Karthika Deepam 2 September 18th: కార్తీక్ బాబు కల నెరవేరింది.. దీపాపై కన్నెర్రజేసిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 17వ తేదీ 465వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శౌర్య పాప పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రోజంతా ఇంట్లోనే ఉంటానని కార్తీక్ బాబు శౌర్యకు మాట ఇస్తాడు. ఈరోజు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లను అని హామీనిస్తాడు. ఇదే సమయంలో జ్యోష్ణ ఫోన్ చేస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వెంటనే మా ఇంటికి రావాలని ఆదేశిస్తుంది. కానీ నేను ఇవ్వాళ రాలేను పెద్ద మేడమ్ గారు అని కార్తీక్ బాబు చెబుతాడు. ఇప్పటికే మీరు శౌర్య బర్త్ డే ఉందని చెప్పి వచ్చాను కదా అని అంటాడు. నేను రావడం కష్టమని చెబుతాడు. అయితే అదే మాట శివ నారాయణ గారికి చెప్పు, నిన్ను వెంటనే రమ్మంటున్నది కూడా ఆయనే అని జ్యోష్ణ చెబుతుంది. దాంతో వెంటనే కార్తీక్ శివ నారాయణ ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్లగానే అందరూ రెడీ అయ్యి ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 18వ తేదీ 466 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 466 September 18th 2025

శౌర్య పాప పుట్టినరోజు సందర్భంగా శివ నారాయణ కూడా కుటుంబ సమేతంగా కార్తీక్ బాబు ఇంటికి వస్తాడు. అంతకంటే ముందు శివ నారాయణ కార్తీక్ బాబును తన ఇంటికి రమ్మని జోష్ణ చేత ఫోన్ చేయిస్తాడు. అయితే జ్యోత్స్న ఫోన్ చేసి హడావుడిగా ఇంటికి రమ్మని చెబుతాడు. ఏమైందో ఏంటోనని కార్తీక్ బాబు హుటాహుటిన శివ నారాయణ ఇంటికి వెళ్తాడు. ఇక మనం వేరే దగ్గరికి వెళ్లే పని ఉందని చెప్పి కార్తీక్ బాబును కారులో ఎక్కించుకుంటారు. ఆ కారును జోష్ణ డ్రైవ్ చేస్తూ నేరుగా కార్తీక్ బాబు ఇంటికి తీసుకువస్తుంది. దాంతో కార్తీక్ బాబు షాక్ అవుతాడు. మా ఇంటికి అని ముందే చెప్పొచ్చు కదా అని అంటాడు. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదని శివ నారాయణ అంటాడు. ఆ తర్వాత అందరూ ఇంటి లోపలికి వెళ్తారు. శివ నారాయణ కూడా కుటుంబ సమేతంగా శౌర్య పాప పుట్టినరోజు వేడుకలకు రావడంతో కాంచన, దీప, అనసూయ చాలా సంతోషపడతారు. కుటుంబమంతా ఒకే దగ్గర చేరడంతో కార్తీక్ బాబు కూడా పట్టలేని ఆనందంలో ఉంటాడు.

ఇక శివ నారాయణ పారిజాతాన్ని కాస్త వెనకాల రమ్మని చెప్పి బర్త్డే కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయించాలని, కేక్, ఫుడ్, గిఫ్ట్స్ అన్ని కొనుక్కొని రమ్మని చెబుతాడు. ఆ వెంటనే పారిజాతం వాటన్నిటిని తీసుకొని ఇంటికి వస్తుంది. పాపం పారిజాతం శివ నారాయణ దగ్గర తీసుకున్న 20 వేల రూపాయలను శౌర్య పాప పుట్టినరోజు వేడుకలకు ఖర్చు చేస్తుంది. కానీ శివ నారాయణ మాత్రం పారిజాతానికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వరు. ఇక ఇదే సమయంలో శ్రీధర్ కూడా హాజరవుతాడు. తన మనసు మార్చుకుని మంచిగా ప్రవర్తిస్తున్న శ్రీధర్ ఇంట్లోకి రాగానే శివ నారాయణకు మర్యాదగా నమస్కరిస్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఒక్కనివే వచ్చావు కావేరి స్వప్న రాలేదేంటని కార్తీక్ బాబు ప్రశ్నిస్తాడు. ఆ వివరాలు తర్వాత మాట్లాడుకుందామని శ్రీధర్ బదులిస్తాడు. ఇక ఆ వెంటనే శౌర్య పాప పుట్టినరోజు కేకును కట్ చేద్దామని అనుకుంటారు. కానీ ఇదే సమయంలో సుమిత్ర ఊహించని బాంబు పేలుస్తోంది. కార్తీక్ బాబును అసలు నీ ప్రాణదాత ఎవరు చెప్పమని అడుగుతుంది. నేను ఈరోజు ఈ వేడుకలకు వచ్చింది కూడా ఆమె ఎవరో తెలుసుకోవాలని అని అంటుంది.

