Karthika Deepam 2 September 11th: జ్యోత్స్నకు టైమ్ బౌండరీ.. ఒక్కసారిగా తలకిందులైన జీవితం
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 10వ తేదీ 459వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శ్రీధర్ రెండో భార్య కావేరి కూతురు స్వప్న కంగారు కంగారుగా ఇంటికి వస్తుంది. తను కాశీ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని చెబుతుంది. దాంతో కాశీని పోలీసులు తీసుకెళ్లారని టెన్షన్ పడుతూ చెప్తుంది. గాయడపిన వ్యక్తి చనిపోతే కాశీని జైలుకు పంపిస్తారని భయపడుతుంది. అలాగైతే తన భర్త జీవితం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ విషయం తెలిసిన శ్రీధర్, కావేరి షాక్ అవుతారు. అలా ఎలా యాక్సిడెంట్ అయ్యిందని స్వప్నను అడుగుతారు. ఇక స్వప్న ఏదో టెన్షన్ లో జరిగిపోయిందని అంటుంది. దాంతో శ్రీధర్ ఎలాంటి స్పందన లేకుండా ఉంటాడు. తన భర్తను కాపాడమని శ్రీధర్ ను స్వప్న అడుగుతుంది. శ్రీధర్ సైలెంట్ గా ఉంటుంది. మరోవైపు కావేరి కూడా ఎలాగైనా తమ అల్లుడు కాశీని కాపాడాలని లేదంటే మన కూతురు జీవితం నాశనం అవుతుందని శ్రీధర్ తో అంటాడు. ఇక శ్రీధర్ తనవంతు ప్రయత్నం చేసేందుకు సిద్ధం అవుతాడు.
మరోవైపు జ్యోత్స్నకు కార్తీక్ బాబు షాక్ ఇస్తాడు. అంతకంటే ముందు సుమిత్ర జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలని, లేదంటే మన మీద ఉన్న నమ్మకం పోతుందని అంటుంది. ఒక్కసారి నమ్మకం పోతే మళ్లీ తిరిగి రావడం చాలా కష్టమని, మన మీద నమ్మకం లేకపోతే మనం చెప్పే మాటలకు కూడా ఏమాత్రం విలువ ఉండదని చెబుతుంది. ఇకపైననైనా నీ ప్రవర్తనను మార్చుకోవాలని అంటుంది. ఆ సమయంలో కార్తీక్ బాబు వచ్చి చాలా చక్కగా చెప్పావు అత్త అంటుంది. కార్తీక్ బాబును చూసిన వెంటనే మళ్లీ జ్యోత్స్నను తిడుతుంది. నువ్వు చిన్నప్పుడు కూడా కార్తీక్ బాబును కొనేరులో పడేలా చేసి చనిపోయే పరిస్థితి తీసుకు వచ్చావు అని జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది. ఆ సమయంలో ఒక చిన్నపాప వచ్చి కాపాడకపోతే ఇప్పటికీ నేను ఆ నిందను మోస్తూనే ఉండేదాన్ని అని అంటుంది. ఇక కార్తీక్ బాబు నా ప్రాణదాత గురించి నాకు తెలిసిపోయింది అత్త అని చెబుతాడు. దాంతో సుమిత్ర సంతోష పడుతుంది. ఎక్కడ ఉంది? వెంటనే కలుద్దామని అంటుంది. మా ఇంటి వీధిలోనే ఉంటుందని చెబుతాడు కార్తీక్ బాబు. కానీ అక్కడికి వెళ్తే మళ్లీ కాంచనను కలవాల్సి వస్తుందని సుమిత్ర రానని చెబుతుంది. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 11వ తేదీ 460 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబు ఇచ్చిన ట్విస్ట్ కు జ్యోత్స్న షాక్ అవుతుంది. తన ప్రాణదాత ఆచూకీ దొరికిందని చెప్పడంతో ఆశ్చర్యపోతుంది. ఇలా రోజురోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా కొత్త కొత్త విషయాలను అమ్మ సుమిత్రకు చెబుతూ మరింత దగ్గరవుతున్నాడు. సుమిత్ర కూడా కార్తీక్ బాబు చెబుతున్న మాటలను నమ్ముతోందని అనుకుంటూ ఉంటుంది. ఇదే క్రమంలో ఏదోకరోజు వచ్చి దీపానే నీ కూతురు అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుకుంటుంది. ఆ వెంటనే జ్యోత్స్న దగ్గరికి పారుజాతం వస్తుంది. అసలు కార్తీక్ బాబును కాపాడిన ఆ ప్రాణదాత ఎవరై ఉంటారని అడుగుతుంది. ఎవరైతే మనకేంటీ అని జ్యోత్స్న లైట్ తీసుకుంటుంది. పారు మాత్రం గుచ్చిగుచ్చి అడుగుతుంది. ఏదోలా చేసి సుమిత్రను దశరథకు ఇంకా దూరం చేయాలని అనుకుంటుంది. ఇదే సమయంలో దశరథ సుమిత్రపై మండి పడుతాడు. నువ్వు ఇంకెప్పుడు రియలైజ్ అవుతావో అర్థం కావడం లేదు అని మనస్సులో అనుకుంటాడు. ఇక సుమిత్రను కూడా దూరం చేసుకోవడం ఇష్టం లేక క్షమాపణలు చెబుతాడు. అందుకు సుమిత్ర మీరు సారీ చెప్పాల్సిన అవసరం ఏముందని అంటుంది.
