Karthika Deepam 2 September 23rd: దీపాకు ఊహించని షాక్.. అన్నంత పని చేసిన సుమిత్ర
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 22వ తేదీ 469వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపా కు క్షమాపణలు చెబుతానని సుమిత్ర అందరిని ఇంటికి రమ్మంటుంది. మన రెండు కుటుంబాలు దగ్గర కావాలంటే నేను తప్పకుండా దీపాకు క్షమాపణలు చెబుతానని అంటుంది. అందుకు మీరందరూ మా ఇంటికి భోజనానికి రావాలని కార్తీక్ బాబుతో పాటు కాంచనను కూడా రావాలని అంటుంది. దాంతో అందరూ సరేనని అంటారు. ఇక శ్రీధర్ కూడా వస్తానని అంటాడు. సుమిత్ర అక్కడే క్షమాపణలు కోరకుండా అసలు ఇంటికి ఎందుకు రమ్మంటుంది అని అందరూ ఆశ్చర్యపోతారు. అందుకు సుమిత్ర కూడా ఎక్కడైతే తన తాళిని తెంచానో అక్కడే దీపా కు క్షమాపణలు చెబితే బావుంటుందని సుమిత్ర వివరిస్తుంది. ఇక ఎలాగైనా మీరందరూ మా ఇంటికి భోజనానికి రావాలని నేను ఎదురు చూస్తూ ఉంటానని చెబుతుంది. దాంతో అందరూ సరేనని చెబుతారు.
ఇక తర్వాత సుమిత్ర ఇంటికి వెళ్లడానికి కార్తీక్ బాబు కాంచన దీప అనసూయ అందరూ రెడీగా అవుతారు. ఇదే సమయంలో శ్రీధర్ కూడా వస్తాడు. నేను కూడా ఇంటికి భోజనానికి వస్తున్నాను అని చెబుతాడు. ఈ రెండు కుటుంబాలే కాదు నేను కూడా ఈ కుటుంబంలో కలవాలని అనుకుంటున్నాను అంటాడు. దాంతో కాంచన పర్మిషన్ తీసుకొని వస్తాడు. అందరు కలిసి శివ నారాయణ ఇంటికి వెళ్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సెప్టెంబర్ 22వ తేదీ 470 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబు దీప కాంచన శ్రీధర్ అందరు కలిసి రావడంతో శివ నారాయణ దశరథ సంతోషిస్తారు. సుమిత్ర కూడా వాళ్ళు రాగానే సంతోషం వ్యక్తం చేస్తుంది. అందరినీ పేరుపేరునా పలకరించి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అప్పటికే హడావుడిగా భోజనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీపాన్ని పిలిచి నీ వంటలు అర్థమని కూడా పని చెబుతుంది. అంతేకాకుండా కార్తీక్ బాబుతో ముందే రమ్మని చెబితే ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అందుకు కారణం వీళ్ళు కాదని, నేనే మధ్యలో ఆలస్యం చేశానని శ్రీధర్ చెబుతాడు. దాంతో పర్లేదులే అన్నయ్య అని సుమిత్ర అంటుంది. ఇక దీపాను సుమిత్ర పదేపదే పిలుస్తూ ఉంటుంది. సుమిత్ర అంత ప్రేమగా మాట్లాడు తుండడంతో దీప వైపు సంతోషంతో ఉంటుంది. కానీ మరోవైపు అసలు ఏం జరగబోతుందో అర్థం కాకపోవడంతో భయం భయంగా ఉంటుంది. అసలు సుమిత్ర అమ్మ ఏం చేయబోతున్నారో అర్థం కావడంలేదని అనుకుంటుంది.
ఇక సుమిత్ర డైనింగ్ టేబుల్ పై అన్ని వంటకాలను రెడీగా ఉంచుతుంది. దీంతో అందరిని తినడానికి కూర్చోమని చెబుతుంది. ఇక కార్తీక్ బాబు, దీప, కాంచన, శ్రీధర్ తో పాటు జోత్స్న పారిజాతం శివ నారాయణ దశరథ కూడా తినడానికి కూర్చుంటారు. మరోవైపు అనసూయ కూడా తమతోపాటే కూర్చుని తింటుంది. సుమిత్ర ఒక్కరే అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. మొదటిసారిగా సుమిత్రమ్మ చేతుల మీదుగా తనకు భోజనం వడ్డించడంతో దీప సంతోషం వ్యక్తం చేస్తుంది. తనను చూస్తేనే భగ్గుమనే సుమిత్ర ఇలా చాలా దగ్గరికి తీసి ప్రేమగా భోజనం వడ్డిస్తుండడంతో కాస్త ఆశ్చర్య పోతుంది. అదే సమయంలో చివరికి సుమిత్ర అమ్మ ఏం చేస్తుందోనని కంగారు కూడా పడుతుంది. ఇదే విషయాన్ని కార్తీక్ బాబుతో కూడా చెబుతుంది. సుమిత్ర అమ్మ ఏం అడుగుతుందో అర్థం కావడం లేదని అంటుంది. కాసేపు ఆగితే తెలిసిపోతుంది కదా అని కార్తీక్ బాబు దీపాకు బదులిస్తాడు.
