Karthika Deepam 2 September 15th: గుట్టురట్టు చేసిన శివ నారాయణ.. టెన్షన్‌లో కార్తీక్ బాబు, దీప
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 13వ తేదీ 462వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న కు సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. దీప విషయంలో పదే పదే జ్యోక్యం చేసుకోకుండా రెస్టారెంట్ ను ఎలా లాభాల్లోకి తీసుకు రావాలో ఆ సంగతి చూడమని అంటుంది. సుమిత్ర మాటలకు జ్యోత్స్న హర్ట్ అవుతుంది. మున్ముందు మీ సంగతి చూస్తానని మనస్సులో అనుకుంటుంది. మరోవైపు శ్రీధర్ మారిపోవడంతో కూతురు స్వప్న, కావేరి సంతోషిస్తారు. తండ్రి శ్రీధర్ ను మారేలా చేసింది అన్నయ్య కార్తీక్ బాబే అని అనుకుంటుంద స్వప్న. ఇంకోవైపు శౌర్య పుట్టిన రోజు కావడం స్కూల్ కు సెలవు పెడుతుంది. ఇక కార్తీక్ బాబు, దీపాల వెంటనే శివనారాయణ ఇంటికి వస్తానని పట్టుబడుతుంది. సాయంత్రం తిరిగి వచ్చాక పుట్టిన రోజు వేడుకలు జరుపుకుందామని అంటుంది. దాంతో శౌర్యను తీసుకొని శివనారాయణ ఇంటికి వెళ్తారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 13వ తేదీ 463 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?
శౌర్య పాపను వెంట పెట్టుకుని కార్తీక్ బాబు, దీప శివ నారాయణ ఇంటికి డ్యూటీకి వస్తారు. అయితే ఎప్పుడు లేనిది శివ నారాయణ ఇంటికి శౌర్య పాపను కూడా స్కూల్ ఉన్న రోజు మాన్పించి ఎందుకు తీసుకు వచ్చారని శివ నారాయణకు అనుమానం కలుగుతుంది. ఏదేమైనా శౌర్య పాపతో శివ నారాయణ ప్రేమగా ఉంటాడు. అయితే శౌర్య పాప పుట్టిన రోజు సందర్భంగా స్కూల్‌కు సెలవు పెట్టి తమ వెంట తీసుకొని వస్తారు. ఇక శౌర్య పాప ఒక్కతే ఇంట్లో బోర్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. గమనించిన శివ నారాయణ శౌర్య పాప కోసం డ్రాయింగ్ బుక్ ను తీసుకొని వస్తాడు. ఇక పారుజాతానికి ఫోన్ చేసి వెంటనే తన దగ్గరకు రమ్మని చెబుతాడు. పారుజాతం శివ నారాయణ దగ్గరకు వస్తుంది. ఏమైందండి ఫోన్ చేసి మరీ పిలిచారు. పిలిస్తే వచ్చే దాన్ని కదా అని అంటుంది. నీకోసం కేకలు వేయలేను కదా అని శివ నారాయణ మండి పడుతాడు. సరేగానీ ఇంతకీ ఎందుకు పిలిచారో అంది చెప్పండి అని పారుజాతం అడుగుతుంది. ఏం లేదు పారుజాతం శౌర్య పాప కోసం ఈ డ్రాయింగ్ బుక్ ను కొన్నాను. తీసుకెళ్లి శౌర్యకు ఇస్తావని పిలిచానని చెబుతాడు. అదేదో మీరే శౌర్యను పిలిచి ఇవ్వచ్చు కదా అని అంటుంది. ఇవ్వచు, కానీ తప్పు చేసిన వారితోనే సరిదిద్దిస్తే ఇంకా బాగుంటుంది కదా అని బదులిస్తాడు. నువ్వు శౌర్య పాప చాక్లెట్ బాక్స్ దొంగలించావు కదా అందుకు నువ్వే ఇస్తే బాగుంటుందని అంటాడు.

దాంతో పారుజాతం ఆ డ్రాయింగ్ బుక్ ను తీసుకెళ్లి శౌర్య పాపకు ఇస్తుంది. దీంతో శౌర్య పాప పారుజాతానికి థ్యాంక్స్ చెబుతుంది. మరోవైపు దీపా టెన్షన్ పడుతూ ఉంటుంది. త్వరత్వరగా వంటలు పూర్తి చేస్తూ ఉంటుంది. ఈరోజు శౌర్య పాప పుట్టిన రోజు అనే సంగతి ఇంట్లో వాళ్లకు ఎలా తెలుస్తుందోనని భయపడుతుంది. మరోవైపు శౌర్యపాప తనకు ఇచ్చిన డ్రాయింగ్ బుక్ లో బర్త్ డే కేక్ ను గీస్తుంది. ఇక అటువైపు వెళ్తున్న శివ నారాయణ ఏం బొమ్మలు గీసావో నాకు చూపించు అని అడుగుతాడు. అందుకు శౌర్యపాప చూపించడానికి ఇష్టపడదు. బర్త్ డే కేక్ చూస్తే ఈరోజు నా బర్త్ డే అనే విషయం ముద్దుల తాతకు తెలిసిపోతుందని, అప్పటికే నా పుట్టిన రోజు అనే విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు అమ్మ దీపా, నాన్న కార్తీక్ చెప్పారని శౌర్య పాప గుర్తు చేసుకుంటుంది. ఇక ఏమాత్రం కూడా తన డ్రాయింగ్ లు చూపించేందుకు ఇష్టపడదు. ఏం లేదు తాత అని చెబుతుంది. దాంతో శివ నారాయణ సైలెంట్ గా వెళ్లిపోతాడు. ఈ విషయాన్ని కార్తీక్ బాబు గమనిస్తాడు. ఎక్కడ శౌర్య పాప ఈరోజు తన పుట్టిన రోజు అనే విషయాన్ని బయటికి చెబుతుందోనని కంగారు పడుతాడు.
