Karthika Deepam 2 September 10th: దిక్కుతోచని స్థితిలో జ్యోత్స్న.. కార్తీక్ బాబు దెబ్బ అదుర్స్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 9వ తేదీ 458వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబును శివ నారాయణ మెచ్చుకుంటాడు. నష్టాల్లో ఉన్న సత్యరాజ్ రెస్టారెంట్ ను కార్తీక్ బాబు తన తెలివితో మీదికి తీసుకొచ్చారని అంటాడు. కానీ జ్యోత్స్న మాత్రం ఎంతో కష్టపడి జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ను నష్టాల పాలు చేసిందని ఫైర్ అవుతాడు. ఇప్పుడు ఎంప్లాయిస్ సరిగా లేరని, వారిని తొలిగించి యంగ్ టాలెంట్ ను హైర్ చేసుకుంటే కంపెనీ ముందుకు సాగుతుందని జ్యోత్స్న అంటుంది. తొలగించాలనేది నీకు ఒక నిర్ణయం మాత్రమే కానీ అవతల వారికి అది జీవితం అని దీపా అంటుంది. అందుకు జ్యోత్స్న దీపపై ఫైర్ అవుతుంది. అసలు నువ్వు సలహాలు ఇవ్వకు. నువ్వు ఈ ఇంట్లో పనిమనిషివి మాత్రమే అని అంటుంది. దాంతో శివ నారాయణ దీపకు సపోర్ట్ గా ఉంటారు. ఇప్పుడు నువ్వు కూడా సలహానివ్వకపోతేనే మంచిదని శివనారాయణ జ్యోత్స్నపై మండిపడుతాడు. ఇక కంపెనీ ఎంప్లాయీస్ తమ కష్టాలు చెప్పడంతో అసలు కంపెనీ లాభాల్లో ఉందా? లేకా నష్టాల్లో ఉందా? అని ఆడిటింగ్ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటాడు.
3 ఏళ్లుగా కంపెనీ నష్టాల్లోనే నడుస్తోందని తెలుస్తోంది. దీంతో శివ నారాయణకు జ్యోత్స్నపై మరింత కోపం వస్తుంది. నువ్వు వెంటనే ఈ కంపెనీ సీఈవో బాధ్యతలను నుంచి తప్పుకోవాలని అంటాడు. లేదంటే నెలరోజుల్లో నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చి చూపించాలని, లేదంటే కంపెనీ సీఈవోగా మరొకరు వస్తారని హెచ్చరిస్తాడు. మరోవైపు దీపా చెప్పిన మాటలనే సుమిత్ర కూడా అంటుంది. నీకు నిర్ణయాలే ఇతరులకు అది జీవితం అని అంటుంది. ఇక మరోవైపు కాశీ ఉద్యోగం పోతుంది. అంతే కాదు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక బైక్ ను ఢికొంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదనేది చూడాలి. మరోవైపు శ్రీధర్ ను ఇప్పటికైనా మారమని కార్తీక్ బాబు హెచ్చరిస్తాడు. ఇకపైననైనా బాధ్యతగా, హుందాగా ఉండమని చెబుతాడు. దాంతో శ్రీధర్ ఆలోచనలో పడిపోతాడు. కొడుకు అన్న మాటలకు మారాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 10వ తేదీ 459 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

జ్యోత్స్నకు సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. నువ్వు తీసుకునే నిర్ణయాలకు బాధ్యతగా ఉండాలని సూచిస్తుంది. ఒక్కసారి నువ్వు ఎదుటి వారి దగ్గర నమ్మకం కోల్పోతే బాధ పడాల్సి వస్తుందని అంటుంది. ఆపై నువ్వు ఎన్ని విధాలుగా కష్టపడినా లాభం ఉండదని అంటుంది. అందుకు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు మేలు చేసేలా ఉండాలని చెబుతుంది. ఇక పారుజాతం మాట్లాడుతూ అంటే జ్యోత్స్నను రెస్టారెంట్ సీఈవోగా తీసేయడం కరెక్ట్ అని అంటావా సుమిత్ర అని అడుగుతుంది. అందుకు సుమిత్ర మాట్లాడుతూ కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి తీసివేయడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం కాదు. నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకు రావడం అసలైన బాధ్యత అని చెబుతుంది. అది జరగకపోతే బాధ్యతలు వదులుకోవాల్సి వస్తుంది కదా? అని సుమిత్ర అంటుంది. ఇక అచ్చం దీపలానే సుమిత్ర మాట్లాడుతుండటంతో కార్తీక్ బాబు, జ్యోత్స్న షాక్ అవుతాడు. ఎంతైనా తల్లి, కూతురు కదా అని మనస్సులో అనుకుంటారు. ఇక మరోవైపు స్వప్న కావేరి శ్రీధర్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం జరుగుతుంది.
