Karthika Deepam 2 September 13th: కార్తీక్ బాబుకు జ్యోత్స్న ఛాలెంజ్.. స్వప్నకు షాకిచ్చిన శ్రీధర్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 12వ తేదీ 461వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కాశీ ఆస్పత్రిలో ఉన్నాడని, ఆయన్ని వెంటనే విడిపించాలని, లేదంటే పోలీసులు ఆయన్ని జైలులో పెట్టే ప్రమాదం ఉందని దిల్ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదే విషయాన్ని దిల్ తన తండ్రి శ్రీధర్ తో కూడా చెబుుతుంది. మరోవైపు కావేరి కూడా తమ అల్లుడిని ఈ ప్రమాదం నుంచి కాపాడాలని లేదంటే మన కూతురు జీవితం నాశనం అవుతుందని కావేరి కూడా కంగారు పడుతుంది. అయితే ఓవైపు తల్లీకూతుర్లు ఇద్దరు ఏడుస్తూ ఉన్నా శ్రీధర్ మాత్రం అస్సలు స్పందించడు. దాంతో దిల్, కావేరి శ్రీధర్ ను ఇంకా తిడుతారు. అసలు నువ్వు మనిషివేనా? ఇలాంటి సమయంలో కొంచెం కూడా చలనం లేదు? నీకంటే పశువులు మేలు అంటూ నోటికి వచ్చిన భూతులన్నీ తిడుతూ ఉంటుంది. ఇక శ్రీధర్ కు కోపం వచ్చి వీళ్ల ఇద్దరి మొబైల్ ఫోన్స్ లాక్కుని తానే ఇంటి నుంచి ఒక్కడే బయటకి వెళ్తాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు.
శ్రీధర్ వెంటనే కాశీ, దాసు కూడా వస్తారు. ఇక కాశీని దాసు తీసుకు వచ్చాడేమో అనుకుని కావేరి, దిల్ పొడుగుతూ ఉంటారు. ఇక దాసు నేను కాశీని విడిపించలేదని, శ్రీధర్ బావనే తన అల్లుడిని ప్రమాదం నుంచి కాపాడాడు అని చెబుతాడు. అయినా కావేరి, దిల్ అస్సలు నమ్మరు. దాంతో వెంటనే కాశీ కూడా ప్పందిస్తూ నాన్న దాసు చెప్పింది నిజమే. నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది శ్రీధర్ మామనే అని అంటాడు. దాంతో ఒక్కసారిగా శ్రీధర్ పై ఉన్న అభిప్రాయం మారిపోతుంది. ఇక శ్రీధర్ కూడా దాసును, కాశీని కొన్నాళ్ల పాటు తన ఇంట్లోనే ఉండమని చెబుతాడు. సమస్య పరిష్కారం అయ్యాక వెళ్తురు అని జాగ్రత్త చెబుతాడు. మరోవైపు జ్యోత్స్నకు దీపా ఊహించని షాక్ ఇస్తుంది. తన మెడలోని తాళిని తెంచేసిన జ్యోత్స్నకు ఆ తాళిని తిరిగి ఇస్తుంది. మరోవైపు సుమిత్ర కూడా జ్యోత్స్న ప్రవర్తనపై మండి పడుతుంది. దీపా విషయంలో నువ్వు అస్సలు జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తుంది. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 13వ తేదీ 463 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపా తన తాళిని జ్యోత్స్నకు తిరిగి ఇవ్వడంతో షాక్ అవుతుంది. పైగా సుమిత్ర కూడా దీపాకే సపోర్ట్ గా ఉండటం , దీపా విషయంలో నువ్వు ఎలాంటి సలహాలు, సూచనలు నాకు ఇవ్వొద్దని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇక తన తల్లి సుమిత్ర దీపాకు సపోర్ట్ గా మాట్లాడుతుండటాన్ని దీపా తలుపు చాటున వింటుంది. జ్యోత్స్న బయటికి వచ్చిన తర్వాత తాళిని చేతిలో పెట్టి నీతో తేల్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని, మున్ముందు అన్నీ లెక్కలు తేలిపోతాయని హెచ్చరించి వెళ్లిపోతుంది. ఆ వెంటనే కార్తీక్ బాబు జ్యోత్స్నకు ఎదురవుతాడు. జ్యోత్స్న చేతిలో ఉన్న తాళిని చూసి నవ్వుతాడు. ఇక జ్యోత్స్న మండిపోయి నువ్వు ఇచ్చిన సలహాలతోనే దీపా ఇలా ఆడుతుందని మండిపడుతుంది. దీపా ఇవ్వాలనుకున్నదే కాకుండా ఇంకేదో ఇచ్చినట్టు ఉంది కదా అని నవ్వుతాడు. దాంతో జ్యోత్స్న కడుపు మండిపోతుంది. కార్తీక్ బాబు దీపాల ముందు తను తగ్గిపోతున్నానని అనుకుంటుంది. నన్ను ఇంతలా అవమానిస్తున్న మీ ఇద్దరి సంగతి చూస్తానను బావ అని కార్తీక్ బాబును హెచ్చరిస్తుంది. నువ్వు మా అంతు చూడటం కాదు పెద్ద మేడమ్ గారు త్వరలో మీరు ఊహించని ఘటనలు జరుగుతాయని చెబుతాడు.
దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు చాలా విషయాలను దాస్తున్నావ్ బావ అని అంటుంది. తాళిబొట్టు విషయంలో కూడా నీ ప్రవర్తన వెనకాల ఏదో మర్మం దాగి ఉందని అనిపించింది. అసలు నీ ప్రాణదాత ఎవరో కూడా ఎవ్వరికీ చెప్పడం లేదు ఎందుకు అని ప్రశ్నిస్తుంది. నువ్వు నా ప్రాణదాత గురించి తెలుసుకొని ఏం చేస్తావ్ అని కార్తీక్ బాబు ప్రశ్నిస్తాడు. అయితే రేపో మాపో అన్ని విషయాలు బయట పడిపోతాయి కదా అని అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అసలు నువ్వు దేనీ గురించి మాట్లాడుతున్నావ్ బావ అని అడుగుతుంది. ఇంక దేని గురించి మాట్లాడుతాను పెద్దమేడమ్ నా ప్రాణదాత గురించి. ఆ విషయం రేపో మాపో తెలియాల్సిందే కదా అంటాడు. అసలు నీ ప్రవర్తన పూర్తిగా అర్థం కావడం లేదు అని జ్యోత్స్న అంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు రెస్టారెంట్ ను ఎలా లాభాల్లోకి తీసుకురావాలో దాని గురించి ఆలోచించు మరదల అని కార్తీక్ బాబు అంటాడు. అసలు నన్ను ఎక్కడ పని చేసుకోనిస్తున్నావ్ నువ్వు అని మండి పడుతుంది. తాత శివ నారాయణకు, నాన్న దశరథకు, అమ్మ సుమిత్రకు నన్ను నెమ్మదిగా దూరం చేస్తున్నావు అని అంటుంది. ఇదంతా కేవలం రెస్టారెంట్ కు మళ్లీ నువ్వు సీఈవో కావాలని ప్రయత్నిస్తున్నావని కార్తీక్ బాబుపై సందేహం వ్యక్తం చేస్తుంది.
కార్తీక్ బాబు బిగ్గరగా నవ్వుతూ ఈ ఏడాది నేను పెద్ద జోక్ ఇదే అంటూ జ్యోత్స్నతో అంటాడు. నాకు సీఈవో కావాలనే ఉంటే ఎప్పుడో అయిపోయే వాడిని అలాంటి ఆశలేవీ నాకు లేవని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు పారుజాతం శివ నారాయణ దగ్గర పరువు పోగొట్టుకుంటుంది. శౌర్య పాప చాక్లెట్ బాక్స్ ను పారుజాతం దొంగలిస్తుంది. అది గమనించిన శివ నారాయణ శౌర్య పాపకు తన చాక్లెట్ బాక్స్ ను తనకు తిరిగి ఇప్పించేస్తాడు. పారుజాతాన్ని గట్టిగా మందలిస్తాడు. ఇలాంటి పనులు చేస్తే ఒళ్లు పగిలిపోతుందని హెచ్చరిస్తాడు. ఇంకోవైపు శ్రీధర్ ఒకేసారి మారడం చూసి కావేరి, దిల్ షాక్ అవుతారు. కాశీ ఇంటర్వ్యూకు వెళ్తుంటే డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తాడు. దాంతో దిల్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాన్న మారడని తెలియక పశువు అని నోటికొచ్చినట్టు తిట్టానని రియలైజ్ అవుతుంది. ఏదైనా తన తండ్రి మారాడు అది చాలు అని సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక నాన్న శ్రీధర్ మారడానికి కారణం కచ్చితంగా కార్తీక్ అన్నయ్యనే అయ్యి ఉంటాడని అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











