Karthika Deepam 2 September 1st: దీపాకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పారుజాతం.. అయోమయంలో జ్యోత్స్న
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 30వ తేదీ 450వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లి అంగరంగ వైభవంగా జరగడంతో కాంచన తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంది. ఆ కార్యక్రమానికి తండ్రి శివ నారాయణ, అన్నయ్య దశరథ, వదిన సుమిత్రను, అలాగే పారుజాతం, జ్యోత్స్నలను కూడా పిలుస్తుంది. ఇక తమ ఇంట్లో సత్యనారాయణ వత్రం పూజకు కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. కార్తీక్ బాబు ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది. ఒకప్పుడు కార్తీక్ బాబు తన కుటుంబం మొత్తం కలవాలని ఎలా ఆశ పడ్డారో ఆ దృశ్యం కనిపిస్తుంది. ఇక ఇదే సమయంలో పారుజాతం, జ్యోత్స్న కార్తీక్ బాబు ఇంటికి వస్తారు. సత్య నారాయణ వ్రతం మంచిగా జరిపించాలని పారు హడావుడి చేస్తుంటుంది. అన్ని పనుల్లో పాలు పంచుకుంటుంది. తానే ముందుండి సత్య నారాయణ వ్రతం పూజను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. పారుజాతం ఇంతలా మారిపోవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
ఇక జ్యోత్స్న దీపాను చూసి అసూయ పడుతుంది. అసలు నాకు దక్కాల్సిన కార్తీక్ బాబును నువ్వు దక్కించుకున్నావని మనసులో అనుకుంటుంది. ఎన్ని రోజులు నీ మెడలో మంగళసూత్రం ఉంటుందో చూస్తానని అంటుంది. ఇక సత్య నారాయణ వ్రతానికి శివ నారాయణ, దశరథ కూడా వస్తారు. కానీ సుమిత్ర రాదు. దాంతో కాంచన బాధపడుతుంది. జ్యోత్స్న బలవంతంగా కాంచనతో వాయిస్ మెసేజ్ పెట్టిస్తుంది. సుమిత్ర ఆ మెసేజ్ విని మౌనంగా ఉంటుంది. ఇక కాంచన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మాత్రం సుమిత్ర రాలేదనే బాధలోనే కాంచన, దీపా, కార్తీక్ బాబు ఉంటారు. ఇక సత్యనారాయణ వత్రం పూజా కార్యక్రమాన్ని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. మరోవైపు అందరూ సంతోషంగా ఉండటం చూసి జ్యోత్స్న మాత్రం ఓర్వలేకపోతుంది. ఇక పారు కూడా వాళ్లదాంట్లోనే కలవడంతో మరింతగా మండి పడుతుంది. దాంతోను పారును పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుంది. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 1వ తేదీ 451 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

పారుజాతం కార్తీక్ బాబు ఇంట్లో సందడి చేయడంతో జ్యోత్స్న మండి పడుతుంది. అసలు నువ్వు ఎందుకు దీపా పెళ్లిలో, ఇప్పుడు సత్యనారాయణ వ్రతంలో సందడి చేస్తున్నావని ప్రశ్నిస్తుంది. పారుజాతం బదులిచ్చే సమయానికి దాసు వస్తాడు. అమ్మా అంటూ పారుజాతాన్ని పిలుస్తాడు. నువ్వు నాకు ఈ రోజు చాలా బాగా నచ్చావు అమ్మా అని అంటాడు. ఇక పారుజాతం మాట్లాడుతూ నాకు కూడా సంతోషంగా ఉందిరా అని అంటుంది. నువ్వు శివ నారాయణ పక్కకు కూర్చోవడం నాకు ఆనందాన్ని ఇచ్చిందని, ఇదిగో మీ ఫొటో కూడా తీశానని పారుజాతం చూపిస్తుంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే అందరితో కలిసి మెలిసి ఉండు అమ్మా అని దాసు అంటాడు. అది నీ దగ్గర నుంచే చూసుకున్నాను రా అని పారుజాతం దాసుతో అంటుంది. ఇక పారుజాతం లోపలికి వెళ్తుంది. దాంతో దాసు జ్యోత్స్నపై మండి పడుతాడు. మా అమ్మ మారింది. ఇక మారాల్సింది నువ్వే. నువ్వు కూడా త్వరగా మారితే మంచిది. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని దాసు తన కూతురు జ్యోత్స్నను హెచ్చరిస్తాడు. అసలు నేను నిన్ను ఈ ఫంక్షన్ కు రావొద్దని చెప్పాను కదా అని జ్యోత్స్న దాసుతో అంటుంది.
