Karthika Deepam 2 September 26th: శివన్నారాయణ ఇంట్లో అడుగుపెట్టిన కార్తీక్ - దీప.. జ్యోత్స్నకు సుమిత్ర షాక్

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 25వ తేదీ 472వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు దీపాను తిరిగి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి భోజనాలకు అని పిలిచిన అత్త సుమిత్ర ఇచ్చిన ట్విస్ట్ కు కార్తీక్ బాబు షాక్ అవుతాడు. చేయని నేరాన్ని ఒప్పుకోమని దీపను సుమిత్ర బలవంత పెడుతుంటే కార్తీక్ బాబు అడ్డుకుంటాడు. అప్పటి దీపా తమ రెండు కుటుంబాలు కలిసే అవకాశంగా భావించి తను చేయని నేరాన్ని తనపై వేసుకుంటుంది. సుమిత్రతో దశరథను తానే కాల్చానని ఒప్పుకుంటుంది. కానీ కార్తీక్ బాబు దీప కావాలనే తనపై నేరం వేసుకుంటుందని, నేను అస్సలు ఒప్పుకోనని వెంటనే దీపను ఇంటికి తీసుకొని వెళ్లిపోతాడు. ఇక కార్తీక్ బాబుతో శ్రీధర్ గొడవ పడుతాడు. దీప నిజం ఒప్పుకుంటుంటే ఎందుకు అడ్డుకున్నావని కార్తీక్ బాబును ప్రశ్నిస్తాడు.

కానీ కార్తీక్ బాబు మాత్రం మీకు ఎవ్వరికీ అసలు విషయం తెలియదు. అసలు నిందితురాలు దీప. కాదు దశరథ మామయ్యను దీప కాల్చడం మీరు చూశారా? లేదు కదా? మరి ఎందుకు దీపను తప్పు ఒప్పుకో ఒప్పుకోమని పదే పదే బలవంతం చేస్తున్నారని మండి పడుతాడు. దాంతో శ్రీధర్ కూడా సైలెంట్ అయిపోతాడు. మరోవైపు జ్యోత్స్న దీపను ఇరికించేందుకు దశరథ, సుమిత్ర, శివ నారాయణల ముందు కాస్తా దూకుడుగా మాట్లాడుతుంది. దీప చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఎందుకు సంకోచించిది? దీప తప్పును ఒప్పుకోక పోగా అమ్మ సుమిత్రను ఇరకాటంలో పెట్టింది. ఈ రెండు కుటుంబాలను కలవకుండా చేసిందని జ్యోత్స్న అంటుంది. దాంతో చేయని తప్పును ఎలా దీప ఒప్పుకుంటుంది.

Karthika deepam 2 Serial Today s Episode 473 September 26th 2025

ఇంతకీ నువ్వు చేసిన తప్పును ఒప్పుకుంటావా? అని దశరథ జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు. అసలు ఆరోజు దీప చేతిలోకి గన్ ఎలా వచ్చింది? నువ్వు గన్ ఎందుకు తీశావ్? దీప నిన్ను చంపేంత తప్పు నువ్వు ఏం చేశాంటూ ప్రశ్నలు సంధించాడు. దీంతో జ్యోత్స్న నీ అంత మూర్ఖుడు లేడు నాన్న అని మాట జారుతుంది. దాంతో సుమిత్ర జ్యోత్స్న చెంపలు వాయిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సెప్టెంబర్ 26వ తేదీ 473 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

ఉదయాన్నే శౌర్య స్కూల్‌కి వెళ్లదని కార్తీక్‌తో చెబుతుంది దీప. ఆ మాటలు విన్న కార్తీక్.. ఎందుకు రౌడీ స్కూల్‌కి వెళ్లనని అంటున్నావ్ అని అడుగుతాడు. దానికి కారణం మీరే నాన్న.. మా ఫ్రెండ్స్ బాగా చదువుతున్నారు, వాళ్లకి వాళ్ల పేరెంట్స్ చెబుతున్నారని అంటుంది శౌర్య. మీరిద్దరూ నాకు చెబుతున్నారా? మీరు నాతో హోం వర్క్ చేయిస్తున్నారా అని నిలదీస్తుంది. మీరు ఇప్పుడు బిజీ బిజీ అని బాధపడుతుంది శౌర్య. నీకు ట్యూషన్ పెట్టిస్తానని కార్తీక్ చెప్పగా.. ఏం వద్దని, నన్ను చూసి మా ఫ్రెండ్స్ నవ్వారని, వాళ్ల ముందు నేను స్కూల్‌కి ఎలా వెళ్లగలనని అడుగుతుంది. అందుకే నేను స్కూల్ మానేస్తానని, వాళ్లు నన్ను అవమానించారని, ఏడిపించారని .. నేను స్కూల్‌కి వెళ్లనని తేల్చి చెబుతుంది శౌర్య.

