Karthika Deepam 2 September 25th: కార్తీక్ బాబు కీలక నిర్ణయం.. చిక్కుల్లో దీపాను తప్పించేలా ప్లాన్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 24వ తేదీ 471వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు ఫైర్ అవుతాడు. దీపా గన్ లో నుంచి బుల్లెట్ రావడం చూశావా? నీకు అసలు విషయం తెలియదు మాస్టర్, మీరు మౌనంగా ఉండండి అని హెచ్చరిస్తాడు. ఆ వెంటనే జ్యోత్స్న స్పందిస్తూ దీపనే తప్పు చేసింది. ఆ రోజు ఇంట్లో వాళ్లందరూ ఎంత ఆపినా ఆపకుండా నన్ను షూట్ చేయబోయింది. అది మిస్ అయ్యి మా నాన్న దశరథ ఇంట్లోకి బుల్లెట్ దిగింది. ఇదంతా నిజం కాదా బావ, దీపా కాల్చడం నిజమే కదా అని జ్యోత్స్న అంటుంది. దాంతో కార్తీక్ బాబు మరింతగా ఫైర్ అవుతాడు. అసలు తప్పులన్నీ మీవైపు పెట్టుకొని నిందలు దీపపైన వేస్తున్నారా? అని కార్తీక్ బాబు ప్రశ్నిస్తాడు. దాంతో జ్యోత్స్న సైలెంట్ అవుతుంది. కానీ సుమిత్ర స్పందిస్తూ అవునురా మేము తప్పు చేశాం కాబట్టే క్షమాపణలు కోరాం, సరిదిద్దుకుంటున్నాం, జ్యోత్స్న చెంప పగలగొట్టి కూడా నువ్వు చేసింది తప్పు అని చెప్పాను. కానీ మీరు మాత్రం మీ తప్పులను అస్సలు ఒప్పుకోవడం లేదు మీరు అని కార్తీక్ బాబుతో సుమిత్ర అంటుంది. చేయని తప్పును ఒప్పుకునే ప్రసక్తే లేదని కార్తీక్ బాబు అంటాడు. మరోవైపు దశరథ కూడా నేను కార్తీక్ బాబు మాటలే నమ్ముతున్నానని అంటాడు.
దాంతో సుమిత్ర మండిపోతుంది. దీప చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటేనే నేను క్షమిస్తాను. అప్పటి వరకు నేను క్షమించను. ఇక మీరు కూడా ఈ ఇంట్లో నుంచి వెంటనే వెళ్లిపోండి అని అంటుంది. ఇక కార్తీక్ బాబు వెంటనే కాంచనను, దీపాను తీసుకొని ఇంటికి వెళ్లిపోతాడు. దీప ఇంటికి వెళ్లిన తర్వాత ఎక్కిఎక్కి ఏడుస్తూ ఉంటుంది. దాంతో కార్తీక్ బాబు ఏడవనికని చెబుతూ ఉంటాడు.ఇదే సమయంలో శ్రీధర్ వచ్చి మంచి అవకాశాన్ని పాడు చేశావని కార్తీక్ బాబుపై మండి పడుతాడు. దీప నిజం ఒప్పుకోవడం వల్ల రెండు కుటుంబాలు కలిసిపోయే అవకాశం వచ్చింది. కానీ నువ్వు దాన్ని పాడు చేశావని అంటాడు. దాంతో కార్తీక్ బాబు స్పందిస్తూ ఇప్పుడు దీప ఏదో ఈ రెండు కుటుంబాలు కలవాలని చేయని నేరం తనపై వేసుకుంటే రేపు శిక్ష తనకే పడుతుంది. సుమిత్ర అత్త వదిలేసినా.. పారు, జ్యోత్స్నలు మాత్రం దీపానే తప్పు చేసిందని స్వయంగా ఒప్పుకుందని చెప్పి కోర్టుకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. దాంతో దీపకు 3 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. తప్పు చేయడమే తప్పు కాదు మాస్టర్, చేయని తప్పును ఒప్పుకోవడం కూడా తప్పే అని కార్తీక్ బాబు ఘాటుగా బదులిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సెప్టెంబర్ 25వ తేదీ 472 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపా వలనే శివ నారాయణ కుటుంబం మన కుటుంబం కలిసే అవకాశం నిరూపయోగం అయిందని శ్రీధర్ అంటారు. దీప కాస్త ఓపిక చేసుకుని తప్పు తనదే నని ఒప్పుకుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదని శ్రీధర్ అంటాడు. దీపా మౌనంగా ఉండడం వలన సుమిత్ర అంతలా రెచ్చిపోయిందని, మీ ఆవేశంతో మన కుటుంబాలు మరింత గా దూరం కావాల్సి వచ్చింది అని శ్రీధర్ అంటాడు. దాంతో కార్తీక్ బాబు స్పందిస్తూ తప్పు మనది కాదు అయినా మనమే తప్పు చేసామని ఎలా ఒప్పుకుంటాను మాస్టారు అని ప్రశ్నిస్తాడు. కొన్నిసార్లు తప్పు మనది కాకపోయినా ఒప్పుకోవాల్సి వస్తుందని, తద్వారా మన అనుకున్న కుటుంబాలు కలిసిపోతాయని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నువ్వు తల దూర్చగానే కార్తీక్ బాబు శ్రీధర్ అంటాడు. ఇక శ్రీధర్ మాత్రం ఏ మాత్రం ఆగకుండా దీపను నిందిస్తూనే ఉంటాడు. ఒక ఆవేశం పట్టలేక కార్తీక్ బాబు తండ్రి శ్రీధర్ పై దగ్గరగా అరుస్తాడు. అంతే కాకుండా తల్లి చేతిలో ఉన్న మిఠాయి బాక్సులను కూడా నేలకి విసిరేస్తాడు.
