Karthika Deepam 2 September 6th: జ్యోత్స్న కుట్రకు దశరథ బలి.. జ్యోకు కార్తీక్ బాబు వార్నింగ్

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 5వ తేదీ 455వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపాలకు పెళ్లి జరగడంతో ఒక తంతు ముగిసింది. ఆ తర్వాత కార్తీక్ బాబు, దీపాల జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాళిబొట్టు తీసింది సుమిత్ర అని తెలియడంతో మరో కొత్త సమస్య తల్లెత్తింది. ఎంతగానో సుమిత్రపై నమ్మకం పెట్టుకుంటే చివరికి ఇలా చేసిందేంటీ అని కాంచన, కార్తీక్ బాబు, దీపా చాలా బాధపడుతారు. ఇక సుమిత్ర మాత్రం మరింత కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చేసిన పని ఏం బాగా లేదని దశరథ సుమిత్రపై మండిపడుతాడు. వెంటనే వెళ్లి కాంచనకు, దీపాకు, కార్తీక్ బాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. కానీ సుమిత్ర చెప్పనని అంటుంది. అంతే కాకుండా జ్యోత్స్న కూడా అమ్మ వాళ్లకు అస్సలు క్షమాపణలు చెప్పదని, మనం అమ్మను ఎందుకు ఫోర్స్ చేయాలని ప్రశ్నిస్తుంది. సుమిత్ర క్షమాపణలు చెప్పకపోతే నేను అస్సలు మాట్లాడను అని చెబుతాడు.

ఆ తర్వాత దశరథ వెళ్లి కార్తీక్ బాబు, దీపాలకు క్షమాపణలు చెబుతాడు. సుమిత్ర చేసిన పనికి నేను క్షమాపణలు చెబుతున్నానని అంటాడు. అయితే కార్తీక్ బాబు, దీపాలకు దశరథ క్షమాపణలు చెప్పడాన్ని జ్యోత్స్న సుమిత్ర వింటారు. ఇక జ్యోత్స్న సుమిత్రకు మరిన్ని రెచ్చగొట్టేలా మాటలు చెబుతుంది. నాన్న కార్తీక్, దీపాలకు క్షమాపణలు చెప్పాడంటే నువ్వు తప్పు చేశావని నమ్ముతున్నాడని సుమిత్రతో అంటుంది. అసలు నువ్వు తాళిని తీసింది నాకోసమే కదా, నా జీవితం కోసమే కదా, అంటే నాన్నకు నా జీవితంపై శ్రద్ధ లేదా, నీ ఒక్కదానికే అవసరమా అని అంటుంది. దాంతో సుమిత్రకు మరింత కోపం వస్తుంది. వెంటనే తన గదిలోకి వెళ్తుంది. ఇక జ్యోత్స్న ఎలాగైనా దశరథ, సుమిత్రను విడదీస్తానని అనుకుంటుంది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోలేనని అంటుంది. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సెప్టెంబర్ 6వ తేదీ 456 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 456 September 6th 2025

పారుజాతం కార్తీక్ బాబుతో ఛాలెంజ్ చేస్తుంది. ఇకపై మీ ఆటలు ఇంట్లో సాగవని అంటుంది. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు మీరు. మున్ముందు నేను అంటే ఏంటో చూపిస్తానని అంటుంది. ఆ వెంటనే శ్రీధర్ నుంచి పారుకు ఫోన్ వస్తుంది. మాట్లాడి వస్తానని వెళ్తుంది. శ్రీధర్ తో మాట్లాడుతూ ఇంట్లో జరుగుతున్న విషయాలన్నింటి గురించి తెలుసుకుంటాడు. ఆ శివ నారాయణ తమకు సపోర్ట్ చేసి ఉంటే మాత్రం దీపాతో పెళ్లి కాకుండా ఆపేసే వాళ్లమని శ్రీధర్ అంటాడు. ఇక పారు స్పందిస్తూ అవునవును అని బదులిస్తుంది. మరో విషయం ఏంటంటే దశరథ, సుమిత్ర ఇంట్లో మాట్లాడుకోవడం లేదని చెబుతుంది. ఆ దీపా చేసిన పనికి అందరూ విడిపోవాల్సిందే లే అని శ్రీధర్ అంటాడు. నా పెద్ద భార్య కాంచనను నాకు దూరంగా చేసింది. అటు కార్తీక్ బాబు, జ్యోత్స్నను కలవకుండా చేసిందని అంటాడు. ఇలా దీపా మాట్లాడుతూ మాట్లాడుతూ సడెన్ గా కింద పడిపోతుంది. గమనించిన కార్తీక్ బాబు వెంటనే పైకి తీసుకెళ్లి డాక్టర్ ను పిలిపిస్తాడు. డాక్టర్ వచ్చిన తర్వాత టెస్టులు చేసి పారుకు బీజీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉందని చెబుతాడు. అడ్డమైన గడ్డి తింటే హార్ట్ ఎటాక్ వచ్చి పోతావని హెచ్చరిస్తాడు. దాంతో సారు షాక్ అవుతుంది. ఇకపై ఫుడ్ డైట్ చాలా ఇంపార్టెంట్ అని చెబుతాడు. ఆ బాధ్యతను కార్తీక్ బాబుకు అప్పటిస్తారు.

