Karthika Deepam 2 September 17th: కార్తీక్ బాబుకు షాక్ ఇచ్చిన శివ నారాయణ.. వంటలక్కకు గుడ్ న్యూస్

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 16వ తేదీ 464వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శౌర్య పాప పుట్టిన రోజు సందర్భంగా కార్తీక్ బాబు, దీపా తర్వగా ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. ఇక శౌర్య పాప పుట్టిన రోజు అనే విషయాన్ని కూడా ఇంట్లో వాళ్లకు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడాలని అంటుంది. అందుకు కార్తీక్ బాబు అవునని అంటాడు. అయినా తెలిసినా పెద్ద సమ్యమేమీ ఉండదు లేని కార్తీక్ బాబు అంటాడు. లేదు అస్సలు తెలియక కూడదని కార్తీక్ బాబుతో దీపా అంటుంది. ఒకవేళ తెలిస్తే ఇక అదే అదునుగా జ్యోత్స్న వీరంగం ఆడుతుందని అంటుంది. ఆ అవకాశం జ్యోత్స్నకు మనం అస్సలు ఇవ్వకూడదని అంటుంది. కానీ శివ నారాయణ మాత్రం శౌర్య పాప ద్వానే తన పుట్టిన రోజు అనే విషయాన్ని తెలుసుకుంటాడు.

అంతే కాకుండా పారుతో ఏకంగా కాంచనకు ఫోన్ చేయించి మరీ స్పష్టం చేసుకుంటాడు. కాంచన కూడా ఈరోజు శౌర్య పాప పుట్టిన రోజు కావడంతో అక్కడికి వచ్చిందని చెబుతుంది. దాంతో శివ నారాయణకు కార్తీక్ బాబు, దీపలపై కోపం పెరుగుతుంది. ఈ విషయాన్ని తన దగ్గర ఎందుకు దాచారని మండి పడుతాడు. ఇక నేరుగా ఇదే విషయాన్ని శివ నారాయణ అడుగుతాడు. అసలు ఎందుకు శౌర్య పాప పుట్టిన రోజు అని చెప్పలేదని ప్రశ్నిస్తాడు. దాంతో కార్తీక్ బాబు మౌనంగా ఉంటాడు. ఇక దశరథ కూడా అసలు ఎందుకు చెప్పలేదురా అని ప్రశ్నిస్తాడు. దాంతో దీపా స్పందిస్తూ మళ్లీ ఎవరైనా ఏమైనా అంటారేమోనని, శౌర్యను అడ్డుపెట్టుకొని ఈ కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నామంటూ అవమానిస్తారని చెప్పలేదని దీపా అంటుంది. ఇక ఆ తర్వాత కార్తీక్ బాబు దీపా శౌర్యను తీసుకొని ఇంటికి వెళ్తారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 17వ తేదీ 465 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 465 September 17th 2025

శౌర్య పాప పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ బాబు దీప తమ ఇంట్లో ఎంతో గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తారు. ఇక శౌర్య పాప పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ బాబు తండ్రి శ్రీధర్ కూడా ఇంటికి తిరిగి వస్తాడు. బాబుతో మాట్లాడుతాడు. ఇకపై నువ్వు నీ అసలైన తండ్రిని చూడ బోతున్నావని చెబుతాడు. పూర్తిగా నీకు నచ్చిన తండ్రి లాగానే ఉంటాను అని, ఇకపై ఎప్పుడూ నీ మనసు నొప్పించే పని చేయనని శ్రీధర్ కార్తీక్ బాబుతో అంటాడు. దాంతో కార్తీక్ బాబు సంతోషం వ్యక్తం చేస్తాడు. నా కోరిక నెరవేరింది మాస్టారు అని అంటాడు. ఒరేయ్ కార్తీక్ ఇకపై నువ్వు నన్ను మాస్టారు మాస్టారు అని పిలవకురా అని శ్రీధర్ కండిషన్ పెడతాడు. నాన్న అని పిలవమని అంటాడు. కార్తీక్ బాబు కూడా సరే నాన్న అంటాడు. నీకు నీ తండ్రి హీరో కావచ్చు కానీ నాకు మాత్రం నా కొడుకే హీరోలా అని కార్తీక్ బాబుతో శ్రీధర్ అంటాడు. మీరు మారడంతో నాకు కొండంత ధైర్యం వచ్చిందని కార్తీక్ బాబు అంటాడు. ఏ కుటుంబంలోనైనా తండ్రి ఉంటే కొడుకు తో సహా ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంటుందని చెబుతాడు.

