Karthika Deepam 2 September 22nd: కార్తీక్ బాబుకు షాక్ ఇచ్చిన సుమిత్ర.. ఇంటికి పిలిచి మరీ రచ్చ

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 20వ తేదీ 468వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు సుమిత్రకు ఒక కండీషన్ పెడుతాడు. తన ప్రాణదాత గురించి చెబితే ఆమెకు ఎలాంటి సాయమైనా చేస్తానని చెప్పావ్ కదా అత్త.. ఇప్పుడు దీపానే నా ప్రాణదాత అని అందరికీ తెలిసిపోయింది. ఇక దీపాకు నువ్వు ఒక సాయం చేయాలని అడుగుతాడు కార్తీక్ బాబు. అందుకు సుమిత్ర నేనేమీ సాయం చేయగలను అని సుమిత్ర కార్తీక్ బాబును అడుగుతుంది. దాంతో కార్తీక్ బాబు నువ్వు దీపాను క్షమించాలని అంటుంది. దాంతో సుమిత్ర దశరథ వైపు చూస్తుంది. మామ నువ్వు కూడా అత్తను క్షమించాలని అడుగాడు. దశరథ స్పందిస్తూ ఇదంతా నా చెల్లి కాంచన చేతిలో ఉందని అంటాడు.

ఇక కాంచన నా చేతిలో కాదు, సుమిత్ర తాళి తెంచడంతో దీపా బాధపడింది. దీపా క్షమిస్తే అందరూ సంతోషించినట్టే అని అంటుంది. ఇక దీపాను క్షమాపణలు కోరమని దశరథ చెబుతాడు. కానీ సుమిత్ర చిన్న ట్విస్ట్ ఇస్తుంది. మీరదందరూ మా ఇంటికి భోజనాలు వస్తే అక్కడ క్షమాపణలు కోరుతానని అంటుంది. ఎందుకు నేను తాళి తెంచింది అక్కడే కదా, దీపాకు కూడా అక్కడే క్షమాపణలు చెబితే బాగుంటుందని నా అభిప్రాయమని అంటుంది. అందుకు అందరూ సరేనని అంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సెప్టెంబర్ 22వ తేదీ 469 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 469 September 22nd 2025

శౌర్యపాప పుట్టిన రోజు ఘనంగా జరిపించి శివ నారాయణ, దశరథ ఇంటికి తిరిగి వస్తారు. వారితో పాటు పారిజాతం, జ్యోత్స్న కూడా వస్తారు. అయితే పారిజాతం ఇంటికి తిరిగి రాగానే జ్యోత్స్నపై మండి పడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జ్యోత్స్న పై ఉగ్రరూపం దాల్చుతుంది. తన కొడుకు దాసును జ్యోత్స్న నమ్మించి మోసం చేసినందుకు జ్యోత్స్నపై రగిలిపోతుంది. అసలు ఎందుకు నువ్వు అలా చేశావని జ్యోత్స్న ను నిలదీస్తుంది. నీ కన్న తండ్రి, తొడబుట్టిన తమ్ముడు ప్రమాదం ఉన్నాడంటే కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా అని ప్రశ్నిస్తుంది. నీలో ఇంత కుట్ర బుద్ధి ఉందని నేను అస్సలు అనుకోలేదు. నేను కూడా స్వార్థంగానే ఉంటాను. కానీ నా రక్తం ప్రమాదంలో ఉంటే మాత్రం ఏం చేసైనా సరే వారిని కాపాడుకుంటాను.అంతే కానీ నీలా ప్రమాదంలో ఉన్నారని తెలిసి కూడా మౌనంగా ఉండే రకం కాదు జ్యోత్స్న నేను అంటూ మండి పడుతుంది. నీకు నీ తండ్రి, తమ్ముడిని కాపాడుకోవాలనే ఆసక్తి లేనప్పుడు కనీసం నాకైనా వారు ప్రమాదంలో ఉన్నారని చెప్పాల్సింది. నువ్వు అది కూడా చేయలేదని జ్యోత్స్నను నిందిస్తుంది.

సమయానికి అల్లుడు శ్రీధర్ వెళ్లి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నా మనవడు కాశీ ఈ పాటికి జైలులో ఉండే వాడు. వాడిని విడిపించడం ఎంతో కష్టమయ్యేది అంటూ పారుజాతం ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో జ్యోత్స్న మాట్లాడుతూ శ్రీధర్ మామకు వెళ్లమని చెప్పిందే నేనని పారుజాతంతో అంటుంది. దాంతో పారుజాతం జ్యోత్స్నపై ఇంకా ఫైర్ అవుతుంది. నా చెవిలో ఏమైనా ఫ్లవర్స్ ఉన్నాయా? అని అడుగుతుంది పారు. నీలాంటి వెర్రి వేషాలు ఎన్నో వేశాను. రెండు చీరలు రెండు వందలతో జీవితాన్ని ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగిన నన్నే బోల్తా కొట్టించాలని చూస్తే వీపు పగిలిపోద్ది అంటూ పారుజాతం తన ఉగ్రరూపాన్ని చూపిస్తుంది. నువ్వు బాగుండాలనే పేదరికంలో పుట్టిన నిన్ను తీసుకొని వచ్చిన కోట్ల ఆస్తికి వారసురాలిగా చేశానని చెబుతుంది. ఇప్పటికైనా మంచిగా మసలుకో అని చెబుతుంది పారుజాతం. దీంతో జ్యోత్స్న కూడా బయపడి పోతుంది. పారు మనవడిని కాపాడలేదని తెలిస్తేనే ఇంతలా మండి పడిపోతుంది. ఇక పారు కొడుకు దాసును చంపే ప్రయత్నం చేసింది నేనే అని తెలిస్తే ఇంకేం చేస్తుందోనని టెన్షన్ పడుతుంది.