ఇక దీపా కార్తీక్ బాబుపై మండి పడుతుంది. కోపంగా ఉంటుంది. కార్తీక్ బాబు మాత్రం అర్థంకాక ఏమైంది దీపా అని అడుగుతాడు. ఇంట్లో ఉదయం ఎంతో పెద్ద గొడవ జరిగిందని అంటుంది. అసలు నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తుంది. కనీసం గొడవ గురించి కూడా అడగటం లేదని మండి పడుతుంది. ఉదయం అమ్మ సుమిత్ర, నాన్న దశరథకు మధ్య పెద్ద గొడవ జరిగిందని చెబుతుంది. కాంచన అత్త క్షమించే వరకు సుమిత్రమ్మతో నాన్న దశరథ మాట్లాడనని చెప్పారు. అప్పటి నుంచి మాట్లాడుకోవడం లేదని చెబుతుంది. దాంతో కార్తీక్ బాబు షాక్ అవుతాడు. అదంతా జ్యోత్స్న ప్లాన్ అయ్యి ఉంటుందని అంటాడు. నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకు అని చెబుతూ ఉంటాడు. మీ అమ్మా నాన్నను కలిపే బాధ్యత నాది అని దీపాతో కార్తీక్ బాబు చెబుతాడు. ఇదే సమయంలో జ్యోత్స్న కిచెన్ దగ్గరకు వచ్చి వారిద్దరు మాట్లాడుకునే మాటలు వింటుంది. నువ్వు మా అమ్మానాన్నను ఇకపై అమ్మా, నాన్న అని పిలవకూడదని దీపాతో అంటుంది. మీ పెళ్లి తర్వాత వరుసలన్నీ మళ్లీ మారిపోయాయని, ఇంకోసారి అమ్మా నాన్న అని అస్సలు పిలవకూడదని హెచ్చరిస్తుంది.

ఆ తర్వాత జ్యోత్స్న, కార్తీక్ బాబుతో ప్రైవేట్ గా మాట్లాడాలని అంటుంది. ఇంటి బయటికి వెళ్లిన తర్వాత కార్తీక్ బాబును దీపా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అసలు దీపా ఎందుకు చాలా మారిపోయినట్టుగా కనిపిస్తోందని అడుగుతుంది. మీకు ఎందుకు అలా అనిపిస్తుందని కార్తీక్ బాబు జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు. నేను మొదట్లో చూసిన దీప వేరు, ఇప్పుడు కనిపిస్తున్న దీప వేరు. దీప ప్రవర్తన విషయంలో చాలా మార్పులు వచ్చాయని అంటుంది. అందుకు కారణం ఏంటని అడుగుతుంది. కార్తీక్ బాబు స్పందిస్తూ ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే నువ్వు నాకో ప్రశ్నకు బదులివ్వాలని అడుగుతాడు. నీకు దీపాపై కోసం నన్ను పెళ్లి చేసుకున్నందుకేనా ఇంకేదైనా కారణం ఉందా? అని ప్రశ్నిస్తాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీపా అసలు వారసురాలు కాబట్టే నేను ద్వేషిస్తున్నాననే సంగతి నీకు తెలియదు కదా బావ అని జ్యోత్స్న మనస్సులలో అనుకుంటుంది. నాకు నువ్వంటే ఇష్టం, దీపా, నువ్వు నా జీవితంతో ఆడుకున్నారు. ఇకపై దీపాతో పాటు నీ మీద కూడా పగసాధిస్తానని బదులిస్తుంది. సుమిత్ర, దశరథలను కలవకుండా చేస్తున్నది కూడా నువ్వే కదా అని కార్తీక్ బాబు అంటాడు. అవునే నేనే అని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది. దాంతో కార్తీక్ బాబు ఇకపై నీ ఆటలు సాగవని అంటాడు. త్వరలోనే వారిద్దరిని కలుపుతానని, నిన్ను దీపా కాళ్ల మీద పడేలా చేస్తానని సవాల్ విసురుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X