Karthika Deepam 2 September 9th: జ్యోత్స్న కుట్ర.. మరింత మొండిగా సుమిత్ర
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 8వ తేదీ 457వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సుమిత్ర, దశరథ మధ్య గొడవ గురించి శివ నారాయణకు తెలుస్తుంది. దాంతో మీరు ఎందుకు మాట్లాడుకోవడం లేదని అని దశరథను అడుగుతాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు సుమిత్ర పక్కను కూర్చోవాల్సి కదా ఎందుకు కూర్చోలేదని శివ నారాయణ ప్రశ్నిస్తాడు. అందుకు నాకు అక్కడ సౌకర్యంగా లేదు నాన్న అని శివ నారాయణతో దశరథ చెబుతాడు. దాంతో వీరద్దరి మధ్య మాటలు లేవని శివ నారాయణ స్పష్టం చేసుకుంటాడు. వీరి మధ్య రోజురోజకు గొడవ ఇంకా పెద్దగా అవుతుందని అనుకుంటుంటాడు. ఇదే అదునుగా జ్యోత్స్న ఇద్దరి మధ్య దూరం పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీపా వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటుంది. దీపా కూడా అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది. దీపాను ఉద్దేశించి జ్యోత్స్న అలా అంటుంది.
కొన్ని విషయాలను మర్చి పోలేం కదా తాతయ్య అని శివ నారాయణతో అంటుంది. మర్చిపోవాలని వెంటనే శివ నారాయణ బదులిస్తాడు. మర్చిపోవడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని అంటాడు. కొన్ని మర్చిపోతూనే సంతోషంగా ఉంటామని అంటాడు. ఇక కార్తీక్ బాబు, దీపాలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. భార్యభర్తలుగా వారు ఎల్లప్పుడు ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఉంటారని అంటాడు. నాలుగు గోడల మధ్య ఏం జరిగినా వెంటనే పరిష్కరించుకుంటూ వారి చక్కటి జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారని చెబుతాడు. మరోవైపు జ్యోత్స్నకు బుద్ధి చెబుతానని, దశరథ సుమిత్రలను విడదీయకుండా చూస్తానని కార్తీక్ బాబు సవాల్ చేస్తాడు. దాంతో ఎలాగైనా బుద్ధి చెప్పాలని ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ ఏంటని దీపా కార్తీక్ బాబును అడుగుతుంది. అందుకు కార్తీక్ బాబు మున్ముందు నీకే తెలుస్తుంది కదా అని అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది చూడాలి. సెప్టెంబర్ 9వ తేదీ 458 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబు కార్ వాషింగ్ కోసమని బయటికి వెళ్తాడు. అక్కడ ఇంకాస్త సమయం పట్టేలా ఉందని టీ తాగుదామని అనుకుంటాడు. అదే సమయంలో కార్తీక్ బాబుకు తండ్రి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే తల తినేస్తాడని కార్తీక్ బాబు ఫోన్ కట్ చేస్తాడు. కానీ శ్రీధర్ మాత్రం మళ్లీ ఫోన్ చేస్తాడు. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసే వరకు మాస్టర్ ఫోన్ చేసేలానే ఉన్నాడు కదా. అసలు ఎందుకు ఫోన్ చేశాడో చూద్దామని లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే శ్రీధర్ మండి పడుతాడు. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. ఎందుకో మీకు తెలియదా? అని ప్రశ్నిస్తాడు. పెళ్లికి రమ్మన్నావ్ వచ్చాను, సత్యనారాయణ వ్రతం పూజకు కూడా వచ్చాను. కానీ నువ్వు మాత్రం నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయినా అవసరం తీరిపోయినాక ఇంకెందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తావ్ లే అని శ్రీధర్ కార్తీక్ బాబును నిందిస్తాడు. వెంటనే కార్తీక్ బాబు తండ్రి శ్రీధర్ పై మండి పడుతాడు. అసలు దీనంతటికి కారణం మీరే. ఏరోజూ కూడా కుటుంబానికి నచ్చినట్టుగా ఉన్న వారు కాదు. ఎప్పుడూ ఏదో రకంగా గొడవ చేయాలనే చూస్తారు. ఏరోజు కూడా మీరు తగ్గింది లేదు.
