Karthika Deepam 2 September 8th: కార్తీక్ బాబుకు షాకిచ్చే పనిలో జ్యోత్స్న.. ఉతికారేసిన వంటలక్క

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 6వ తేదీ 456వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సుమిత్ర, దశరథలు మాట్లాడుకోవడం మానేస్తారు. సుమిత్ర తాళిబొట్టు తీసినందుకు కార్తీక్ బాబు, దీపా, కాంచనలకు క్షమాపణలు చెప్పాలని దశరథ డిమాండ్ చేస్తాడు. అందుకు సుమిత్ర ఒప్పుకోదు. దీంతో దశరథ అప్పటి వరకు నేను నిన్ను క్షమించను అలాగే కనీసం మాట్లాడను కూడా అని చెబుతాడు. ఇదే సమయంలో జ్యోత్స్న దీపాపై మండి పడుతుంది. నీ వలనే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, మా అమ్మానాన్న నీ వల్లనే మాట్లాడుకోవడం లేదని ఫైర్ అవుతుంది. ఇక నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదని ఇంట్లో నుంచి వెళ్ల గొడుతుంది. మెడపట్టి గెంటిన సమయంలోనే కార్తీక్ బాబు, శివ నారాయణ వచ్చి జ్యోత్స్న తీరును తప్పుబడుతారు.

దీపా ఈ ఇంట్లో ఉండకూడదంటే మన అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేయాలని కార్తీక్ బాబు అంటాడు. అలా జరగదని జ్యోత్స్న అంటుంది. ఇక శివనారాయణ జ్యోక్యం చేసుకొని దీపాను ఇంట్లోకి వెళ్లమంటాడు. ఇలాంటి గొడవలు సృష్టిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటాడు. ఇక ఆ తర్వాత అందరూ నార్మల్ అవుతారు. దశరథ కార్తీక్ బాబు, దీపాలకు క్షమాపణలు చెబుతాడు. తప్పు చేసింది మీరు కాదు కదా అని వారు అంటారు. ఆ తర్వాత జ్యోత్స్న కార్తీక్ బాబు దగ్గరకు వెళ్లి సవాల్ చేస్తుంది. అమ్మానాన్నలను విడదీస్తానని అంటుంది. ఇప్పటికే వారిద్దరి మధ్య మాటలు లేవని, ఆ గొడవను ఇంకా పెద్దది చేస్తానని, దీపా మొహంపై చిరునవ్వును తొలగిస్తానని అంటుంది. ఇక కార్తీక్ బాబు అలా అస్సలు జరగనివ్వనని అంటాడు. నీకు ముందు ముందు అసలు విషయాలు తెలుస్తాయని అంటాడు. నేను ఇకపై ఆడబోయే ఆటతో నీకు మెంటల్ వస్తుందని, దీపా కాళ్లు పట్టుకునే స్థాయికి తీసుకొస్తానని, నీకు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనలు కూడా వస్తాయని కార్తీక్ బాబు దీపాను హెచ్చరిస్తాడు. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సెప్టెంబర్ 8వ తేదీ 457 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 457 September 8th 2025

దీపా ఇంట్లో వాళ్లందరికీ భోజనాలను వండి డైనింగ్ టేబుల్ పై సిద్ధంగా ఉంచుతుంది. ఇదే సమయంలో పారుజాతం దీపాను ఏమె పని మనిషి అని పిలుచుకుంటూ వస్తుంది. ఈరోజు ఏంఏం వంటలు వండావని అడుగుతుంది. నీపై నాకు ఎంత కోపం ఉన్నా కూడా నీ వంటలకు మాత్రం నేను పెద్ద ఫ్యాన్ నే అని చెబుతుంది. ఇక దీపా మాత్రం ఏమాత్రం బదులివ్వకుండా పారుజాతం చెప్పే మాటలను మాత్రమే వింటూ ఉంటుంది. వంటలు మాత్రం గుమగుమ వాసనలు వస్తూ ఉన్నాయని చెబుతుంది. ఒక పట్టు పడుదామని అంటుంది. అదే సమయంలో శివ నారాయణ వస్తాడు. ఎవరినీ ఒక పట్టుపడుదామని అనుకుంటున్నావని పారుజాతాన్ని అడుగుతాడు. పారుజాతం మాత్రం సైలెంట్ గా ఉంటుంది. ఇక అందరూ భోజనాలు తినడానికి వస్తారు. సుమిత్ర, దశరథ, జ్యోత్స్న భోజనం చేయడానికి వచ్చి డైనింగ్ టేబుల్ పై కూర్చొంటారు. అయితే దశరథ మాత్రం సుమిత్ర పక్కన కూర్చొవడానికి ఒప్పుకోడు. వెళ్లి సెపరేట్ గా కూర్చొంటాడు. అది చూసిన దశరథ వీరి ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అనుకుంటాడు. ఎందుకు సుమిత్ర పక్కన కూర్చోలేదని అడుగుతాడు. అందుకు దశరథ నాకు ఇక్కడే సౌకర్యంగా ఉంది నాన్న అని బదులిస్తాడు. దాంతో శివ నారాయణ వీరి ఇద్దరి మధ్య మాటలు లేవని తెలుసుకుంటాడు.

