Karthika Deepam 2 August 30th: జ్యోత్స్న ఊహించని ట్విస్ట్.. కార్తీక్ బాబు మాస్టర్ ప్లాన్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 29వ తేదీ 449వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లి తర్వాత కాంచన తమ ఇంట్లో సత్యనారాయణ వత్రం ఉంటుందని చెబుతుంది. అందుకు తన అన్న దశరథ, తండ్రి శివ నారాయణను ఆహ్వానిస్తుంది. ఇక దశరథ వస్తానని చెబుతాడు. అలాగే శివ నారాయణ కూడా నేను తప్పకుండా వెళ్తానని అంటాడు. అయితే సుమిత్ర మాత్రం నేను రాను అంటే రానని చెబుతుంది. మరోవైపు పారుజాతం, జ్యోత్స్నలు కూడా వెళ్తామని అంటారు. మరోవైపు కార్తీక్ బాబు, దీపాలు తమ ఇంట్లో సత్య నారాయణ వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ చేస్తారు. ఈ సందర్భంగా కాంచన, అనసూయ ఎంతో సంతోషంగా ఉంటారు. శౌర్య పాపతో ఇళ్లు మొత్తం సందడిగా మారుతుంటుంది. ఇంట్లో పనులన్నీ అందరూ కలిసి చేస్తూ ఉంటారు. దేవుడి పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తారు. ఇదే సమయంలో పారుజాతం ఇంటికి వస్తుంది. వచ్చీ రాగానే ఇంట్లో హడావుడి చేస్తుంటుంది. ఇక తనతో పాటు జ్యోత్స్న కూడా వస్తుంది. అందరి కంటే ముందుగానే మేమే వచ్చామని, వాళ్లంతా వెనకాల వస్తున్నారని పారుజాతం చెబుతుంది.
ఇక పారుజాతం రావడంతో అసలు ఏం చేస్తుందో అని కార్తీక్ బాబు కంగారు పడుతాడు. జ్యోత్స్న కూడా వెంటనే రావడం, వీళ్లు ఇద్దరు కలిసి రావడం సందేహాన్ని కలిగిస్తుంది. ఎందుకైనా మంచింది వీళ్లను ఒక కంట కనిపెట్టాలని అనుకుంటాడు. ఇక పారుజాతం మాత్రం పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది. కార్తీక్ బాబుతో, కాంచనతో, దీపాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. పారుజాతం ప్రవర్తన చూసి జ్యోత్స్న కూడా షాక్ అవుతుంది. అసలు పారిజాతం ఇంత ఓవరాక్షన్ చేస్తుంది ఏంటనీ ఆశ్చర్యపోతుంది. అంతే కాకుండా ఇంట్లో పనులన్నింటినీ చక్కబెడుతూ ఉంటుంది. శౌర్య పాపతోనూ కలిసి పారుజాతంస్టెప్పులు వేస్తుంది. అది చూసిన కాంచన కార్తీక్ బాబు, దీపాలు కూడా సంతోషిస్తారు. ఇదెలా ఉంటే మరోవైపు సుమిత్ర నేను సత్యనారాయణ వ్రతం పూజకు రానని దశరథతో కూడా చెబుతుంది. కనీసం శివ నారాయణ మాటలను కూడా పట్టించుకోదు. తల్లిగా ఉండి పెళ్లి చేయించాను. ఇక వ్రతాలు, మిగితా కార్యక్రమాలకు నేను రాను, నాకు దీపేమీ దత్తత తీసుకున్న కూతురు కాదని చెబుతుంది. ఇంకోవైపు కార్తీక్ బాబు శ్రీధర్ తో ఎమోషనల్ గా మాట్లాడుతాడు. సత్యనారాయణ వత్రం పూజకు మీరు రావాలని తండ్రిని పిలుస్తాడు. ఈ క్రమంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. వస్తున్నారని చెబుతుంది.ఆగస్టు 30వ తేదీ 450 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబు, దీపా పెళ్లి జరిగిన సందర్భంగా కాంచన తన ఇంట్లో సత్యనారాయణ వత్రం పూజను చేస్తుంది. ఇందుకు పుట్టింటి నుంచి ఇప్పటి వరకైతే పారుజాతం, మేనకోడలు అనుకుంటున్న జ్యోత్స్న వస్తారు. ఇక పనులన్నీ పూర్తి చేస్తుంటారు. ఇదే సమయంలో జ్యోత్స్న దీపా ఎదురు పడుతారు. జ్యోత్స్న దీపా మెడలోని తాళిని చూసి అలాగే ఉండి పోతుంది. దీంతో దీపా ఏమైంది జ్యోత్స్న అని అడుగుతుంది. అదృష్టవంతులు అంటే ఎలా ఉంటారో అని మా తాత ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. కానీ ప్రత్యక్ష్యంగా ఇప్పుడే చూస్తున్నాను. అది కూడా నిన్ను చూసిన తర్వాతనే అని చెబుతుంది. నీ మెడలో ఉన్న తాళి నాకు సొంతం కావాల్సింది అని అంటుంది. ఇక మనస్సులో ఆ తాళిని ఎక్కువ రోజులు ఉంచనివ్వను దీపా అని అనుకుంటుంది. కార్తీక్ బాబు జీవితం నుంచి నిన్ను దూరం చేస్తానని మండి పోతుంది. ఇక దీపా స్పందిస్తూ అదృష్టం అంటే మన దగ్గర లేనిది ఎదుటి వాళ్ల దగ్గర ఉన్నప్పుడు మనకు కూడా అలా ఉంటే బాగుండూ అనుకుంటాం. ఈ విషయానికొస్తే నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని దీపా అంటుంది. నేను ఏ విషయంలో అదృష్టవంతురాలినని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. నా దగ్గర ఏమున్నదని జ్యోత్స్న అంటుంది. తల్లిదండ్రులు అని దీపా బదులిస్తుంది.
