Karthika Deepam 2 Weekly: కార్తీక్ బాబుతో జ్యోత్స్న ఛాలెంజ్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. శివ నారాయణ ఇంట్లో ఊహించని గొడవలు జరుగుతున్నాయి. జ్యోత్స్న కొత్త కుట్రలకు పూనుకుంటోంది. అందుకు కార్తీక్ బాబు జ్యోత్స్నను కట్టడిచేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే...
సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో..
కార్తీక్ బాబుపై దీపా మండి పడుతుంది. అసలు జరిగిన విషయాన్ని నువ్వు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోపం చేస్తుంది. ఇంతకు ముందే ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా ఇంత సింపుల్ గా మర్చిపోయావని ఫైర్ అవుతుంది. అంతకు ముందు దశరథ సుమిత్ర మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లితో సుమిత్ర తాళిబొట్టును తీసిన సంగతి తెలిసిందే. ఇక ఆ విషయం అప్పటికే కార్తీక్ బాబుకు సుమిత్ర అత్త తాళిబొట్టును తీయడం గమనిస్తాడు. కానీ ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. సుమిత్ర అత్తతో మాత్రం పర్సనల్ అడిగి తెలుసుకుంటాడు. ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు. కానీ సుమిత్ర మాత్రం మౌనంగా ఉండిపోతుంది. సుమిత్ర తాళి తీసిందనే విషయం పారుజాతానికి కూడా తెలుస్తుంది. దాంతో కార్తీక్ బాబు ఇంటికి పూజకు వెళ్లిన సందర్భంగా పారుజాతం సుమిత్ర పేరు చెబుతుంది.

సెప్టెంబర్ 2వ తేదీ ఎపిసోడ్‌లో
పెళ్లిలో తాళిబొట్టు తీసిందే నువ్వే అయ్యి ఉంటావని పారుజాతాన్ని కావేరి కూతురు స్వప్న అంటుంది. దాంతో పారుకు మండి పోతుంది. నా మీదనే నిందలు వేస్తారా? అని రగిలిపోతుంది. ఈ రోజు అసలు విషయంలో ఏంటో తేలిపోవాల్సిందే అని నానా రచ్చ చేస్తుంది. అసలు తాళి బొట్టు తీసింది ఎవరనేది ఇప్పుడే అందరికీ తెలియాల్సిందేనని అంటుంది. ఆ తాళి బొట్టు తీసింది నేను కాదు, తీసిన వ్యక్తి ఎవరు అనే సంగతి కార్తీక్ బాబుకు తెలుసని పారుజాతం అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఎవరో చెప్పురా కార్తీక్ అని అడుగుతారు. ఈరోజు వాళ్ల అంతు చూస్తానని శివ నారాయణ, దశరథ అంటాడు. కానీ కార్తీక్ బాబు సుమిత్ర అత్త పేరు ఏమాత్రం చెప్పబోడు. దాంతో పారుజాతం కార్తీక్ బాబు చేయి తీసుకొని కాంచన తల మీద పెట్టి ఇప్పుడు నిజం చెప్పరా అని అుడుగుతుంది. అప్పటికీ కార్తీక్ బాబు నిజం చెప్పాలా వద్దా అనే సందేహంలోనే ఉంటాడు. ఇదే సమయంలో సుమిత్ర తానేనని నిజం ఒప్పుకుంటుంది.
సెప్టెంబర్ 3వ తేదీ ఎపిసోడ్‌లో
సుమిత్ర చేసిన పనికి అంతా షాక్ అవుతారు. కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో సుమిత్ర దశరథల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. దీపాపై జ్యోష్న చేయి చేసుకుంటుంది. సుమిత్ర చేసిన పనికి దశరథ రగిలిపోతాడు. నువ్వు వెంటనే మా చెల్లి కాంచనకు, మేనల్లుడు కార్తీక్ బాబుకు, దీపాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తాడు. కానీ సుమిత్ర మాత్రం అస్సలు క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకోదు. కానీ దశరథ మాత్రం క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టుకొని కూర్చొంటాడు. ఇదే సమయంలో దశరథ, సుమిత్రల మధ్య జ్యోత్స్న కలగజేసుకుంటుంది. అమ్మ ఎందుకు వారికి క్షమాపణలు చెప్పాలి నాన్న అని ప్రశ్నిస్తుంది. అసలు మీరు ఎందుకు ఈ విషయంలో అమ్మను చాలా ఒత్తిడి చేస్తున్నారని దశరథను అడుగుతుంది. గతంలో కాంచన అత్త ఇంట్లో వాళ్ళను ఎదిరించి, తాతయ్యకు మీకు వ్యతిరేకంగా ఉండి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కనీసం మన పక్షాణ లేదు. కానీ ఈరోజు మాత్రం ఆ అనాథ దీపా కోసం మీరు ఎంతుకు అడ్డుగా ఉంటున్నారు. దీపాకు ఎందుకంత సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నిస్తుంది. అమ్మ ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోదు అని అంటాడు.
