Karthika Deepam 2 August 29th: పారుజాతంపై శివ నారాయణ ఆగ్రహం.. జ్యోత్స్న నోరు మూయించిన దశరథ

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 28వ తేదీ 448వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లిలో ట్విస్ట్ లు ఉన్నా మొత్తానికి ఘనంగా పూర్తవుతుంది. ఇక పెళ్లి తంతు ముగియడంతో అందరూ తమ ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతారు. ఈ సమయంలో అప్పగింతలు చేస్తారు. దశరథ దీపా చేతిని కార్తీక్ బాబు చేతిలో పెట్టి నా కూతురును జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు. కాంచనకు కూడా నా కూతురు జాగ్రత్త అని చెబుతాడు. తప్పకుండా అని కార్తీక్ బాబు, కాంచన బదులిస్తారు. వీరు ఇలా మాట్లాడుతూ ఉండటం అటు సుమిత్రకు, ఇటు పారు, జ్యోత్స్నకు అస్సలు నచ్చదు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి వస్తావమని కాంచన చెబుతుంది. అలాగే తమ ఇంట్లో రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని అంటుంది. అందుకు అన్నయ్య నువ్వు తప్పకుండా రావాలని అంటుంది. అలాగే నాన్న నువ్వు కూడా రావాలని చెబుతుంది. దాంతో వాళ్లిద్దరూ వస్తానని చెబుతారు. కాంచన చాలా సంతోషిస్తుంది.

ఇక సుమిత్రను కూడా కాంచన వదినమ్మ రేపు సత్యనారాయణ వ్రతం పూజకు మీరు కూడా తప్పకుండా రావాలని కాంచన అంటుంది. కానీ సుమిత్ర మాత్రం ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ఉంటుంది. దాంతో సుమిత్ర ఎలాంటి బదులిస్తుందోనని కార్తీక్ బాబు ముందుగానే స్పందిస్తూ ఇక మనం వెళ్దాం అమ్మా అని కాంచనతో అంటాడు. దశరథ వాళ్లను కారు వరకు వెళ్లి సాగనంపుతారు. సుమిత్ర మాత్రం వాళ్లు ఇంటి నుంచి వెళ్లిపోక ముందే మౌనంగా లోపలికి వెళ్లిపోతుంది. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత కార్తీక్ బాబు దీపాలు మాట్లాడుకుంటారు. అసలు తాళి బొట్టు తీసింది ఎవరు అన దీపా సందేహిస్తూ ఉంటుంది. తీసింది సుమిత్రనే అని కార్తీక్ బాబు దీపాతో చెప్పలేక పోతాడు. ఏదేమైనా మనకు మంచే జరిగింది కదా అని అంటాడు. ఆ తాళి లేకపోవడం వల్ల మనకు నానమ్మ తాళి అందిందని కార్తీక్ బాబు అంటాడు. అది కూడా నిజమేనని కార్తీక్ బాబు అంటాడు. వీరి పెళ్లి సందర్భంగా కాశీ, స్వప్న వచ్చి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? సత్యనారాయణ వ్రతం కార్యక్రమానికి సుమిత్ర వస్తుందా? రాదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 29వ తేదీ 449 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 449 August 29th 2025

కార్తీక్ బాబు, దీపాల పెళ్లి గురించి దశరథ, శివ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటారు. వారి పెళ్లి వల్ల ఇంట్లో ఉన్న అరిష్టాలు అన్ని పోయినట్టే కదా అని దశరథ అంటాడు. మొత్తానికి పెళ్లి వేడుక మాత్రం మంచిగా జరిగిందని శివ నారాయణ అంటాడు. అందుకు కారణం జ్యోత్స్ననే అని పారుజాతం అంటుంది. ఏంటీ జ్యోత్స్న కారణం ఏంటని పారుజాతాన్ని శివ నారాయణ, దశరథ ప్రశ్నిస్తారు. జ్యోత్స్న దీపా తాళి తెంచడం వల్లనే కదా ఇలా పెళ్లి చేయాల్సి వచ్చిందని అంటుంది. ఆ దేవుడే దీపా మెడలో తాళిని తెంచేలా చేసి, అనాథ అయినా దీపాకు దశరథ, సుమిత్రలను అమ్మనాన్నలుగా నిలిపి పెళ్లి జరిగేలా చేశాడు కదా అని వివరిస్తుంది. ఇక శివ నారాయాణ అది కూడా వాస్తవమే అని ఒప్పుకుంటాడు. కార్తీక్ బాబు, దీపాల పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని అంటుంది. ఒక రేపు సత్యనారాయణ వత్రం పూజకు వెళ్లితే మన బాధ్యత తీరిపోతుందని అంటుంది. దాంతో శివ నారాయణ షాక్ అవుతాడు. నీ నోటి వెంటనే ఇలాంటి మంచి విషయాలు వస్తున్నాయేంటి అని అడుగుతాడు. అది పక్కకు పెడితే మీరందరూ కాంచన ఇంటికి వస్తున్నారా? లేదా? అని ప్రశ్నిస్తుంది.

