Karthika Deepam 2 September 12th: జ్యోత్స్న చేతిలో కార్తీక్ బాబు ప్రాణం.. వంటలక్కకు మరో ప్రమాదం

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 11వ తేదీ 460వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తండ్రి శివ నారాయణతో కొడుకు దశరథ మాట్లాడుతూ నా చెల్లి కాంచన ఎంత బాధపడుతుందో అని అంటాడు. సుమిత్ర తన జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదని అంటాడు. కానీ మొదటిసారిగా సుమిత్ర పెద్ద తప్పు చేసి, పైగా తప్పును ఒప్పుకోవడం లేదని తండ్రితో అంటాడు. ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోమని పదేపదే చెబుతున్న సుమిత్ర అస్సలు పట్టించుకోవడం లేదని మండి పడుతాడు. ఇక ధశరథ సుమిత్ర మాట్లాడుకోవడం మానేయడంతో శివ నారాయణ కంగారు పడుతాడు. అసలు మీరు ఇద్దరు ఎంతకాలం మాట్లాడుకోకుండా ఉంటారని అంటాడు. ఇకపై నువ్వు సుమిత్రను అస్సలు దూరం పెట్టవద్దని అంటాడు. నేనూ అదే ప్రయత్నంలో ఉన్నానని దశరథ సమాధానం ఇస్తాడు. కానీ మరోవైపు నా చెల్లి కాంచన కూడా ఎంతగానో బాధ పడుతూ ఉంటుంది. సుమిత్ర చేసిన తప్పు వల్ల కాంచన దగ్గర నేను తల దించుకోవాల్సి వస్తుంది.

ఇప్పటికైనా సుమిత్ర మారి కాంచనకు క్షమాపణలు చెబితే అప్పడు మాట్లాడుతాను. లేదంటే అస్సలు మాట్లాడను అని దశరథ తెగేసి చెబుతాడు. ఉంటే జ్యోత్స్న ఎప్పటి నుంచో దీపా, కార్తీక్ బాబుపై పగ సాధించాలని ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా జ్యోత్స్నకు మంచి అవకాశం అందింది. అయితే వీళ్లిద్దరికి సహకరిస్తున్న కాశీ సమస్యల్లో చిక్కుకున్నాడని జ్యోత్స్నకు తెలుస్తుంది. పారుజాతం కొడుకు దాసు జ్యోత్స్నకు ఫోన్ చేసి కాశీ ప్రమాదంలో ఉన్నాడని చెబుతాడు. కాశీ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యిందని, దాంతో పోలీస్ కేసు నమోదు అయ్యిందని వివరిస్తాడు. ఎవరైనా పలుకుబడి ఉన్న వారు చెబితేనే కాశీ బయటకి వస్తాడని, లేదంటే జైలుకు వెళ్తాడని జ్యోత్స్నకు మొర పెట్టుకుంటాడు. నీ తమ్ముడిని నువ్వే కాపాడాలని జ్యోత్స్నను కోరుతుతాడు. ఇక జ్యోత్స్న నా తమ్ముడిని నేను కాపాడుతాను నాన్న అని చెబుతుంది. కానీ ఫోన్ కట్ చేసిన తర్వాత కాశీని శాశ్వతంగా జైలులోనే ఉండేలా చేస్తానని అనుకుంటుంది. గౌతమ్ విషయంలో కాశీ నాకు సాయం చేస్తానని చెప్పి మోసం చేశాడని గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు రివేంజ్ తీర్చుకునే సమయం వచ్చిందని కాశీపై పగ సాధిస్తానని అనుకుంటుంది. యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని చంపేస్తానని ప్లాన్ వేస్తుంది. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 12వ తేదీ 461 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 461 September 12th 2025

