Karthika Deepam 2 September 4th: సుమిత్ర కీలక నిర్ణయం.. కార్తీక్, దీపాలకు గట్టిగ దెబ్బ
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 3వ తేదీ 453వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సుమిత్ర ఇంటికి వచ్చిన తర్వాత శివ నారాయణ, దశరథ మండి పడుతారు. అసలు నువ్వు ఇలా ఎందుకు చేశావు అని ప్రశ్నిస్తారు. అసలు నేను చేసిన దాంట్లో తప్పు ఏమీ ఉందని సుమిత్ర ప్రశ్నిస్తుంది. నాకు ఇష్టం లేకున్నా కూడా నేను కార్యక్రమానికి వచ్చాను. కానీ దీపా చేసిన పనికి నా గుండె రగిలి పోయింది. అందుకే అలా చేశానని అంటుంది. ఇక నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని దశరథ సుమిత్రపై మండి పడుతాడు. మరోవైపు శివ నారాయణ కూడా మాట్లాడుతూ కార్తీక్ దీపాల పెళ్లిని ఇంట్లో జరిపించే ముందు అందరీ అభిప్రాయాలు తీసుకున్నాను కదా అని అంటాడు. అప్పుడే చెప్పొచ్చు కదా అని, ఎందుకు ఇలా బాధ పెట్టడం అని శివ నారాయణ ప్రశ్నిస్తాడు.
కానీ జ్యోత్స్న మీరంతా అనవసరంగా అమ్మను తిడుతున్నారని శివ నారాయణ, దశరథను ప్రశ్నిస్తుంది. అసలు ఆ రోజు మనల్ని కాదని కాంచన అత్త దీపా కోసం వెళ్లిపోయింది. తాత పరువును పక్కన పెట్టి ఎవరో ముక్కుమోహం తెలియని దీపా కోసం వెళ్లిపోయింది. దీపాకే సపోర్ట్ గా మాట్లాడింది. ఇప్పుడు మనం ఎందుకు అమ్మకు సపోర్ట్ చేయడం లేదు. అమ్మ మనకు శత్రువులుగా ఉన్న కాంచన అత్తకు వ్యతిరేకంగా ఉంది అందులో తప్పేమీ లేదు. మీరు ఇప్పుడు అమ్మకు సపోర్ట్ చేయకుండా కాంచనకు ఎందుకు మద్దతునిస్తున్నారని అంటుంది జ్యోత్స్న. దాంతో దశరథ జ్యోత్స్నపై మండి పడుతాడు.కానీ సుమిత్ర అడ్డుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఇక సెప్టెంబర్ 4వ తేదీ 454 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబను శివ నారాయణ కారులో బయటికి వెళ్తారు. చాలా సేపు కారులో ప్రయాణం చేస్తూనే ఉంటాడు. కానీ శివ నారాయణ మాత్రం కార్తీక్ బాబుతో అస్సలు మాట్లాడడు. దీంతో కార్తీక్ బాబు ఏమైంది పెద్దసార్ మౌనంగా ఉన్నారని అంటాడు. ఇంతకీ ఎక్కడికి వెళ్లాలో చెప్పకుండా మౌనంగా కూర్చుంటు మనం ఎక్కడికి వెళ్తున్నట్టు అని ప్రశ్నిస్తాడు. దాంతో శివ నారాయణ ఇంతకీ నువ్వు ఎక్కడికి అని అడుగుతాడు. పెట్రోల్ కొట్టించడానికి అని బదులు ఇస్తాడు. దీంతో శివ నారాయణ నేను కూడా అక్కడికే వస్తున్నాను అని బదులిస్తాడు. ఎందుకు మా డ్రైవర్ల మీద నమ్మకం లేదా సార్ అని అంటాడు కార్తీక్ బాబు. మేము నమ్మకస్తులనే డ్రైవర్లుగా పెట్టుకుంటామని అంటాడు. దీంతో కార్తీక్ బాబు మరి మా వెంట ఎందుకు వస్తున్నట్టు అని అడుగుతాడు. ఇక శివ నారాయణ మండి పడుతాడు. ఓరేయ్ ముందు కారు ఆపమని అంటాడు. అసలు నేను ఎందుకు మౌనంగా ఉన్నానో, ఎందుకు చిరాకు పడుతున్నానో నీకు తెలియడం లేదా అని ప్రశ్నిస్తాడు. దాంతో కార్తీక్ బాబు కారు ఆపుతాడు. ఇద్దరు దిగుతారు. ఆ తర్వాత శివ నారాయణ కార్తీక్ బాబుతో మీ ఏమంటుందిరా అని అడుగుతాడు.
