Karthika Deepam 2 September 24th: దీపా, కార్తీక్ బాబుపై సుమిత్ర ఫైర్.. ఊహించని మెలిక పెట్టి..
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 23వ తేదీ 470వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాపై కార్తీక్ బాబు ఫైర్ అవుతాడు. చేయని తప్పును నీపై ఎలా వేసుకుంటావని మండి పడుతాడు. ఓవైపు దీపాపై సుమిత్ర ఒత్తిడి పెంచుతూ ఉంటుంది. దశరథ ఒంట్లో బుల్లెట్ ను కావాలని దించింది దీపనే అనే నిజాన్ని అందరి ముందు ఒప్పుకోవాలని సుమిత్ర అంటుంది. ఇక తను చేయని తప్పును కూడా దీప ఒప్పుకోవడానికి సిద్ధం అవుతుంది. అందుకు కారణం రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని ఆశిస్తుంది. దాంతో సుమిత్ర అడిగిన వెంటనే ఒప్పుకోవడానికి సిద్ధం అవుతుంది. ఇక కార్తీక్ బాబు, కాంచన షాక్ అవుతారు. కార్తీక్ బాబు దీపాపై మండి పడుతాడు. అసలు నువ్వు చేయని తప్పును ఎలా ఒప్పుకుంటావని అంటాడు. కానీ సుమిత్ర మాత్రం తప్పు దీపానే చేసింది కాబట్టి ఒప్పుకుంటోందిరా అని అంటుంది. దీపా తప్పు ఒప్పుకుంటేనే ఈ రెండు కుటుంబాలు కలుస్తాయని, ముఖ్యంగా దీపాను నేను క్షమిస్తానని అంటుంది సుమిత్ర. ఎందుకంటే దీపను క్షమిస్తేనే నా భర్త దశరథ నాతో మాట్లాడుతానని అన్నాడు. అందుకే నేను దీపా తన తప్పును ఒప్పుకునే వరకు అస్సలు ఊరుకోనని అంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సెప్టెంబర్ 24వ తేదీ 471 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?
అసలు దీపనే దశరథ మామయ్య ఒంట్లో బుల్లెట్ దింపిందని మీరు ఎలా అనుకుంటున్నారు అత్త, అది అస్సలు నిజం కాదని కార్తీక్ బాబు సుమిత్రతో అంటాడు. నేను కళ్లారా చూశానని అంటుంది సుమిత్ర. చూసినవన్నీ నిజాలు కాదు అత్త, వాస్తవాలు వేరేలా ఉంటాయని కార్తీక్ బాబు అంటాడు. అందుకే కోర్టులో కూడా కేసు చెల్లలేదని కార్తీక్ బాబు అంటాడు. ఇక దీప మాత్రం ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు కలవడం కోసం తను చేయని నేరాన్ని కూడా తనపై వేసుకునేందుకు సిద్ధపడింది. అసలు ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని విషయం. దీపకు ఎలాంటి పాపం తెలియదు. తను ఏమై పోయన పర్లేదు. ఈ రెండు కుటుంబాలు సంతోషంగా కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటోంది. అందుకే చేయని తప్పును ఒప్పుకునేందుకు సిద్ధమవుతోంది. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఈ విషయం అందరూ గమనించాలి. దీపా ఒప్పుకున్నా నేను మాత్రం నా భార్య తప్పు చేసిందంటే అస్సలు ఒప్పుకోనని అంటాడు.

దీపా తప్పు చేయలేదు కాబట్టే కోర్టులో కూడా కేసు నిలవలేదని, స్వయంగా జడ్జీనే దీప పట్టుకున్న తుపాకీ నుంచి బుల్లెట్ రాలేదని, దశరథ మామ ఒంట్లో దిగిన బుల్లెట్ తో మ్యాచ్ అవ్వడం లేదని కోర్టు స్పష్టం చేసిందని ఎలా అంటారని కార్తీక్ బాబు ప్రశ్నిస్తాడు. అసలు దీపా చేతిలో ఉన్న గన్ నుంచి బుల్లెట్ ను ఎవరు దాచి పెట్టారనే దానిపై ఇంకా కోర్టులో విచారణ జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. మున్ముందు అసలు బుల్లెట్ ఎలా మాయం అయ్యిందనేది తెలుస్తోందని అంటాడు. నువ్వు నీ భార్యను కాపాడుకునేందుకు సాక్ష్యాలను కూడా కొనేసి ఉంటావురా అని సుమిత్ర తిరిగి కార్తీక్ బాబుపై నిందమోపుతుంది. అప్పటికి కూడా కార్తీక్ బాబు నేను ఎలాంటి సాక్ష్యాలను కొనలేదు. స్వయంగా జరిగిన విషయాన్నే కోర్టు నిర్ధారించిందని కార్తీక్ బాబు చెబుతాడు. ఆ శ్రీధర్ బాబు స్పందిస్తూ దీపానే తప్పు చేశానని ఇప్పుడు ఒప్పుకుంటుంది కదరా ఎందుకు అడ్డుకుంటున్నావని శ్రీధర్ కార్తీక్ బాబును ప్రశ్నిస్తాడు. దీంతో కార్తీక్ బాబు ఫైర్ అవుతాడు. దీపా గన్ లో నుంచి బుల్లెట్ రావడం చూశావా? నీకు అసలు విషయం తెలియదు మాస్టర్, మీరు మౌనంగా ఉండండి అని హెచ్చరిస్తాడు.
