Karthika Deepam 2 September 2nd: చిక్కుల్లో పడ్డ కార్తీక్ బాబు.. సుమిత్ర అత్తను కాపాడలేక తంటాలు

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 1వ తేదీ 451వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీప పెళ్లి చేసుకొని తిరిగి ఇంటికి వస్తారు. అయితే వారి పెళ్లిలో తాళిబొట్టు కనిపించకుండా పోతుంది. అసలు తాళిబొట్టు ఎవరు తీశారని అప్పుడే పెద్ద చర్చ జరుగుతుంది. ఇక శివ నారాయణ తన మొదటి భార్య మంగళసూత్రాన్ని ఇచ్చే కార్తీక్ బాబుతో దీపా మెడలో తాళి కట్టిస్తాడు. దాంతో ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కారం అవుతుంది. ఇక పెళ్లి తంతు ముగిసిన తర్వాత కార్తీక్ బాబు దీప ఇంటికి వచ్చి తదుపరి కార్యక్రమాలు చూస్తారు. తమ ఇంట్లో సత్యనారాయణ వ్రతం నోముతున్నామని అప్పటికే కాంచన తమ పుట్టింటి వాళ్ళందరిని పిలుస్తుంది. ఒక సుమిత్ర తప్ప మిగిలిన వాళ్ళందరూ వస్తామని చెబుతారు. కార్తీక్ బాబు సత్యనారాయణ వ్రతం సందర్భంగా తండ్రి శ్రీధర్ ను కూడా పిలుస్తాడు. మరోవైపు కావేరి, స్వప్న దాసు కూడా వస్తారు. ఇక శివ నారాయణ ఇంటి నుంచి అందరికంటే ముందుగా పారిజాతం, జోష్ణ వస్తారు. శివ నారాయణ, దశరథ ఆలస్యంగా బయలుదేరుతారు. వారితో సుమిత్ర మాత్రం రానంటే రానని చెబుతుంది. దాంతో దశరథ, శివ నారాయణ మాత్రమే కార్తీక్ బాబు ఇంటికి వెళ్తారు.

ఇక అప్పటికే అక్కడ సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఏర్పాటు కాని పూర్తవుతాయి. కాంచన పుట్టింటి వారు అందరూ రావడం, శ్రీధర్ రెండో భార్య కుటుంబం కూడా రావడంతో వ్రతం పూర్తి చేస్తారు. ఇక ఆ తర్వాత దీపక్ పుట్టింటి వాళ్ళ తరఫున బట్టలు పెట్టాలని అయ్యగారు చెప్తారు. దాంతో దీపా తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి బట్టలు పెట్టాలని అంటాడు. దాంతో దశరథ ఆమె తల్లి రాలేదని చెప్తాడు. ఇక ఒక్కడే బట్టలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వదిన ఎందుకు రాలేదని కాంచన, దీప అందరూ బాధపడతారు. బట్టలు పెట్టే సమయానికి సుమిత్ర వస్తుంది. నాతో అందరు సంతోషిస్తారు. ఆ కార్యక్రమం ముగిస్తుంది. ఆ తర్వాత పారిజాతం పెద్ద గొడవ చేస్తుంది. స్వప్నకు పారిజాతానికి జరిగిన గొడవలో తాళిబొట్టు ఇష్యూ మళ్లీ వస్తుంది. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 2వ తేదీ 452 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 452 September 2nd 2025

పెళ్లిలో తాళిబొట్టు ఎవరు తీసారని పెద్ద చర్చ జరుగుతుంది. ఇక పారిజాతం ఎవరిదీశారో తనకు తెలుసు అని చెబుతోంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఎవరు తీసారో చెప్పమని అడుగుతూ ఉంటారు. ఇక దీప నా అవసరం ఇంకా ఎవరికీ ఉంటుంది మీకే ఉంటుందని పారిజాతాన్ని అంటుంది. నాతో రెచ్చిపోయిన పారిజాతం ఎవరు తీశారో నీ భర్త కార్తీక్ బాబు కూడా తెలుసు అని అంటుంది. నాతో దీప షాక్ అవుతుంది. ఇక అందరూ కార్తీక్ బాబుని చెప్పమని అడుగుతారు. కార్తీక్ బాబుకు తన అత్త సుమిత్రాన్ని తీసిందని విషయాన్ని అప్పటికే తెలుసు. అయితే అందరి ముందు ఎలా చెప్పాలని మౌనంగా ఉండిపోతాడు. ఇక పారిజాతం కార్తీక్ బాబు ఎంతకీ చెప్పకపోవడంతో తానే చెబుతాడు. పెళ్ళిలో తాళిబొట్టు తీసింది ఇంకెవరో కాదు సుమిత్ర అని అంటుంది. సుమిత్ర అలాంటి పని చేయదు అని అందరూ వాదిస్తూ ఉంటారు. ఇక కార్తీక్ బాబును కూడా అది నిజమేనా అని అడుగుతూ ఉంటారు. మౌనంగా ఉండిపోతాడు.