దీపతో సుమిత్ర ప్రేమగా ఉండడంతో జోష్నా తట్టుకోలేక పోతుంది. మరోవైపు పారిజాతం కూడా సుమిత్ర ప్రేమను దీపపై చూపించడం ఏమాత్రం జీర్ణించుకోలేక పోతుంది. ఎప్పుడు లేనిది సుమిత్ర ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందని కాస్త సందేహిస్తారు. ఒకవేళ సుమిత్ర పూర్తిగా మారిపోయిందా? దీపను క్షమించి ఈ రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తుందా అని ఆలోచిస్తారు. ఇక భోజనం తింటూనే పారిజాతం దీపావళి ఉండలేక కామెంట్లు వేస్తోంది. ఈ ఇంటి పనిమనిషి ఇలా భోజనం చేయడం చాలా ఆనందంగా ఉందని అంటుంది. దాంతో కార్తీక్ బాబు పారిజాతంపై మండిపడతాడు. పారిజాతానికి ఈ వంటకాలు కాకుండా స్పెషల్ వంటకాలు వడ్డించండి అని చెబుతాడు. అప్పుడే పారిజాతానికి ఉన్న రోగం తగ్గుతుందని ఎంటకారంగా చురకలు అంటిస్తాడు. దాంతో పారిజాతం నోరు మూసుకుంటుంది. ఇక అందరూ కలిసి భోజనాలు చేస్తారు. చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ నుంచి హాల్లోకి వస్తారు.
అదే సమయంలో సుమిత్ర బయట బట్టలు ఆరేసి వస్తానని వెళుతుంది. సుమిత్ర వెంటనే జోష్ణ కూడా వెళ్తుంది. అమ్మ అని మాట్లాడుతుంది. చెప్పు జోష్నా అని సుమిత్ర అడుగుతుంది. ఇప్పుడు నువ్వు నిజంగానే దీపాను క్షమిస్తావ అమ్మ అని అడుగుతుంది. అవును క్షమిస్తానని బదిలీస్తుంది. అంటే దీప చేసిన తప్పులు అన్నిటిని క్షమించేసావా అని జోష్ణ ప్రశ్నిస్తుంది. ఏ మనిషిలోనైనా మనం తొమ్మిది తప్పులు చేసిన ఒక మంచి మాత్రం ఉంటుంది. ఆ మంచిని గుర్తించి ప్రోత్సహిస్తే వారు పూర్తిగా మంచి వారిగా మారిపోయే అవకాశం కూడా ఉంటుందని బదులుస్తుంది. అందుకే దీపాను క్షమించబోతున్నానని అంటుంది. ఇక తర్వాత హాల్లోకి వెళ్లి దీపాను తన దగ్గరికి పిలుస్తుంది. జోష్ణ కు దేవుని గదిలో ఉన్న హారతిని తీసుకురమ్మని చెబుతుంది. జోష్ణ తీసుకు వచ్చిన తర్వాత నిప్పు వెలిగించి దీపాకు క్షమాపణలు చెబుతుంది. నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది. ఇక నేను పూర్తిగా క్షమించాలి అని అంటే, నువ్వు కూడా నీ తప్పును ఒప్పుకోవాలి దీపా అని అడుగుతుంది. ఏంటమ్మా అని దీపా ప్రశ్నిస్తుంది. సుమిత్రను చంపాలని కాల్చిన బుల్లెట్టును దశరథ జాతి లోకి దిగిన బుల్లెట్టును నువ్వు ఉద్దేశపూర్వకంగానే కాల్చావు కదా? ఆ విషయాన్ని ఒప్పుకోవాలని అంటుంది. దాంతో మన రెండు కుటుంబాలు కలిసిపోతాయని అంటుంది. ఇక దీప ఏమాత్రం ఆలోచించకుండా అవునని అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది, నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











