Karthika Deepam 2 September 3rd: సుమిత్రతో తప్పు చేయించిన జ్యోత్స్న.. ఈ ట్విస్ట్ ఊహించలేం

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 2వ తేదీ 452వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లి అంగరంగ వైభవంగా ముగిసింది. దీంతో అందరూ సంతోషంగా భోజనాలు కూడా చేశారు. అయితే వీరి పెళ్లితో తాళి బొట్టు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి కార్తీక్ బాబు దీపాల పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని పారు జాతం, జ్యోత్స్న, శ్రీధర్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్లలో ఎవరో తాళిని మాయం చేసి ఉంటారని దీపా అనుకుంటుంది. కానీ వాళ్లు పెళ్లి ఆపేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేసి విఫలం అవుతూ ఉంటారు. చివరకు సుమిత్రనే దీపా పెళ్లి తమ ఇంట్లో జరగడం ఇష్టం లేక సుమిత్రనే తాళిని కనిపించకుండా చేస్తుంది. కానీ సుమిత్ర కార్తీక్ బాబుకు దొరికి పోతుంది. కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పడానికి ఇష్టపడడు. సుమిత్ర అత్తను అందరూ అదోలా చూస్తారని చెప్పి నిజాన్ని తన గుండెలోనే దాచుకుంటాడు. ఇక దీపాకు కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతాడు. మరోవైపు కాంచన ఇంట్లో సత్యనారాయణ వత్రం పూజను జరిపిస్తారు. అయితే పూజకు పారుజాతం, జ్యోత్స్న, దశరథ, శివ నారాయణ వస్తారు.

ఇక సుమిత్ర మొదట్లో కాంచన ఇంటికి వచ్చేందుకు ఒప్పుకోదు. తన శత్రువైనా దీపా ఇంటికి నేను అస్సలు రానని చెబుతుంది. కానీ ఆ తర్వాత సుమిత్ర వాయిస్ మెసేజ్ పెట్టడంతో వస్తుంది. దీపాకు దశరథ, సుమిత్ర కలిసి బట్టలు పెడుతారు. ఇలా కుటుంబం మొత్తం కలిసిపోయిందనే సమయంలో పారుజాతం పెద్ద గొడవ చేస్తుంది. దీంతో పారుజాతంపై కావేరి, కార్తీక్ బాబు, స్వప్న మండి పడుతూ ఉంటారు. ఇక ఆవేశం పట్టలేక పారుజాతం అసలు తాళిబొట్టు తీసింది ఎవరో కార్తీక్ బాబుకు తెలుసు అని అందరి ముందు చెబుతుంది. ఈ సమయంలో అక్కడే ఉన్న సుమిత్ర చర్చ పెద్ది అవ్వడంతో నేనే తీశానని చెబుతుంది. దీపా పెళ్లి జరగడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని అంటుంది. సుమిత్ర మాటలు విన్నాక కాంచన, కార్తీక్ బాబు, దీపా, కావేరి, అనసూయ అందరూ షాక్ అవుతారు. కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. కలలో కూడా సుమిత్ర వదిన ఇలా చేస్తుందని ఊహించలేదని అంటూ బాధపడుతుంది. ఇక సెప్టెంబర్ 3వ తేదీ 453 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 453 September 3rd 2025