ఆ వెంటనే జ్యోత్స్న స్పందిస్తూ దీపనే తప్పు చేసింది. ఆ రోజు ఇంట్లో వాళ్లందరూ ఎంత ఆపినా ఆపకుండా నన్ను షూట్ చేయబోయింది. అది మిస్ అయ్యి మా నాన్న దశరథ ఇంట్లోకి బుల్లెట్ దిగింది. ఇదంతా నిజం కాదా బావ, దీపా కాల్చడం నిజమే కదా అని జ్యోత్స్న అంటుంది. దాంతో కార్తీక్ బాబు మరింతగా ఫైర్ అవుతాడు. అసలు తప్పులన్నీ మీవైపు పెట్టుకొని నిందలు దీపపైన వేస్తున్నారా? అని కార్తీక్ బాబు ప్రశ్నిస్తాడు. దాంతో జ్యోత్స్న సైలెంట్ అవుతుంది. కానీ సుమిత్ర స్పందిస్తూ అవునురా మేము తప్పు చేశాం కాబట్టే క్షమాపణలు కోరాం, సరిదిద్దుకుంటున్నాం, జ్యోత్స్న చెంప పగలగొట్టి కూడా నువ్వు చేసింది తప్పు అని చెప్పాను. కానీ మీరు మాత్రం మీ తప్పులను అస్సలు ఒప్పుకోవడం లేదు మీరు అని కార్తీక్ బాబుతో సుమిత్ర అంటుంది. చేయని తప్పును ఒప్పుకునే ప్రసక్తే లేదని కార్తీక్ బాబు అంటాడు. మరోవైపు దశరథ కూడా నేను కార్తీక్ బాబు మాటలే నమ్ముతున్నానని అంటాడు.
దాంతో సుమిత్ర మండిపోతుంది. దీప చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటేనే నేను క్షమిస్తాను. అప్పటి వరకు నేను క్షమించను. ఇక మీరు కూడా ఈ ఇంట్లో నుంచి వెంటనే వెళ్లిపోండి అని అంటుంది. ఇక కార్తీక్ బాబు వెంటనే కాంచనను, దీపాను తీసుకొని ఇంటికి వెళ్లిపోతాడు. దీప ఇంటికి వెళ్లిన తర్వాత ఎక్కిఎక్కి ఏడుస్తూ ఉంటుంది. దాంతో కార్తీక్ బాబు ఏడవనికని చెబుతూ ఉంటాడు.ఇదే సమయంలో శ్రీధర్ వచ్చి మంచి అవకాశాన్ని పాడు చేశావని కార్తీక్ బాబుపై మండి పడుతాడు. దీప నిజం ఒప్పుకోవడం వల్ల రెండు కుటుంబాలు కలిసిపోయే అవకాశం వచ్చింది. కానీ నువ్వు దాన్ని పాడు చేశావని అంటాడు. దాంతో కార్తీక్ బాబు స్పందిస్తూ ఇప్పుడు దీప ఏదో ఈ రెండు కుటుంబాలు కలవాలని చేయని నేరం తనపై వేసుకుంటే రేపు శిక్ష తనకే పడుతుంది. సుమిత్ర అత్త వదిలేసినా.. పారు, జ్యోత్స్నలు మాత్రం దీపానే తప్పు చేసిందని స్వయంగా ఒప్పుకుందని చెప్పి కోర్టుకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. దాంతో దీపకు 3 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. తప్పు చేయడమే తప్పు కాదు మాస్టర్, చేయని తప్పును ఒప్పుకోవడం కూడా తప్పే అని కార్తీక్ బాబు ఘాటుగా బదులిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