అసలు మీ ప్రవర్తన మార్చుకోవడానికి ఎప్పుడూ కూడా మీరు ప్రయత్నించి ఉండటం లేదు. మీరు రెండో పెళ్లి చేసుకున్న సమయంలో శివ నారాయణ మిమ్మల్ని కొట్టాడు. అందుకు కారణం మీరు ఆయన్ని మోసం చేశారు. అప్పటి నుంచి శివ నారాయణకు నచ్చేలా ఒక్కరోజైనా ఉన్నారా? రెండో పెళ్లి మినహాయిస్తే శ్రీధర్ అన్ని విషయాల్లో మంచి వాడేననే మాట తెచ్చుకున్నారా? అని కార్తీక్ బాబు ప్రశ్నిస్తాడు. మరోవైపు పారుజాతంతో స్నేహం చేస్తున్నారు. పారు ఎలాంటిదో నాకు పూర్తిగా తెలుసు. ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకెలా సర్దుకుపోమంటారని అడుగుతాడు. మరోవైపు కాశీ దిల్ కారులో వెళ్తూ ఉంటారు. ఇదే సమయంలో కాశీ జాబ్ పోయిందని మెయిల్ వస్తుంది. దాంతో కాశీ షాక్ అయి కారును ఒక స్కూటర్ కు డ్యాష్ ఇస్తాడు. యాక్సిండెంట్ అవుతుంది. మరోవైపు శివ నారాయణ ఇంట్లో పెద్ద చర్చ జరుగుతుంది. తమ కంపెనీ నష్టాల్లోకి వస్తుందని ఇంటికి ఉద్యోగులు వచ్చి శివ నారాయణకు మొర పెట్టుకుంటారు. పోయినసారే మీకు హామీనిచ్చాం కదా, మళ్లీ ఎందుకు ఉద్యోగాలు వదిలేసే ఆలోచనలో ఉన్నారని శివ నారాయణ ఎంప్లాయిస్ ను ప్రశ్నిస్తాడు.
కొన్నాళ్లుగా కంపెనీ నష్టాల్లో ఉందని తెలుస్తోంది. దీంతో మీరు మమల్ని ఉద్యోగంలో నుంచి తీసివేసే ప్రమాదం ఉంది. అందుకే మేం ఇప్పుడే వెళ్లిపోవాలని అనుకుంటున్నామని చెబుతాడు. దాంతో శివ నారాయణ మీరు పొరబడుతున్నారు. అలాంటిది ఏమీ జరగదని అంటాడు. అసలు మీకు కంపెనీ నష్టాల్లోకి వస్తుందని, అలా వచ్చేందుకు కారణం తెలుసా అని ప్రశ్నిస్తాడు. అందరూ జ్యోత్స్న మొహంవైపు చూస్తారు. కానీ నిజం చెప్పరు. ఇక వెంటనే కార్తీక్ బాబు కూడా ఇంటికి తిరిగి వస్తాడు. రాగానే ఉద్యోగులు ఆయన్నీ పలకరిస్తారు. మీ ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని కార్తీక్ బాబు వాళ్లకు హామీనిస్తాడు. వాళ్లు పెళ్లిపోయిన తర్వాత శివ నారాయణ జ్యోత్స్న పై మండి పడుతాడు. నువ్వు సీఈవోగా ఉన్నప్పటి నుంచి కంపెనీ పూర్తిగా నష్టాల్లోనే నడుస్తోందని అంటాడు. ఇక ఆడిటర్ ను పిలిపించి ఎంత నష్టాల్లో ఉందనే వివరాలను తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆడిటింగ్ జరిగితే తను చేసిన మోసం మొత్తం బయట పడుతుందని జ్యోత్స్న భయపడుతుంది. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇక జ్యోత్స్నను సీఈవో పొజిషన్ నుంచి తప్పించాలని నిర్ణయిస్తారు. కానీ జ్యోత్స్న నెల రోజుల సమయం అడుగుతుంది. ఆ లోపు కంపెనీ సమస్యలు తీరకపోతే నీ స్థానంలో మరో సీఈవో వస్తాడని శివ నారాయణ హెచ్చరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