వాళ్ల దగ్గరకు శివ నారాయణ వస్తాడు. దాంతో సుమిత్ర లోపలికి వెళ్లిపోతుంది. ఇక దశరథ మాట్లాడుతూ నా చెల్లి కాంచన ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఇప్పటి వరకు జీవితంలో ఎలాంటి తప్పు చేయమని సుమిత్ర మొదటిసారిగా పెద్ద తప్పు చేసింది. ఆ తప్పును సరిదిద్దుకోమని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక నా చెల్లి కాంచన ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. సుమిత్ర చేసిన తప్పు వల్ల కాంచన దగ్గర నేను తల దించుకోవాల్సి వస్తోంది. తల ఎత్తుకొని మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సుమిత్ర తన ప్రవర్తను మార్చుకోవాలని చెబుతున్నా ఏమాత్రం ఖతారు చేయడం లేదని తండ్రి శివ నారాయణతో చెబుతాడు. ఏదేమైనా మీరు ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండటం సరికాదేమో ఒకసారి ఆలోచించు దశరథ అని చెబుతాడు. మరోవైపు కార్తీక్ బాబు, దీపాలు ఇంటికి తిరిగి వెళ్తారు. అయితే ఈరోజు శౌర్య పాప పుట్టిన రోజు ఉండటం విశేషం. ఇక తన పుట్టిన రోజు ఎవ్వరికీ గుర్తుకు లేదని శౌర్య పాప ఫుల్ కోపంగా ఉంటుంది. కార్తీక్ బాబు దీపాలపై మండి పడుతుంది. ఇక వెంటనే ఒక్కక్కోరు శౌర్యకు సర్ ప్రైజ్ ఇస్తారు. నీకోసం స్వీట్స్ చేశానని కాంచన, బిర్యానీ వండానని అనసూయ, నీకు డ్రెస్ కొన్నామని కార్తీక్ బాబు దీపాలు చెప్పడంతో సంతోషిస్తుంది.
మరోవైపు జ్యోత్స్నకు మంచి అవకాశం దొరుకుతుంది. కార్తీక్ బాబును, దీపాను, వీళ్లిద్దరి సహకరించే వారిని ఒక ఆటాడుకోవాలని ఎప్పటి నుంచో జ్యోత్స్న ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో తాజాగా జ్యోత్స్నకు సదావకాశం వచ్చింది. పారుజాతం కొడుకు దాసు జ్యోత్స్నకు ఫోన్ చేస్తాడు. నాకు ఒక సాయం చేయాలి జ్యోత్స్న, నువ్వు ఇప్పుడు ఆపదలో నుంచి కాపాడాలని మోర పెట్టుకుంటాడు. దాంతో జ్యోత్స్న అసలు ఏం జరిగిందని అంటుంది. వెంటనే దాసు కాశీ యాక్సిడెంట్ చేశాడని, పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని చెబుతాడు. కాస్తా పలుకుబడి ఉన్నవారైతేనే కాపాడే అవకాశం ఉందని అంటాడు. ఇక నువ్వే నీ తమ్ముడు కాశీని కాపాడాలని అంటాడు. దాంతో జ్యోత్స్న తప్పకుండా కాపాడుతానని అని ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ వేస్తుంది. గౌతమ్ విషయంలో నాకు సాయం చేస్తానని మోసం చేసిన కాశీపై పగ సాధిస్తానని, దాంతో కార్తీక్ బాబును ఇబ్బంది పెడుతానని అనుకుంటుంది. ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చంపేస్తే కాశీ జీవితాంతం జైలులోనే ఉంటాడని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