స్వప్న కంగారు పడుతూ ఇంటికి వస్తుంది. కాశీ తను కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యిందని ఇంట్లో చెబుతుంది. ఆ వ్యక్తికి ఒంటినిండా రక్తమే అని, దాంతో ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారని వివరిస్తుంది. అయితే కాశీని పోలీసులు తీసుకెళ్లారని, ఒకవేళ అతను చనిపోతే కాశీని జైలులో వేస్తారని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ విషయం తెలిసిన వెంటనే కావేరి షాక్ అవుతుంది. శ్రీధర్ కూడా షాక్ అవుతాడు. కానీ ఏమాత్రం బదులివ్వడకుండా అలానే మౌనంగా ఉండిపోతాడు. కావేరి మాత్రం అల్లుడు గారెని ఎలాగైనా కాపాడాలని అంటుంది. అల్లుడు ఒకవేళ జైలుకు వెళ్తే మనకే పరువు పోతుందని, అంతకంటే ముందు తమ కూతురు స్వప్న భవిష్యత్ నాశనమైపోతుందని కావేరి ఆందోళన పడుతుంది. ఎలాగైనా వెంటనే కాశీని కలిసి ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని అంటుంది. తన భర్తను కాపాడాలి నాన్న అంటూ స్వప్న కూడా మొర పెట్టుకుంటుంది. కానీ శ్రీధర్ మౌనంగా ఉంటాడు. దాంతో స్వప్న ఫైర్ అవుతుంది. ఆయనకు ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్నాడు కదా అమ్మ ఎందుకు సాయం చేస్తాడని అంటుంది. నేను కాశీని పెళ్లి చేసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదని అంటుంది. అందుకే మా ఆయన జైలుకు వెళ్లడం ఆయనకు ఇష్టమే లేదని, అందుకే ఇప్పుడు కాశీకి ఇలా జరిగిందని లోలోపల సంబరపడుతున్నాడని స్వప్న ఏడుస్తూ అంటుంది. ఆయన కాశీని అస్సలు బయటికి తీసుకు రాడని అంటుంది.
ఇక వెంటనే శ్రీధర్ స్పందిస్తూ మీరు ఇలా మాట్లాడాల్సిన పనిలేదు. నేను చూసుకుంటానని చెప్పి బయటికి వెళ్లిపోతాడు. మరోవైపు జ్యోత్స్నపై సుమిత్ర మరోసారి ఫైర్ అవుతుంది. నువ్వు తప్పు చేస్తే వెంటనే ఒప్పుకోవాలని అంటుంది. అందుకు జ్యోత్స్న నేను ఏ తప్పు చేయలేదని చెబుతుంది. నీ వల్లే కంపెనీ నష్టాల్లో ఉందని అంటున్నారు, ఆ తప్పును సరిదిద్దుకోమని చెబుతుంది. లేదంటే నీపై ఉన్న నమ్మకం పోయి ఎప్పటికీ నిన్ను నమ్మే పరిస్థితి రాదని అంటుంది. అప్పుడే కార్తీక్ బాబు వచ్చి చాలా కరెక్ట్ గా చెప్పారు అని అంటాడు. ఇక జ్యోత్స్న చిన్నప్పటి నుంచి ఏ పని సరిగా చేయలేదని సుమిత్ర అంటుంది. చిన్నప్పుడు కమల పువ్వు కోసం గుడిలోని కోనేటి దగ్గరకు కార్తీక్ బాబును తీసుకెళ్లి ప్రమాదంలో పడేసింది. అప్పుడు ఎవరో ఒక పాప వచ్చి నా మేనల్లుడు కార్తీక్ ను కాపాడింది. అప్పుడు ఆ చిన్నారి కాపాడకపోతే ఇవ్వాళ నాపై పెద్ద నింద ఉండేదని అంటుంది. దాంతో కార్తీక్ బాబు వెంటనే నా ప్రాణదాత ఎవరో తెలిసిందని, కలిశానని చెబుతాడు. దాంతో సుమిత్ర సంబరపడుతుంది. ఎక్కడ ఉందని అడుగుతుంది. మా గల్లీలోనే ఉందని చెబుతాడు. ఇక అక్కడికి వెళ్తే మళ్లీ కాంచనతో మాట్లాడాల్సి వస్తుందని తర్వాత ఆమెను కలుద్దామని అంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











