Karthika Deepam 2 September 19th: జ్యోత్స్నకు ఎదురు దెబ్బ.. కుటుంబం మొత్తం రివర్స్.. సుమిత్రకు షాక్

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 18వ తేదీ 466వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శౌర్య పాప పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేస్తారు. అయితే కార్తీక్ బాబును జ్యోత్స్న అవమానిస్తుంది. బావ నువ్వు సోషల్ సర్వీస్ బాగా చేస్తున్నావని అంటుంది. ఇందులో సోషల్ సర్వీస్ ఏముందని కార్తీక్ బాబు అంటాడు. శౌర్య పాప నాకు కన్న కూతురు లాంటిదే కదా, తనకి నేను పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సోషల్ సర్వీస్ ఎలా అవుతుందని కార్తీక్. దీన్ని సోషల్ సర్వీస్ గా చూడడానికి కారణం ఏముందని అంటాడు. ఉంది బావ అని జ్యోత్స్న సమాధానం ఇస్తుంది. మా నాన్న నాకు పుట్టినరోజు వేడుకలు చేస్తే అది తండ్రిగా బాధ్యత నెరవేర్చినట్టు అవుతుంది. అదే మా నాన్న వేరే వాళ్ళకి పుట్టినరోజు వేడుకలు చేస్తే అది సోషల్ సర్వీస్ అవుతుందని అంటుంది. శౌర్య పాపా నీకు సొంత కూతురు ఎలా అవుతుంది, దీపాకు నీకు పుట్టిన కూతురు కాదు కదా అప్పుడు నువ్వు చేసేది సోషల్ సర్వీస్ అవుతుందని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న మాటలకు అందరూ షాక్ అవుతారు. అసలు జ్యోత్స్న ఇలా మాట్లాడుతుంది ఏంటని ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. సెప్టెంబర్ 19వ తేదీ 467 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

జ్యోత్స్న మాటలకు అందరికీ కోపాన్ని తెప్పిస్తాయి. సోషల్ సర్వీస్ అనడంతో అందరూ మండి పడుతారు. ఇక జ్యోత్స్న అంతటితో ఆగకుండా నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేదని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా అని సవాలు విసురుతుంది కూడాను. దాంతో జ్యోత్స్న కు వ్యతిరేకంగా పారిజాతం మాట్లాడుతుంది. నువ్వు చెప్పింది ముమ్మాటికి తప్పు అని అంటుంది. అలా చెప్పే అర్హత నీకు అసలు లేదని అంటుంది. నీకేం మాత్రం అర్హత లేకుండా హద్దులు దాటి మాట్లాడుతున్నామని పారిజాతం జ్యోత్స్నపై మండిపడుతుంది. పారిజాతం తనకు వ్యతిరేకంగా మాట్లాడడంతో జోష్న షాక్ అవుతుంది. ఇదేంటి పారు నాకు రివర్స్ అయిందని ఆలోచిస్తుంటుంది. దాసు విషయంలో జ్యోత్స్న చేసిన పనికి పారు ఇలా జ్యోత్స్నపై పగ సాధిస్తుంది. ఇక పారిజాతం మాట్లాడుతూ కొందరికి రక్తసంబంధం ఉండదు. తోడబుట్టిన వాళ్ళను కూడా పట్టించుకోరు అని జోష్నను దెప్పిపొడుస్తుంది. ఇక కార్తీక్ బాబు గురించి మాట్లాడుతూ కొందరికి రక్తసంబంధం లేకున్నా అంతకు మించిన బంధం ప్రేమ ఉంటాయని దానిని వారు ఎప్పుడూ తమకి ఇష్టమైన వారిపై చూపిస్తూనే ఉంటారని అంటుంది. అలాంటి కార్తీక్ బాబుపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అర్హత నీకు ఏమాత్రం లేదని పారిజాతం జ్యోత్స్నపై మండిపడుతుంది. ఇక పారు మాట్లాడిన వెంటనే దశరథ కూడా స్పందిస్తాడు. ఏదైనా మాట్లాడాలంటే మనకు అర్హత ఉండాలని అంటాడు.