సుమిత్ర వదినా ఎంతో మంచిదని ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చానని కాంచన అంటుంది. కానీ ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదని బాధ పడుతుంది. అసలు మా వదిన తాళిబొట్టును దాచి పెట్టడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదని కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ బాబు కాంచనను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అసలు దీపాపై కోపం ఉన్నా కూడా మా వదినా సుమిత్ర ఇలా చేయడం ఏంటో తెలియడం లేదని చెబుతుంది. అసలు మా నాన్న శివ నారాయణ మొహం చూసి కూడా సుమిత్ర వదిన తగ్గలేదు అంటే.. మన మీద ఎంత కోపంతో ఉందో అర్థమై పోతుంది. ఇంత పగ సాధిస్తందని ఎప్పుడూ అనుకోలేదు. మా నాన్న కూడా ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదు అంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంది. దీంతో కార్తీక్ బాబు కాంచనను ఓదార్చుతాడు. తాత శివ నారాయణ మనస్సులో ఏమీ లేదని అంటాడు. ఆయన మనస్సులో నిజంగా పెళ్లిని ఆపాలనే ఉద్దేశం ఉంటే మాత్రం అమ్మమ్మ తాళిని ఇచ్చి మరీ పెళ్లిని చేయించే వారు కాదు కదా అని అంటాడు కార్తీక్ బాబు. దీంతో కార్తీక్ బాబు వెంటనే త్వరలో అన్ని నిజాలు బయటికి వస్తాయని చెబుతాడు.

ఇక మరోవైపు సుమిత్ర ఇంటికి వచ్చిన తర్వాత శివ నారాయణ, దశరథ మండి పడుతారు. అసలు నువ్వు ఇలా ఎందుకు చేశావు అని ప్రశ్నిస్తారు. అసలు నేను చేసిన దాంట్లో తప్పు ఏమీ ఉందని సుమిత్ర ప్రశ్నిస్తుంది. నాకు నచ్చని పెళ్లికి మీరు వెళ్లారు. నాకు ఇష్టం లేకున్నా కూడా నేను కార్యక్రమానికి వచ్చాను. కానీ దీపా చేసిన పనికి నా గుండె రగిలి పోయింది. అందుకే అలా చేశానని అంటుంది. ఇక నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని దశరథ సుమిత్రపై మండి పడుతాడు. అన్నీ విషయాల్లో నువ్వు సమ్మతమే అని చెబుతూ ఇలా చేస్తావని అనుకోలేదు. కనీసం నువ్వు మా నాన్న శి నారాయణ మొహం కూడా చూడలేదని అంటాడు. దాంతో ఈరోజు అందరం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటాడు. మరోవైపు శివ నారాయణ కూడా మాట్లాడుతూ కార్తీక్ దీపాల పెళ్లిని ఇంట్లో జరిపించే ముందు అందరీ అభిప్రాయాలు తీసుకున్నాను కదా అని అంటాడు. అప్పుడే చెప్పొచ్చు కదా అని, ఎందుకు ఇలా బాధ పెట్టడం అని శివ నారాయణ ప్రశ్నిస్తాడు. దశరథ కూడా ఆవేశంతో సుమిత్రపై మండి పడుతాడు. ఎందుకు ఇలా చేశావో చెప్పమని ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తాడు.

కానీ జ్యోత్స్న మాత్రం సుమిత్రకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకు మీరంతా అనవసరంగా అమ్మను తిడుతున్నారని శివ నారాయణ, దశరథను ప్రశ్నిస్తుంది. అసలు ఆ రోజు మనల్ని కాదని కాంచన అత్త దీపా కోసం వెళ్లిపోయింది. తాత పరువును పక్కన పెట్టి ఎవరో ముక్కుమోహం తెలియని దీపా కోసం వెళ్లిపోయింది. దీపాకే సపోర్ట్ గా మాట్లాడింది. ఇప్పుడు మనం ఎందుకు అమ్మకు సపోర్ట్ చేయడం లేదు. అమ్మ మనకు శత్రువులుగా ఉన్న కాంచన అత్తకు వ్యతిరేకంగా ఉంది అందులో తప్పేమీ లేదు. మీరు ఇప్పుడు అమ్మకు సపోర్ట్ చేయకుండా కాంచనకు ఎందుకు మద్దతునిస్తున్నారని అంటుంది జ్యోత్స్న. దాంతో దశరథ జ్యోత్స్నపై మండి పడుతాడు.కానీ సుమిత్ర అడ్డుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X