ఇక చివర్లో తమ ఇంట్లో ఈరోజు శౌర్య పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని కార్తీక్ బాబు తండ్రి శ్రీధర్ తో చెబుతాడు. ఇక నువ్వు కూడా వెంటనే పిన్ని కావేరిని, చెల్లి స్వప్నని వెంటనే తీసుకొని రమ్మని అంటాడు. కానీ శ్రీధర్ మాత్రం మేము వస్తే మళ్ళీ అక్కడ అందరికీ ఇబ్బందిగా ఉంటుందేమోనని అంటాడు. అంత సీన్ లేదు నాన్న నీ కుటుంబం కూడా నా కుటుంబమే అని చెబుతాడు. ఇంక నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి అందరిని తీసుకొని ఇంటికి రమ్మని చెబుతాడు. దాంతో శ్రీధర్ కూడా నో చెప్పడం ఇష్టం లేక సరేనని ఇంటికి వెళ్తాడు. ఇక కావేరికి స్వప్నకు జరిగిన విషయం అంతా చెబుతాడు. కార్తీ బాబు తో మాట్లాడాలని చాలా సంతోషంగా ఉందని అంటాడు. ఈరోజు శౌర్య పాప పుట్టినరోజు ఉందని, అందర్నీ కలిసి రావాలని కార్తీక్ బాబు ఆహ్వానించడానికి చెబుతాడు. దాంతో కావేరీ స్వప్న కాశి అందరూ రెడీ అవుతారు. కార్తీక్ బాబు ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు.

ఇక మరోవైపు కార్తీక్ బాబు ఇంటికి వెళ్ళగానే జోష్ణ నుంచి ఫోన్ వస్తుంది. నువ్వు వెంటనే మా ఇంటికి రావాలి బావా అని అంటుంది. ఇది నా మాట కాదు శివ నారాయణ గారి మాట. నువ్వు ఐదు నిమిషాలలో ఇక్కడ తప్పకుండా ఉండాలని, చాలా అర్జెంట్ అని చెబుతుంది. కానీ నేను ఇవాళ రాలేనని, నా కూతురు పుట్టిన రోజు అని చెప్పాను కూడా అని అంటాడు. ఏదేమైనా ఐదు నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలని అంటుంది. ఇక చేసేది ఏమీ లేక కార్తీక్ బాబు కూడా వెంటనే బయలుదేరి వెళ్తాడు. శివ నారాయణ ఇంటికి వెళ్లిన తర్వాత కార్తీక్ బాబుకు ఆ కుటుంబం మొత్తం సర్ప్రైజ్ ఇస్తుంది. మనం వేరే చోటుకు వెళ్లాలని కార్ తీయమని చెబుతాడు శివ నారాయణ. కానీ నేను రాలేనని కార్తీక్ బాబు అంటాడు. కానీ శివ నారాయణ మాత్రం పట్టు పట్టి నువ్వు కచ్చితంగా రావాల్సిందేనని డిమాండ్ చేస్తాడు.

ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటారు. శివ నారాయణ, దశరథ, సుమిత్ర, జోష్ణ అందరూ కారులో వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక పారిజాతానికి మాత్రం శివ నారాయణ మరొక పని అప్పజెప్పి ఉంటాడు. ఇక కారులో అందరూ ఎక్కుతారు. కార్తీక్ బాబు డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుంటే జోష్ణ అడ్డుకుంటుంది. ఈరోజు నేనే డ్రైవ్ చేస్తాన ని చెబుతుంది. కార్తీక్ బాబు వెనుక సీట్లో కూర్చుంటాడు. ఇక జోష్ణ నేరుగా కార్తీక్ బాబు ఇంటికి తీసుకు వెళుతుంది. దాంతో కార్తీక్ బాబు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తిని పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X