చర్చ పెద్దగా అవుతుండడంతో ఇక సుమిత్రనే నేనే తీసాను అని ధైర్యంగా చెబుతుంది. దీప పెళ్లి జరగడం ఇష్టం లేకపోవడంతో తానే ఆ తాళిబొట్టును తీసి దాచానని అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్నిస్తారు. ముఖ్యంగా కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఇలాంటి పని చేసావంటే ఇప్పటికీ నమ్మడానికి అవ్వడం లేదని అంటుంది. మా వదిన చాలా మంచిదే అని అనుకున్నాను. కానీ దీపపై ఇంత కుట్ర పెట్టుకున్నామని అస్సలు అనుకోలేదని అంటుంది. ఇక దీప పెళ్లి మీ ఇంట్లో జరగడం ఇష్టం లేదని ముందే చెప్పుంటే బాగుండు కదా అని అంటుంది. ఈ విషయంలో దశరథ కు తెలవకుండా సుమిత్ర చేసే అవకాశం లేదని కాంచన నిందిస్తుంది. మీరైనా ఒక మాట చెప్పి ఉండాల్సింది నాన్న అని శివ నారాయణ కూడా ప్రశ్నిస్తుంది. సమయం వస్తే గాని ఎవరు మనోళ్ళు ఎవరు పగవాలో తెలిసే అవకాశం లేకుండా పోయిందని బాధపడుతూ ఉంటుంది. నువ్వు కూడా ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అని శివ నారాయణ అంటుంది.

దాంతో శివ నారాయణ స్పందిస్తూ నాకు ఈ పెళ్లి ఇష్టం లేకుంటే ముందే చెప్పేదాన్ని కాంచన అని అంటాడు. నాకు ఇష్టం ఉంది కాబట్టే మీ అమ్మ తాళిబొట్టును దీపకు ఇచ్చాను అని అంటాడు. అది కూడా నిజమే కదా నాన్న అని కాంచన కాస్త శాంతిస్తుంది. ఇక సుమిత్ర తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరుతుంది. సుమిత్ర వెంటనే దశరథ శివ నారాయణ పారిజాతం జోష్ణాలు కూడా వెళ్లిపోతారు. ఇక పారిజాతం ఇంటికి వెళ్లిన తర్వాత జోష్ణ తో మాట్లాడుతుంది. నేను తలుచుకుంటే ఈ రెండు కుటుంబాలను విడదీయడం ఎంత సింపుల్ లో తెలుసా మనవరాలు అని గొప్పలు చెబుతుంది. కానీ ఇదే సమయంలో జోష్ణ పారిజాతానికి ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. నీకు అసలు తెలియని విషయం ఏంటంటే మా అమ్మ సుమిత్రతో తాళిబొట్టును తీయమని చెప్పిందేనని చెప్పి షాక్ ఇస్తుంది. కార్తీక్ బాబు కూడా ఈ విషయం తెలుసనీ తనకు ముందే తెలుసు అంటుంది. ఆ విషయం నీకు తెలవాలని నిన్ను వాళ్ళ దగ్గరికి పంపించి వినిపించేలా చేశానంటుంది. నిన్ను వాడుకొని రెండు కుటుంబాలను వేరు చేశానని చెబుతుంది. ఇలా ఎవ్వరికీ తెలియకుండా తన ప్లానింగ్ లో తాను ఉన్నానని అంటుంది. కానీ నువ్వేమో రెండు సార్లు నా ప్లాన్ ను చెడగొడుతూ వచ్చావని చెబుతుంది. ఇక జ్యోత్స్న మాటలకు పారిజాతం షాక్ అవుతుంది. మరోవైపు కాంచన కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తుంది. నేను చేసిన పొరపాటు ఏంటంటే అందరితో మంచితనంగా ఉండటమే అని కార్తీక్ బాబుతో అంటుంది. కార్తీక్ బాబు తల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇక తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X