నీకు తల్లిదండ్రులు ఉన్నారు. నీ జీవితం చాలా అద్భుతంగా సాగుతుందని, ఇతరులకు లేనిది ఉంది కదా అందుకే నువ్వు అదృష్టవంతురాలివి అని జ్యోత్స్న అంటుంది. దాంతో జ్యోత్స్న కాస్తా సంతోష పడుతుంది. నా అదృష్టం బాగుంది కాబట్టే. దశరథ సుమిత్రలకు కూతురుగా పెరిగాను. సకల సౌకర్యాలను అందుకున్నానని మనస్సులో అనుకుంటుంది. నువ్వు దురదృష్టవంతురాలివి కాబట్టే కుబేరాకు కూతురిగా పెరిగావని మనస్సులో సంతోష పడుతుంది. కానీ నీకు ఇప్పుడున్న సంతోషాన్ని మాత్రం ఎక్కువ కాలం ఉండనివ్వనని లోలోపల అనుకుంటుంది. ఇదిలా ఉంటే దశరథ, శివ నారాయణ ఇంటికి వస్తారు. అప్పటికే శ్రీధర్, కావేరి, స్వప్న, కాశీ, దాసు ఇంటికి వచ్చి సందడి చేస్తూ ఉంటారు. ఇక దశరథ, శివ నారాయణ రావడంతో కాంచన సంతోష పడుతుంది. ఆ వెంటనే మీరిద్దరే వచ్చారు. వదిన రాలేదా అన్నయ్య అని దశరథను అడుగుతుంది. దాంతో దశరథ సుమిత్ర రాలేదని చెబుతాడు. బయట ఉందేమో కాంచన పిలిస్తేనే వస్తుంది కావచ్చని పారుజాతం అంటుంది. అలా ఏం లేదు మొత్తానికి సుమిత్ర రాలేదు అని దశరథ సమాధానం ఇస్తాడు.
దశరథ చెప్పిన మాటలకు కార్తీక్ బాబు, దీపా, కాంచన మరింతగా బాధపడుతారు. ఇక పారుజాతం మాత్రం ఈ విషయాన్ని మరింత ఎక్కువగా పొడగిస్తుంది. సుమిత్రను ఎలాగైనా తీసుకురావాల్సింది. కాస్తా మనస్సులో దిగాలుగా ఉన్నా ఏదో ఒకటి చెప్పి మీరు తీసుకురావాల్సిందని శివ నారాయణను పారుజాతం అంటుంది. పెళ్లి చేసిన సుమిత్ర, సత్యనారాయణ వ్రతం కూడా చేస్తే మంచిగా ఉండునని అంటుంది. ఆ విషయం మాకు కూడా తెలుసని శివ నారాయణ అంటాడు. సుమిత్ర వస్తే వచ్చినట్టుగా జరుగుతుంది. లేకపోతే లేనట్టుగా జరుగుతుందని చెబుతాడు. మొత్తానికి మీరైనా వచ్చారులే అని తండ్రి శివనారాయణ, దశరథతో కాంచన అంటుంది. ఇక మరోవైపు కాంచన గదిలోకి వెళ్లి బాధపడుతుంది. అదే సమయంలో జ్యోత్స్న వెళ్లి నువ్వే స్వయంగా పిలిస్తే మా అమ్మ సుమిత్ర వస్తుందేమో అని అంటుంది. కనీసం ఫోన్ చేయమని, లేదంటే వాయిస్ మెసేజ్ పెట్టమని జ్యోత్స్న అంటుంది. దాంతో కాంచన ఫోన్ నుంచి సుమిత్రకు వాయిస్ మెసేజ్ పెడుతుంది.


Click it and Unblock the Notifications