ఎందుకు వీరు మాట్లాడుకోవడం లేదని షాక్ అవుతాడు. అసలు వీరి మధ్య గొడవ రోజురోజకు ఇంకా పెద్దగా అవుతుంది కదా అని మనస్సులో బాధపడుతూ ఉంటాడు. ఇదే సమయంలో పారుజాతం భోజనం తినడానికి రెడీగా ఉంటుంది. దీపా అందరికీ భోజనాలను వడ్డిస్తుంది కానీ, పారుజాతానికి మాత్రం అస్సలు వడ్డించదు. నాకు ఎందుకు వడ్డించడం లేదని పారిజాతం ప్రశ్నిస్తుంది. అందుకు దీపా స్పందిస్తూ మీకు ఈ వంటలు వడ్డించకూడదని కార్తీక్ బాబు చెప్పారని అంటుంది. మీకోసం కార్తీక్ బాబు సెపరేట్ గా వేరే వంటలు వండి తీసుకు వస్తున్నారని చెబుతుంది. దాంతో ఏ బిర్యానీనో వండి తీసుకోస్తాడని పారుజాతం ఆశిస్తుంది. కానీ కార్తీక్ బాబు మాత్రం అన్ని ఉడికించిన కూరగాయలు తీసుకొని వస్తాడు. పారుజాతంతో ఇష్టంలేకపోయినా తినిపిస్తాడు. ఆ తర్వాత సుమిత్ర, దశరథలు మాట్లాడుకోకపోవడంపై శివ నారాయణ బాధపడుతాడు. కార్తీక్ బాబు, దీపాలు చక్కగా ఉంటారని అంటాడు. భార్యభర్తలు అంటే వారిలానే ఉండాలని సూచిస్తాడు. ఎలాంటి గొడవలు వచ్చినా నాలుగు గోడల మధ్యనే తేల్చుకోవాలని, ఆ తర్వాత కలిసి ముందుకు వెళ్లాలని చెబుతాడు.

ఇక జ్యోత్స్న స్పందిస్తూ అవును తాత కానీ కొన్ని మర్చిపోలేని విషయాలు కూడా ఉంటాయి కదా అని కార్తీక్ బాబు, దీపాలను ఉద్దేశిస్తూ అంటుంది. అందుకు శివ నారాయణ బదులిస్తూ మరిచిపోవాలి జ్యోత్స్న, మరపు అన్నది దేవుడు ఇచ్చిన గొప్పవరం. అప్పుడే జీవితం సంతోషంగా గడపగలం అని చెబుతాడు. ఇక శివ నారాయణ మాటలు కూడా కార్తీక్ బాబుకు మద్దతుగా ఉండటంతో జ్యోత్స్న లోలోపల మండి పోతుంది. అసలే అప్పటికే కార్తీక్ బాబుతో సుమిత్ర, దశరథలను కలవనివ్వనని సవాల్ చేసి ఉన్నానని, ఎలాగైనా వారిద్దరిని కలవకుండా చూడాల్సిన బాధ్యత తనపైనే ఉందని అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ బాబు మాత్రం జ్యోత్స్న ఆటలను కట్టిపడేయాలని అనుకుంటాడు. ఎలాగైనా దశరథ, సుమిత్రలను కలిసి జ్యోత్స్నకు గుణపాఠం చెప్పాలని భావిస్తాడు. అందుకు ఏదోక ప్లాన్ వేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు తమ ఇంట్లో కాంచనకు సుమిత్ర, దశరథ మాట్లాడుకోవడం లేదని తెలుస్తోంది. దాంతో బాధపడుతుంది. తన వదిన సుమిత్రను అన్నయ్య దశరథ క్షమించడం లేదని తెలుసుకొని బాధపడుతుంది. అది గమనించిన కార్తీక్ బాబు త్వరలోనే వారిని కలుపుతానని హామీనిస్తాడు. ఆ తర్వాత ఎలా ప్లాన్ చేశావు అని దీపా కార్తీక్ బాబును అడుగుతుంది. నువ్వే చుద్దువులే ఇలాంటి విషయాలను ఎక్కువగా సాగదీయకూడదని బదులిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X