ఇది నా కుటుంబం, ఇది నా సమస్య ఇందులో మీరు తలదూర్చాల్సిన పని ఏమీ లేదని శ్రీధర్ పై మండిపడతాడు. మా అత్త సుమిత్ర పిలిస్తే కార్యక్రమానికి వచ్చావని, అది అక్కడనే ముగిసిపోయింది. ఇక మీరు ఇంట్లో మాట్లాడే అవసరం లేదు. వెంటనే బయలుదేరండి అని ఆవేశంతో చెబుతాడు. దాంతో శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక దీపా ఇంట్లోకి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళుతుంది. మరోవైపు సుమిత్రపై దశరథ మండపడతాడు. దీపను అంతలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముందని దశరథ ప్రశ్నిస్తాడు. దీప చేసిన తప్పులను ఒప్పుకుంటే ఎంత దూరం వచ్చేది కాదని సుమిత్ర ఉంటాడు . దీప తన తప్పులను ఒప్పుకునే వరకు క్షమించే ప్రసక్తే లేదని చెబుతుంది. దాంతో దశరథ మండిపడతాడు. ఆ వెంటనే జోష్ణ స్పందిస్తూ దీపా తన తప్పులను ఒప్పుకుంటే బాగుండేదని అంటుంది. దాంతో దశరథ మరింతగా ఫైర్ అవుతాడు. అసలు ఆ తప్పులు ఒప్పుకునే దానికంటే ముందు నీ తప్పులను నువ్వు ఒప్పుకోవచ్చు కదా నేను ప్రశ్నిస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు.
ఇక జోష్ణ నా తప్పులు ఏమున్నాయని దశరథను ప్రశ్నిస్తుంది. చాలానే ఉన్నాయి జోష్ణ అని అంటాడు. నా ఛాతిలోకి బుల్లెట్ దిగేముందు అసలు జీవ చేతిలోకి గాని ఎలా వచ్చిందని ప్రశ్నిస్తాడు. దాంతో జోష్ణ వెంటనే స్పందిస్తూ నా చేతిలో ఉన్న గన్ ను దీప లాగేసుకుందని చెబుతుంది. అలాంటప్పుడు అసలు నేను చేతిలోకి గన్ ఎలా వచ్చిందని దశరథం మళ్ళీ ప్రశ్నిస్తాడు. అంత జోష్ణ షాక్ అవుతుంది. తాత గదిలో నుంచి తీసాను అని చెప్తుంది. అదే అసలు అక్కడ నుంచి గన్ తేయాల్సిన అవసరం నీకు ఏమీ వచ్చిందని అంటాడు. దీప నన్ను చంపబోతుందని తెలిసి రక్షించుకోవడం కోసం గన్ తీసుకొని వచ్చానని చెబుతుంది. దాంతో వెంటనే దశరథ స్పందిస్తూ అసలు దీప నిన్ను చంపబోతుందని నీకు ఎలా తెలిసింది, దీప నిన్ను చంపేందుకు తప్పు నువ్వేం చేసావని ప్రశ్నిస్తాడు.
దశరథ ఇలా బ్యాక్ టు బ్యాక్ అడుగుతున్న ప్రశ్నలకు జోష్ణ దగ్గర సమాధానం లేకుండా పోతుంది. సరైన సమాధానం ఇవ్వకపోతే తానే దొరుకుతాను ఇక టాపిక్ ని డైరెక్ట్ చేసే పని చేస్తుంది. శభాష్ నాన్న, మీకు మాకంటే ఆ కాంచన అత్త మీ చెల్లి, వాళ్ల కుటుంబమే ముఖ్యం. వాళ్ల గురించి ఎవరు ఏం మాట్లాడినా మీరు మాత్రం వాళ్లకే సపోర్ట్ గా ఉంటారు. కన్న కూతురి కంటే నీకు వాళ్ళు ఎక్కువ నాన్న. ఇంత జరిగినా కూడా నువ్వు మా గురించి మాట్లాడడం మానేసి మన ఇంటి పనిమనిషి దీపనే మీకు ఎక్కువ అయిందని, ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదని జోష్ణ అంటుంది. అలా దశరథకు జోష్ణకు మధ్య మాట మాట పెరుగుతుంది. జోష్ణ దశరథ పై మాటలు జారుతుంటే సుమిత్ర ఉండలేక జోష్ణ చెంపలు వాయిస్తుంది. మీ నాన్న గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే అసలు సహించేది లేదని హెచ్చరిస్తుంది. నీ హద్దుల్లో నువ్వు ఉండాలని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత జోష్ణ తన గదిలోకి వెళ్ళిపోతుంది. పారిజాతం వెళ్లి ఓదార్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