Karthika deepam 2 Serial Today s Episode 467 September 19th 2025

అర్హత అంటే మనం వారి జీవితం పట్ల బాధ్యతగా ఉండడం అర్హత అవుతుందనే అంటాడు. శౌర్య పాప జీవితాన్ని కార్తీక్ బాబు బాధ్యత తీసుకున్నారు కాబట్టి శౌర్య పాప పుట్టినరోజులను జరిపే అర్హత కార్తీక్ బాబుకు ఉంటుందని దశరథ అంటారు. అలా అడిగా అర్హత మాత్రం మనకు ఏమాత్రం లేదని కూడా చెబుతాడు. కార్తీక్ బాబును అడిగే అర్హత కేవలం కాంచనకు మాత్రమే ఉందని, మేనమామ గా ఉన్నా నాకు కూడా కార్తీక్ బాబును ప్రశ్నించే అర్హత లేదని చెబుతాడు. ఇక వెంటనే కార్తీక్ బాబు స్పందిస్తూ శౌర్య పాపాలను నేనెప్పుడూ నా కూతురు గానే చూస్తున్నానని, వేరే తారతమ్యాలు ఏమీ లేవని చెబుతాడు. వెంటనే మాట మార్చేస్తాడు. ఆ తర్వాత దీపాకి కేక్ కట్ చేసి అందరికి స్వీట్లు పంపిణీ చేయమని చెబుతాడు. అందరూ స్వీట్లు తిన్నాక ఇక వెళ్ళిపోదామని అంటారు. కానీ సుమిత్ర మాత్రం అసలు విషయం చెప్పకుండానే వెళ్ళిపో అంటే ఎలా వెళ్ళిపోతారని సుమిత్ర అంటుంది. నీ ప్రాణదాతని పిలుస్తానని చెప్పావు కదరా అని అంటుంది. అవును అత్త నా ప్రాణదాతను చూపించడానికి అంటే ముందు నీకు ఒక ఫోటో చూపిస్తాను అని, అది నువ్వు గుర్తుపడితే నా ప్రాణదాతను చూపిస్తానని అంటాడు. అందుకు సుమిత్ర సరేనా అని చెప్పడంతో వెంటనే తన దగ్గర ఉన్న దీపా చిన్ననాటి ఫోటోను తీసి సుమిత్రకు ఇస్తాడు.

ఆ ఫోటో చూసిన సుమిత్ర ఈమె చిన్నప్పుడు కోనేరులో నువ్వు పడిపోయినప్పుడు కాపాడిన ప్రాణదాత అని సుమిత్ర చెబుతుంది. కోనేరులో నేను పడిపోలేదని జ్యోత్స్న కోసం తామర పువ్వులను తెంచుదామని వెళ్లానని, తక్కువగా ఉందని అనుకున్న సమయంలో మరో అడుగు ముందుకు వేయడంతో మునిగిపోయానని చెబుతాడు. అప్పుడు వచ్చి కాపాడింది ఈ చిన్న పాప అని కార్తీక్ బాబు చెబుతాడు. అయితే ఇప్పుడు మీ పాప చాలా పెద్దగా మారిందని ఆమెను గుర్తుపట్టాలంటే కళ్ళు మూసుకోవాలని చెబుతాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా సుమిత్ర అత్త నా ప్రాణదాతను గుర్తుపట్టే వరకు, కళ్ళు తెరిచే వరకు ఎవరు ఏమీ మాట్లాడకూడదు అని షరతు విధిస్తాడు. అందుకు అందరూ సరేనని ఒప్పుకుంటారు. ఇక ఆ వెంటనే కార్తీక్ బాబు దీపాను తీసుకువచ్చి సుమిత్ర ముందు నిలుచో పెడతాడు. అప్పటికే సుమిత్ర కళ్ళు మూసుకుని ఉంటుంది. ఇక వెంటనే కార్తీక బాబు సుమిత్ర అత్త చేతిలో దీపా చేతులను పెడతాడు. మిగిలిన వాళ్ళందరూ దీపానేతన ప్రాణదాతగా కార్తీక్ బాబు చెబుతుండడంతో ఆశ్చర్యపోతారు.

ఆ తర్వాత వెంటనే సుమిత్ర కళ్ళు తెరిచి చూస్తోంది. తన ముందు దీప ఉండడం చూసి షాక్ అవుతుంది. నీ ప్రాణ దాత దీప అసలు అయి ఉండదని సుమిత్ర చెబుతుంది. నీ భార్యగా దీపాను కాపాడుకోవాలని చూస్తున్నావని, ఇంట్లో ప్రత్యేక గౌరవం దక్కాలని ఇలా చేస్తున్నామని కార్తీక్ బాబుపై సుమిత్ర ఫైర్ అవుతుంది. కానీ కార్తీక్ బాబు మాత్రం నేను చెబుతున్నది అక్షరాల నిజం అని అంటాడు. వెంటనే కుబేరతో దీప దిగిన ఫోటోను కూడా సుమిత్రకు చూపిస్తాడు. నేను మొదట చూపిస్తున్న ఫోటోలోని పాప, రెండవసారి చూపించిన ఫోటో పాప ఇద్దరూ ఒకరే కదా అని సుమిత్రను అడుగుతాడు. అవును ఒక్కరే అని సుమిత్ర బదిలిస్తుంది. అలాంటప్పుడు నా ప్రాణదాత కూడా దీప అనే అని చెబుతాడు. సుమిత్ర కూడా నమ్ముతుంది. నా మేనల్లుడు కార్తీక్ బాబు ప్రాణాలను కాపాడిన ప్రాణదాతలు నువ్వే అవుతావని అస్సలు ఊహించలేదని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత లాకెట్టును సుమిత్ర తన చేతులతో స్వయంగా దీపా మెడలో వేస్తోంది. ఆ తర్వాత కార్తీక్ బాబు సుమిత్రకు మరో కండిషన్ పెడతాడు. నువ్వు దీపాను క్షమించాలి అత్త అని అంటాడు. అందుకు సుమిత్ర ఎలాంటి సమాధానం ఇచ్చిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X