కార్తీక్ బాబు, దీపాల పెళ్లిలో తాళిని దొంగలించింది సుమిత్రనే అని తెలియడంతో మీ ఇంట్లో కనీసం క్షమాపణలు కూడా చెప్పలేని పరిస్థితితో ఉండిపోయాం. ఇందుకు మీ అమ్మ ఎలా స్పందించిందంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. దాంతో కార్తీక్ బాబు మీ మీద మా అమ్మ చాలా కోపంగా ఉందని అంటాడు. ఇక ఆ వెంటనే తల్లి కాంచనకు ఫోన్ చేసి తాత ముందే మాట్లాడుతాడు. అమ్మా నీకు మీ పుట్టింటి వాళ్ల మీద కోపం పోయింది కదా అని అడుగుతాడు. దాంతో కాంచన నువ్వే మరిచిపోమని చెప్పి మళ్లీ గుర్తు చేస్తావు ఏంట్రా అని అంటుంది. అసలు వాళ్ల మీద నాకు కోపం తగ్గలేదు అని బదులిస్తుంది. చేసిందంతా సుమిత్ర కదా తాత మీద ఏం కోపం లేదు కదా అమ్మా అని అంటాడు. దాంతో కాంచన అసలు మా నాన్నే అన్నింటికి కారణం, ఆయన పోకడలే ఇలాంటి పరిస్థితులను తీసుకొచ్చి పెట్టిందని మండి పడుతుంది. ఆవెంటే ఫోన్ కట్ చేస్తుంది. ఇక శివనారాయణ కాంచనకు కోపం తగ్గలేదని గమనించి బాధపడుతాడు.
ఇక మరోవైపు శ్రీధర్ కావేరితో ఘర్షణ పడుతూ ఉంటాడు. అసలు దీపా కార్తీక్ బాబుల పెళ్లికి నేను రాకుంటే బాగుండని అనిపించింది. అసలు అక్కడ నాకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని అంటాడు. ఎప్పటికైనా దీపాను కార్తీక్ బాబు నుంచి విడదీస్తానని అంటాడు. దాంతో కావేరి అలా చేయొద్దని చెబుతుంది. ఇదే సమయంలో దాసు ఇంటికి వస్తాడు. శ్రీశైలం వెళ్తున్నానని, కార్తీక్ బాబు దీపాల పెళ్లి జరిగినందుకు మొక్కు తీర్చుకుంటానని చెబుతాడు. కావేరి అక్క ముడుపు ఇస్తానంటే వచ్చానని చెబుతాడు. ఇంతకీ ఆ మొక్కు ఏంటని శ్రీధర్ కావేరిని ప్రశ్నిస్తాడు. కార్తీక్ బాబు, దీపాలకు కొడుకు పుట్టాలని కోరుకుంటున్నానని బదులిస్తుంది. ఆ మాటలు విని శ్రీధర్ షాక్ అవుతాడు. ఇక కాశీ దీపా గురించి మీకు పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నారు బావ. ఏదొక రోజు దీపాను నెత్తిన పెట్టుకుంటారని దాసు మనస్సులో అనుకుంటాడు. అదే విషయాన్ని శ్రీధర్ కు చెప్పేందుకు చూస్తున్నవన్నీ నిజాలు కాదని, ఏదో ఒక సందర్భంలో నీ కళ్లు తెరుచుకుంటాయని అంటాడు.
సుమిత్రను దశరథ ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు చేసిన పనికి మా చెల్లి కాంచన అక్కడ ఏడుస్తూ ఉందని అంటాడు. సుమిత్రను వెళ్లి కాంచనకు క్షమాపణలు చెప్పమని అంటాడు. కానీ సుమిత్ర అందుకు ఒప్పుకోదు. పైగా జ్యోత్స్న సుమిత్రకు మద్దతుగా ఉంటుంది. అమ్మ అస్సలు జ్యోత్స్నకు క్షమాపణ చెప్పదని అంటుంది. అసలు ఆ అనాథ దీపా కోసం మీరు ఎందుకు ఇంతలా బాధపడుతూ ఉన్నారు డాడీ అని ప్రశ్నిస్తుంది. ఇక దీపా వీరి మాటలన్నింటిని వింటూ ఉంటుంది. దశరథ సుమిత్రపై మండి పడుతూనే ఉంటాడు. నువ్వు చేసింది ముమ్మాటీకి తప్పే అని అంటాడు. నువ్వు ఎలాగైనా కాంచనకు క్షమాపణలు చెప్పమని అంటాడు. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను కూడా నీతో మాట్లాడను అని అంటాడు. నేను కూడా జీవితాంతం క్షమించనని అంటాడు. అదే సమయంలో దీపా కాఫీ తీసుకుని వస్తుంది. ఇక జ్యోత్స్న దీపాను నీ వల్లనే అసలు సమస్యలు వచ్చాయని ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి నెట్టెస్తుంది. సుమిత్ర కూడా దీపాతోనే అన్ని దరిద్రాలు అని మండి పడుతుంది. మరోసారి పారు దీపాను నెట్టెస్తేంది. దాంతో అప్పటికే బయటికి వెళ్లికి ఇంటికి కార్తీక్ బాబు, శివ నారాయణ తిరిగి వస్తారు. దీపాను పారు జాతం నెట్టేయడంతో కార్తీక్ బాబు వెళ్లి పట్టుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