కాశీ జైలులో ఉండంతో దిల్ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉన్న దిల్ ను కావేరి ఓదార్చుతూ ఉంటుంది. మనం ఇంట్లో ఇంతలా ఏడుస్తూ ఉన్న కూడా నాన్న శ్రీధర్ పట్టించుకోకుండా బయటకి వెళ్లిపోయాడు. పైగా మన ఫోన్లు లాక్కుని, ఇద్దరిని ఇంట్లో బంధించి వెళ్లిపోయాడు. అసలు ఆయనకు మనస్సాక్షి లేదమ్మ అని దిల్ తల్లి కావేరితో చెబుతూ మండిపడుతుంది. ఇప్పటికీ కాశీ జైలులోనే ఉన్నాడని, తను వెళ్లి కాపాడుతానని ఎదురు చూస్తూ ఉంటాడని అంటుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదని ఏడుస్తూ ఉంటుంది. ఇదే సమయంలో శ్రీధర్ ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చి రాగానే కావేరి, దిల్ శ్రీధర్ పై మండి పడుతారు. మేమంతా ఒక సమస్యలో ఉంటే నీకు ఆటగా ఉందా? అని ప్రశ్నిస్తారు. అసలు కాశీకి ఏమైందో అని మేం కంగారు పడుతూ ఉంటే నువ్వు మాత్రం హాయిగా తిరుగుతున్నావా? అని ఫైర్ అవుతారు. ఇక ఇదే సమయంలో కాశీని తీసుకొని దాసు ఇంట్లోకి వస్తాడు. కాశీ తిరిగి ఇంటికి రావడంతో దిల్, కావేరి కాస్తా కంగారును తగ్గించుకుంటారు. అసలు నిన్ను విడిపించింది దాసు మామయ్యనే కదా అని దిల్ అంటుంది. ఆపదలో ఉన్నప్పుడు ఎలా ఆదుకోవాలో దాసు మామయ్యకు బాగా తెలుసు అని దిల్ అంటుంది.

దాసు మామను చూసి ఇక్కడ కొంత మంది నేర్చుకోవాల్సింది ఉందని అంటుంది. ఇక కానీ దాసు స్పందిస్తూ అసలు కాశీని విడిపించింది శ్రీధర్ బావనే అని దాసు చెబుతాడు. అయినా దిల్ అస్సలు నమ్మదు. ఇక కాశీ కూడా తనను విడిపించింది శ్రీధర్ మామనే అని చెబుతాడు. తన కూతురు జీవితం బాగుండాలని శ్రీధర్ మామనే తీసుకొచ్చాడని అంటుంది. దాంతో శ్రీధర్ స్పందిస్తూ ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయట పడే వరకు ఇంట్లో ఉండమని చెబుతాడు. బయట మీ కోసం పోలీసులు కూడా తిరుగుతూ ఉన్నారని అంటాడు. దాంతో అందరూ సంతోషిస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు కార్తీక్ బాబు, దీపాలు శివ నారాయణ ఇంటికి శౌర్య పాపను వెంట తీసుకొని వెళ్తారు. ఈ సందర్భంగా శౌర్య పాప అందరినీ పలకరిస్తుంది. దశరథ శౌర్య పాపకు ఖరీదైన చాక్లెట్స్ ఇస్తాడు. ఇక బిర్యానీ కూడా బుక్ చేసి తినిపిస్తానని అంటాడు. ఆ తర్వాత అమ్మమ్మ సుమిత్ర దగ్గరకు వెళ్తుంది శౌర్య. ఆ వెంటనే దీపా కూడా సమిత్ర గద దగ్గరికి వెళ్తుంది. సుమిత్ర శౌర్య పాపతో ప్రేమగా మాట్లాడటం విని సంతోష పడుతుంది.

ఇక దీపా సుమిత్రమ్మ గది దగ్గర ఆగి వారి మాటలు వింటుండగా జ్యోత్స్న వచ్చి దీపాను బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది. అలా తలుపు చాటుగా ఉండి వినాల్సి పనేంటని ప్రశ్నిస్తుంది. శౌర్యను తీసుకొచ్చి నీకు దగ్గర కావాలని ప్రయత్నిస్తుందని సుమిత్రతో అంటుంది. సుమిత్ర శౌర్యను బయటికి పంపించి, అలాగే దీపాను కూడా వెళ్లిపోమ్మని చెబుతుంది. ఆ తర్వాత జ్యోత్స్నకు గట్టిగా క్లాస్ పీకుతుంది. దీపా విషయంలో నువ్వు ఏది చెబినా వింటానని అస్సలు అనుకోకు. దీపాకు నాకు మధ్య ఏదైనా గొడవ ఉంటే నేను చూసుకుంటాను. నువ్వు ఎందుకు మధ్యలో జోక్యం చేసుకుంటున్నావు. ఇంకోసారి నువ్వు మాట్లాడితే దెబ్బలు పడుతాయని హెచ్చరిస్తుంది. నీకున్న సమయం కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి పెట్టమని హెచ్చరిస్తుంది. ఇక జ్యోత్స్న బయటికి వచ్చిన తర్వాత దీపా జ్యోత్స్నకు మరో షాక్ ఇస్తుంది. కార్తీక్ బాబును కట్టమని జ్యోత్స్న గతంలో తెచ్చిన తాళిబొట్టును తిరిగి ఇస్తుంది. ఇదే నీదే జ్యోత్స్న ఇన్నాళ్లు దీనికోసమే కదా పోరాడావు, తీసుకోమని ఇస్తుంది. దాంతో జ్యోత్స్న రగిలిపోతుంది. మీ అందరి సంగతి చెబుతానని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X