సుమిత్ర మాటలు విన్న కాంచన, దీప, అనసూయ, శివ నారాయణ, దశరథ, జోష్ణ, శ్రీధర్, పారిజాతం అందరూ షాక్ అవుతారు. కాంచన స్పందిస్తూ నీ ప్రాణదాత ఎవరో నీకు తెలిసిందా రా అని ప్రశ్నిస్తుంది. అంటే నువ్వు ఇంట్లో కూడా చెప్పలేదా అని సుమిత్ర కార్తీక్ బాబును అడుగుతుంది. ఈరోజు ఎలాగైనా నీ ప్రాణం దాత ఎవరో నాకు చెప్పాల్సిందే అని పట్టుబడుతుంది. దీప ఇదేంటని షాక్ అవుతుంది. కార్తీక్ బాబు అందరికీ ఆ విషయం చెబుతానని, నా ప్రాణ తాత ఎక్కడో లేదు మన దగ్గరే ఉందని చెబుతాడు. ఇంతకీ ప్రాణదాత ఎదురైతే మీరు ఏం చేస్తారు అత్త అని సుమిత్రాను అడుగుతాడు. అప్పుడు సుమిత్ర ప్రాణాలను కాపాడిన వారు దేవతతో సమానం ముందుగా ఆమెకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఒకవేళ సాయం తీసుకునే పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సాయం అయినా చేస్తాను. అలాంటి వారిని మనమే ప్రత్యేకంగా వెళ్లి కలవాలని అంటుంది. ఇక నేను కూడా వస్తానని శివ నారాయణ, దశరథ, కాంచన, అనసూయ అందరూ అంటారు. మనందరం వెళ్లడం కాదు కానీ తననే ఇక్కడికి పిలిపిస్తానని కార్తీక్ బాబు చెబుతాడు.

అంతకంటే ముందు కేక్ కట్ చేద్దామని చెబుతాడు. కేక్ కట్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ సమయంలో పుట్టినరోజు వేడుకలకు దాసు ఎందుకు రాలేదు అని పారిజాతం బయటికి వెళ్లి ఫోన్ చేస్తుంది. ఇక పారి జాతానికి అప్పటికే శ్రీధర్ ద్వారా కాశి అరెస్టు అయ్యాడు అనే సంగతి తెలుస్తుంది. ఆ విషయాన్ని కూడా దాసుతో అడుగుతుంది. కనీసం నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు రా అని కోప్పడుతుంది. కానీ దాసు తిరిగి కోపంగా బదులిస్తాడు. మన వాళ్ళ అంటూ ఎవరూ లేరు కదా అమ్మా అని అంటాడు. నేను ఆల్రెడీ జ్యూస్ నాకు ఈ విషయం చెప్పాను, రక్త బంధమే నన్ను కాదని మొహం చాటేసింది, అలాంటప్పుడు ఇంకెవరికి చెప్పి ఏం లాభమని అంటాడు. జోష్నా నాకు ఈ విషయం చెప్పలేదని పారిజాతం దాసుతో చెబుతుంది. ఇంక శ్రీధర్ బావ డబ్బులు కట్టి మరీ శ్రీధర్ ని విడిపించాడని ప్రస్తుతానికి సమస్య పరిష్కారమైందని అంటాడు. ఇక ఆ తర్వాత జోష్నా పారిజాతం దగ్గరికి వస్తుంది. పారిజాతం జోష్ణపై కన్న చేస్తుంది. కేక్ కట్ చేసిన తర్వాత జోష్నా కార్తీక్ బాబును అవమానించేలా శౌర్య పాపా నీ కన్నా కూతురు కాదు కదా అని అంటుంది. దాంతో పారిజాతం జోష్నకు రివర్స్ అవుతుంది. కన్నకూతురు కాకపోయినా కొందరి ప్రేమలు రక్తసంబంధంలా ఉంటాయని చెబుతుంది. మరి నీ మాటలతో జోష్నాకు వణుకు పుట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X