మరోవైపు కాంచన ఇంట్లో ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. జ్యోత్స్న అన్న మాటలను పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. శౌర్య పాప కార్తీక్ బాబు దీపాలకు పుట్టింది కాదు కదా అని జ్యోత్స్న ఎత్తి పొడిచిన మాట కాంచనను నిద్రకు దూరం చేస్తుంది. అదే విషయంపై కాంచన దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ బాబు, దీపా ఇంటికి తిరిగి వస్తారు. ఏమైంది అమ్మ అని కార్తీక్ బాబు తల్లి కాంచనను అడుగుతాడు. నాకు జ్యోత్స్న అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయిరా అని కాంచన చెబుతుంది. శౌర్య పాప గురించి జ్యోత్స్న మాట్లాడిన మాటలు కూడా నిజమే కదా అని అంటుంది. జ్యోత్స్న అలా అన్నందుకు అప్పుడు గట్టిగానే బుద్ధి చెప్పాం కదా అమ్మ అని కార్తీక్ బాబు బదులిస్తాడు. కానీ అదే మాట ఇప్పుడు నేను అంటే నువ్వు ఏం చేస్తావ్ రా అని కాంచన అంటుంది. దాంతో కార్తీక్ బాబు, దీపా ఇద్దరు షాక్ అవుతారు. కాంచన మాట్లాడుతూ అక్కడ అనేందుకు అవకాశం ఉంది కాబట్టి జ్యోత్స్న అలా మాట్లాడింది. కానీ మీరు ఎవ్వరికీ ఆ అవకాశం ఇవ్వొద్దు. అంటే మీరు ఒక బిడ్డ ఉండాలని కాంచన అంటుంది. ఆల్రెడీ శౌర్య ఉంది కాదా అమ్మ అని కార్తీక్ బాబు బదులిస్తాడు. దాంతో కాంచన ఇంకో బిడ్డ ఎందుకు ఉండకూడదు. నీకు దీపాకు మరొబిడ్డ కూడా ఉంటే అందరి నోరు మూయించిన వారు అవుతారు అని కాంచన అంటుంది.

కాంచన మాటలు విన్నాక దీపా వెంటనే ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ మనం వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అమ్మ అని చెబుతాడు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని అంటాడు. ఇక దీపా దగ్గరకు వెళ్లి దీపాను కూడా ఓదార్చుతాడు. అమ్మ అన్న మాటలకు ఏమాత్రం బాధపడకు అని చెబుతాడు. దీపా స్పందిస్తూ అమ్మ అన్న మాటలకు నాకు ఏమాత్రం బాధ లేదు. కానీ రేపు సుమిత్రమ్మ ఎలా స్పందిస్తుందో అన్నదే నాకు టెన్షన్ గా ఉందని అంటుంది దీపా. దాంతో కార్తీక్ బాబు స్పందిస్తూ అంతా మంచే జరుగుతుందని, నా ప్రాణదాతవు నువ్వే అని ఎలా చెప్పానో, త్వరలోనే దీపానే ఈ ఇంటికి అసలు వారసురాలు అనే సంగతిని కూడా చెబుతానని అంటాడు. మరోవైపు సుమిత్ర కార్తీక్ బాబు, కాంచన, దీపా, శ్రీధర్ వస్తారని వారి కసం అన్ని రకాల వంటలు చేయిస్తూ ఉంటుంది. అన్ని రెడీ అయ్యాక డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. ఇదే సమయంలో శ్రీధర్ వస్తాడు. దీంతో శివ నారాయణ, దశరథ శ్రీధర్ ను మంచిగానే పలకరిస్తారు. ఆ వెంటనే కార్తీక్ బాబు, దీపా కూడా ఎంట్రీ ఇస్తారు. ఇక సుమిత్ర మాత్రం దీపాతో ప్రేమగా మాట్లాడుతుంది. దీంతో శివ నారాయణ దశరథను సుమిత్రతో మాట్లాడమని అంటాడు. కానీ దశరథ మాత్రం తన చెల్లి కాంచన మొహంలో నవ్వు చూసిన తర్వాతనే సుమిత్రను పిలిచి మాట్లాడుతానని అంటాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X