సెప్టెంబర్ 4వ తేదీ ఎపిసోడ్‌లో
దీపాకు, కార్తీక్ బాబుకు, కాంచనకు సుమిత్ర కూడా నేను అస్సలు క్షమాపణలు చెప్పబోనని తెగేసి చెబుతుంది. దాంతో దశరథకు ఇంకా కోపం వస్తుంది. ఇదే నీ తుది నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా వినమని అంటాడు. కాంచనకు నువ్వు క్షమాపణలు చెప్పే వరకు, కాంచన నిన్ను క్షమించే వరకు నేను నిన్ను క్షమించేది లేదు. ఈ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు అని చెప్పి వెళ్లిపోతాడు. ఇదే అదునుగా జ్యోత్స్న దశరథ - సుమిత్ర మధ్య మరింత చిచ్చు పెట్టాలని చూస్తుంది. అయితే అప్పటికే దీపా వారి మాటలు అన్ని వింటుంది. గది దగ్గరికి రావడంతో జ్యోత్స్న అసలు నీ వల్లనే ఇంత పెద్ద రచ్చ జరుగుతుందని మండి పడుతుంది. కావాలని గొడవను పెద్దగా చేయాలని అనుకుంటుంది. దాంతో దీపా మెడ పట్టుకొని ఇంటి బయటికి నెట్టేస్తుంది. అదే సమయంలో కార్తీక్ బాబు, దశరథ ఇంటికి తిరిగి వస్తారు. దీపాపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో షాక్ అవుతారు. దీపా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటే ఇక అగ్రిమెంట్ కూడా ముగించాల్సి ఉంటుందని అంటాడు. అందుకు కుదరదు అని జ్యోత్స్న అంటుంది.
సెప్టెంబర్ 5వ తేదీ ఎపిసోడ్‌లో
ఇంట్లో నుంచి దీపాను వెళ్లగొట్టడంపై శివ నారాయణ స్పందిస్తూ దీపాను ఎవ్వరు ఏమీ అనాల్సిన పనిలేదు అని అంటాడు. ఆమె విషయంలో జ్యోక్యం చేసుకుంటే నేనే ఇంటి నుంచి వెళ్లాల్సి ఉంటుందని అంటాడు. ఇక ఆ తర్వాత దీపా కార్తీక్ బాబుల మధ్య గొడవ జరుగుతుంది. ఇంత పెద్ద గొడవ జరిగినా కూడా నువ్వు ఏమీ స్పందించడం లేదని అంటుంది. అమ్మ సుమిత్ర, నాన్న దశరథను విడదీసేందుకు జ్యోత్స్న కుట్ర పన్నుతోందని దీపా కార్తీక్ బాబుతో చెప్పుకుంటూ బాధపడుతుంది. దాంతో కార్తీక్ బాబు దీపాకు మరోసారి ప్రామీస్ చేస్తాడు. మీ అమ్మానాన్నలను కలిపే బాధ్యత నాది అని అంటాడు. ఆ విషయంలో జ్యోత్స్న వింటుంది.
సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్‌లో
జ్యోత్స్న కార్తీక్ బాబు దగ్గరకు వచ్చి ఛాలెంజ్ చేస్తుంది. దీపాకు నువ్వు సపోర్ట్ గా నిలుస్తున్నావో నాకు అర్థం అవుతుంది, అసలు దీపా ప్రవర్తనలో ఇటీవల కాలంలో చాలా మార్పులు వచ్చాయి. అందుకు కారణం ఏంటో అర్థం కావడం లేదు అని కార్తీక్ బాబుతో అంటుంది. వీటి లెక్కలన్నీ త్వరలోనే తేల్చుతానని అంటుంది. ఆ వెంటనే కార్తీక్ బాబు జ్యోత్స్నను ఒక ప్రశ్న అడుగుతాడు. అసలు నీకు దీపా మీద కోపం ఎందుకు అని ప్రశ్నిస్తాడు. కేవలం నన్ను పెళ్లి చేసుకున్నందుకేనా లేకా ఇంకేదైనా కారణం ఉందా? అని అడుగుతాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. బావకు దీపానే అసలు వారసురాలు అనే సంగతి తెలిసిపోయిందా? లేక నాకు తెలుసు అనే విషయం తెలిసిందా? అని షాక్ అవుతుంది. దీపా, నువ్వు నా జీవితంతో ఆడుకున్నారు. మిమ్మల్ని నేను అస్సలు వదిలి పెట్టను. ఇక సుమిత్ర, దశరథలను కూడా అస్సలు కలవనివ్వను అని కార్తీక్ బాబుతో ఛాలెంజ్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