ఇక శివ నారాయణ నేను తప్పకుండా వెళ్తానని, వెళితే వాళ్లకు ఇచ్చిన మాట పూర్తవుతుందని అంటాడు. ఇక జ్యోత్స్న కూడా తాత వస్తున్నాడు కాబట్టి నేనూ కచ్చితంగా వస్తానని అంటుంది. దాంతో పారుజాతం,నేను జ్యోత్స్న ఉదయమే వెళ్తామని అంటుంది. ఇంతకీ సుమిత్ర రేపు సత్యనారాయణ వ్రతం పూజకు వస్తుందా? లేదా? అని ప్రశ్నిస్తుంది. దాంతో సుమిత్ర మౌనంగా ఉంటుంది. ఈ అత్తయ్యకు నా గురించి అడగాల్సిన పని ఏముందని మనస్సుల్లో అనుకుంటుంది. దాంతో దరశరథ, శివనారాయణ నీ సమాధానం ఏంటమ్మా అని సుమిత్రను అడుగుతారు. ఇక సుమిత్ర తనకు ప్రస్తుతం ఓపిక లేదని బదులిస్తుంది. పెళ్లి పనుల వల్ల కాస్తా నీరసంగా ఉందని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక ఆ తెల్లవారి అందరూ రెడీ అవుతారు. పారుజాతం జ్యోత్స్న ముందుగానే బయల్దేరుతారు. శివ నారాయణ, దశరథ కూడా రెడీ అయ్యి ఉంటారు. ఇక సుమిత్రను ఏమైందీ అని అడిగితే ఎక్కడికి అని తెలియనట్టుగా అంటుంది. ఆ మాట విన్నాక శివ నారాయణ నేను కారులో మీ ఇద్దరి కోసం వేచి ఉంటానని చెప్పి వెళ్లిపోతాడు.

దశరథ సుమిత్రను పూజా కార్యక్రమానికి రమ్మని అడుగుతాడు. కానీ సుమిత్ర నేను రానని, నేను ఏ అనాథను దత్తత తీసుకోలేదు. ఏదో పెళ్లి వరకు అంటే ఒప్పుకున్నాను. కానీ వారెంట్లో జరిగే సత్యనారాయణ వ్రతం పూజకు రానంటే రానని చెబుతుంది. ఇక దశరథ కూడా నేను వెళ్లి కారులో నీకోసం 5 నిమిషాలు వేయి ఉంటానని అంటుంది. మరోవైపు కార్తీక్ బాబు శ్రీధర్ బాబుకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెబుతాడు. ప్రతి కొడుకు తన తండ్రి హీరోనే అంటాడు. కార్తీక్ బాబు మాటలకు శ్రీధర్ ఎమోషన్ అవుతాడు. తండ్రిగా నీకు ఎప్పుడూ మోసం చేయాలని నేను చూడలేదని శ్రీధర్ అంటాడు. ఏదేమైనా మీ వల్ల పెద్దగాయమే అయ్యిందని కార్తీక్ బాబు అంటాడు. ఇవన్నీ మర్చిపోయి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ తాగకండి సమయానికి తినండి అని అంటాడు. ఇక ఈరోజు సత్యనారాయణ వత్రం ఉంది మీరు కూడా వస్తే బాగుంటుందని చెబుతాడు. ఇదే సమయంలో పారు, జ్యోత్స్న వస్తారు. మీరిద్దరే వచ్చారు. మిగిలినా వారందరూ ఎక్కడ అని శౌర్య పాప అడుగుతుంది. వస్తున్నారని చెబుతుంది. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X