శౌర్య పాప పుట్టిన రోజు అనే సంగతి చెప్పకపోయినందుకు శివ నారాయణ, దశరథ మామ ఇద్దరూ కోపగిస్తారు. మాకు చెప్పకుండా దాచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తారని కార్తీక్ బాబు టెన్షన్ పడుతాడు. ఇక దీప దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతాడు. శివ నారాయణకు కొద్దిలో శౌర్యపాప బర్త్ డే అనే సంగతి తెలిసిపోయేదని అంటాడు. డ్రాయింగ్ బుక్ లో బర్త్ డే కేక్ ను గీసిందని చెబుతాడు. కానీ శౌర్యకు మనం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి బొమ్మలను చూపించలేదని అంటాడు. ఒకవేళ శివనారాయణ చూస్తే ఏమై ఉండేదో అని దీపా కంగారు పడుతుంది. ఏమౌతుంది వాళ్లకు కూడా ఈరోజు శౌర్య పుట్టిన రోజు అనే సంగతి తెలిస్తేనే మంచిది కదా అని అంటాడు. కానీ దీపా అస్సలు తెలియకూడదని అంటుంది. ఒక వేళ శౌర్య పుట్టిన రోజు అని ఇంట్లో తెలిస్తే ఇక జ్యోత్స్న నా మీద పడి ఏడుస్తుంది. మా అమ్మ సుమిత్రకు దగ్గర కావడానికే ఈరోజు శౌర్య పాపను ఇంటికి తీసుకొని వచ్చానని, సింపథి కోసం పాపను వెంట పెట్టుకొని వచ్చానంటూ నానా మాటలు మాట్లాడుతుందని అంటుంది. తనకు తాళి తిరిగి ఇచ్చిన కోపంతో పెద్ద గొడవనే చేస్తుందని అంటుంది.
అలా జరగకూడదంటే మనం త్వరగా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. నేను ఇప్పటికే కూరలు పూర్తిగా వండేశాను. మరికాసేపట్లో పూర్తఅవుతాయి. ఇక శివ నారాయణ గారికి చెప్పి శౌర్యపాపను తీసుకుని వెళ్లిపోదామని, అప్పుడు ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండదని దీప అంటుంది. మరోవైపు శివ నారాయణ మళ్లీ శౌర్య పాప గీసిన బొమ్మలను చూడాలనుకుంటాడు. ఇక శౌర్య చూపించకపోయినా బలవంతంగా తను గీసిన డ్రాయింగ్ ను చూస్తాడు. కుటుంబం మొత్తం కలిసి ఒక చిన్నారి పుట్టిన రోజును జరుపుతున్నట్టుగా ఉంటుంది. దాంతో శివ నారాయణ ఎమోషనల్ అవుతాడు. మళ్లీ పారుజాతాన్ని పిలిచి అసలు శౌర్య ఎందుకు స్కూల్ కు వెళ్లలేదో కాంచనకు ఫోన్ చేసి కనుక్కో అని చెబుతాడు. దాంతో పారు కాంచనకు ఫోన్ చేస్తుంది. కాంచన ఫోన్ లిఫ్ట్ చేయడంతో పారు అసలు విషయం తెలుసుకోవడానికి శౌర్య స్కూల్ మాన్పించేశారా? అని అంటుంది. దాంతో కాంచన కోపంలో స్కూల్ మాన్పించే స్థాయికి ఇంకా దిగజారలేదని చెబుతుంది. ఈరోజు శౌర్య పుట్టిన రోజు అని చెబుతుంది. ఆ విషయం తెలిసిన శివ నారాయణ కార్తీక్ దీప ఎందుకు దాచారని సందేహిస్తాడు. ఆ తర్వాత కార్తీక్, దీపా సాయంత్రం మాకు పని ఉందని శివ నారాయణ చెప్పి వెళ్ళిపోతామంటారు. కానీ శివ నారాయణ ఏంటా పని అని అడుగుతాడు. వేరే పని ఉందని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











