీపాకు నిజం చెప్పాడా? లేక ఇంకెవ్వరైనా చెప్పి ఉంటారా? అని ఆలోచిస్తూ ఉంటుంది. దాసు నాన్నద దీపాకు మాత్రం నిజం చెప్పలేదని అన్నాడు కదా, ఇంకెలానైనా తెలిసే అవకాశం ఉందా అని పలు ప్రశ్నలు వేసుకుంటుంది. దీపాకు, కార్తీక్ బాబుకు అసలు విషయం తెలిసిపోయిందా? అనేది ఎప్పుడూ ప్రశ్నగా మిగిలిపోతుందని అప్సెట్ అవుతుంది. ఇక మరోవైపు కార్తీక్ బాబు, దీపాలు ఇంటికి తిరిగి రావడంతో స్వప్న, కావేరి వస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న కార్తీక్ బాబు, దీపాలు కొత్తగా పెళ్లి చేసుకోవడం రావడంతో ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెబుతారు. అంతే కాదు నూతన వధూవరులతో కేక్ కూడా కట్ చేయిస్తారు. ఇదే సమయంలో కార్తీక్ అన్నయ్యకు కొడుకు పుడితే నేను కూతురి కని ఈ ఇంటికి ఇల్లాలిగా పంపిస్తానని అంటుంది.

స్వప్న మాటలు విన్నాక కార్తీక్ బాబు, దీపాలు సంతోషిస్తారు. కాంచన కూడా సంతోషిస్తుంది. ఇక దాసును ఎందుకు తీసుకు రాలేదని కార్తీక్ బాబు అడుగుతాడు. దాంతో కాశీ ఆ విషయం మీకే తెలియాలి బావ అని సమాధానం ఇస్తాడు. మరోవైపు శ్రీధర్ ఇంటికి వెళ్లిన సమయంలో కావేరి మండిపడుతుంది. వారి పెళ్లిలో ఏదైనా ఇష్టమైనట్టుగా ప్రవర్తించావా? అని ప్రశ్నిస్తుంది. అనుకున్నవన్నీ అవుతాయా? అని శ్రీధర్ అంటాడు. ఎప్పటికైనా దీపాను కార్తీక్ బాబుకు దూరం చేసి జ్యోత్స్నను నా కోడలిగా చేసుకుంటానని అంటాడు. మరోవైపు అసలు పెళ్లిలో తాళిబొట్టును ఎవరు తీసి ఉంటారని కార్తీక్ బాబును దీపా ప్రశ్నిస్తుంది. ఇక సుమిత్ర అత్త తీసిందని చెప్పలేకపోతాడు కార్తీక్ బాబు. దీంతో దీపా జ్యోత్స్నపై అనుమానం వ్యక్తం చేస్తుంది. తాళిలేకపోతే కష్టమయ్యేదని అంటుంది. దాని వల్ల కూడా మనకు మంచే జరిగిందిలే అని కార్తీక్ బాబు అంటాడు. మీ నాన్న తాళి నీ మెడలోకి వచ్చిందని అంటాడు. దాంతో దీపా సంతోషిస్తుంది. ఇక మరోవైపు దీపా పెళ్లి పట్ల పారుజాతం షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X