అందుకు దాసు సమాధానం ఇస్తూ నువ్వు వద్దని చెప్పింది, నీ రానని చెప్పింది పెళ్లికి మాత్రమే. సత్య నారాయణ వత్రం పూజకు కాదని చెబుతాడు. నన్ను తప్పకుండా రమ్మని కార్తీక్ బాబు పిలిచాడని అంటాడు. నువ్వు దీపా విషయంలో ఎంత మౌనంగా ఉంటే నీకే అంత మంచిదని హెచ్చరిస్తాడు. ఏదైనా తేడా వస్తే మాత్రం నువ్వే ఇరుక్కుపోతావని అంటాడు. ఏదేమైనా ఎంతో కాలం దీపానే శివ నారాయణ అసలు మనవరాలు అనే విషయం బయట పడకుండా ఉండదని అంటాడు. అప్పటి వరకు ఆ స్థానంలో బుద్ధిగా ఉండమని జ్యోత్స్నకు సూచిస్తాడు. ఇక జ్యోత్స్న దాసు మాటలకు షాక్ అవుతుంది. ఆ తర్వాత పూజారి వ్రతం జరిపించిన తర్వాత పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చి వారికి నూతన వస్త్రాలను పెట్టమని చెబుతాడు. దాంతో కాంచన మండి పడుతుంది. సుమిత్ర వదిన ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదని అనుకుంటుంది. ఇక దశరథ స్పందిస్తూ పెళ్లి కూతురు తరుపున ప్రస్తుతం తల్లి లేదు, తండ్రిగా నేను ఉన్నాను అని చెబుతాడు. దాంతో పూజారి సరే కానివ్వండి అని అంటాడు. ఇక దశరథ బట్టలు పెట్టే సమయానికి సుమిత్ర వస్తుంది. కార్తీక్ బాబు, దీపాలకు బట్టలు పెడుతుంది. దాంతో అందరూ సంతోషిస్తారు.
మరోవైపు పారుజాతం స్వప్న ఇద్దరు గొడవ పడుతారు. స్వప్న ఓ గదిలోకి వెళ్తూ పారును పక్కకు తప్పుకోమని అంటుంది. దాంతో పారు ఎలాంటి మర్యాద లేకుండా నన్ను పక్కకు తప్పుకోమని అంటావా? అని రచ్చ రచ్చ చేస్తుంది. నా స్థాయి ఏంటో నువ్వు తెలుసుకుంటే మంచిదని పారు జాతం స్వప్నపై ఫైర్ అవుతుంది. బయట ఉండాల్సిన వాళ్లను ఇంట్లోనికి రానిస్తే ఇలానే ఉంటుందని పారుజాతం మాట జారుతుంది. దాంతో స్వప్నకు మద్దతుగా తన తల్లి కావేరి, శ్రీధర్ లు మాట్లాడుతారు. ముందు నీ స్థాయి ఏంటో, నువ్వు ఎలాంటి పరిస్థితుల నుంచి ఇంత స్థాయికి వచ్చావో తెలుసుకోమని అంటారు. దాంతో కావేరి, శ్రీధర్ లపై శివ నారాయణ మండి పడుతాడు. మాట్లాడే ముందు నోరు జాగ్రత్త అని అరుస్తాడు. ఇది కార్తీక్ బాబు ఇల్లు ఇక్కడ మాకు మాత్రమే మాట్లాడే అర్హత ఉందని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత పారుజాతం తప్పులన్నీ మీవైపు ఉన్నా తగ్గడం లేదుగా అని అంటుంది. దాంతో తప్పుల గురించి మేం కూడా మాట్లాడుతామని దీపా, అనసూయ అంటారు. అసలు పెళ్లిలో తాళి ఎవరో తీశారో మాకు తెలుసని అనసూయ అంటుంది. నువ్వే కదా అంటూ పారుపై సందేహం వ్యక్తం చేశారు. ఇక పారు అసలు విషయం ఏంటో కార్తీక్ బాబుకు తెలుసు అని చెప్పి అందరికీ షాక్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