ఇంతలో కార్తీక్‌కు జ్యోత్స్న ఫోన్ చేసి చెక్ పంపిస్తున్నావా? క్యాష్ పంపిస్తున్నావా? అని అడుగుతుంది. చెక్ ఏంటీ? క్యాష్ ఏంటీ అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. నిన్న మా ఇంట్లో నీకు జరిగిన అవమానానికి మీరు ఎలాగో రాలేరని, రాకపోతే పది కోట్లు కట్టాలని.. ఇది మన మధ్య ఉన్న అగ్రిమెంట్ అని గుర్తుచేస్తుంది జ్యోత్స్న. నువ్వు ఎలాగూ రావు కాబట్టి అమౌంట్ ఎలా పంపిస్తున్నావో అడుగుతున్నానని అంటుంది. మేం రాము అని నీతో చెప్పలేదు కదా అని కార్తీక్ అనగా.. నేను మళ్లీ ఆ ఇంటికి రాలేనని నీతో చెప్పాలని అనుకున్నానని, జ్యోత్స్న చాలా తెలివైనదని నేను అనుకున్న విషయం అడగటానికి నీకు కాల్ చేసిందని అనుకుంటుంది దీప.

మీకున్న ఆత్మాభిమానాలు, ఆత్మగౌరవాలు ఇవన్నీ వదిలేసి మా ఇంటికి వస్తారా? బావ అని అడుగుతుంది జ్యోత్స్న. నీకు జరగకూడని అవమానం జరిగిందని, మళ్లీ మా వాళ్ల ముఖాలు ఎలా చూస్తారని నిలదీస్తుంది. ఆమెను కాల్‌లోనే ఉంచి.. నువ్వు స్కూల్‌కి ఎందుకు వెళ్లనని అంటున్నావని శౌర్యను అడుగుతాడు కార్తీక్. స్కూల్‌లో నాకు అవమానం జరిగిందని అందుకే వెళ్లనని అంటున్నానని చెబుతుంది శౌర్య. మనం పడిపోతే కొందరు, ఏడిపించి కొందరు నవ్వుతారని.. మనం నవ్వితే ఆ కొంతమందికి నచ్చదని, కడుపు మంటతో రగిలిపోతారని సెటైర్లు వేస్తాడు కార్తీక్.

ఒక దేవుడే అందరికీ నచ్చనప్పుడు నువ్వు అందరికీ నచ్చాలని అనుకోవడం మూర్ఖత్వమని శౌర్యతో అంటూ జ్యోత్స్నకు కౌంటర్ ఇస్తాడు. నేను మూర్ఖుల గురించి పట్టించుకోనని, అర్ధమైందా రౌడీ అని అడుగుతాడు కార్తీక్. మూర్ఖులంటే ఎవరు అని శౌర్య అడగ్గా.. వాళ్ల పని వాళ్లు చేసుకోకుండా మనల్ని పడగొట్టాలని చూసేవాళ్లు అని చెబుతాడు కార్తీక్. ఆ మాటలతో మండిపడ్డ జ్యోత్స్న.. కూతురిని అడ్డుపెట్టుకుని కార్తీక్ నాకు క్లాస్ పీకుతాడా? అని మండిపడుతుంది. మేం వస్తున్నామని బావ నిర్ణయం తీసుకున్న తర్వాత రాం అని ఎలా చెబుతామని దీప బాధపడుతుంది.

మనం ఎవరి గురించి పట్టించుకోకూడదని, చేయాల్సిన పనిని చేసుకుంటూ పోవాలని శౌర్యకి చెబుతాడు కార్తీక్. తప్పు చేస్తే ఒప్పుకోవాలి అన్నప్పుడు అమ్మ కూడా తప్పుకి ఒప్పుకోవాలి కదా అని అంటుంది శౌర్య. మన నిజాయితీయే మనల్ని కాపాడుతుందని కార్తీక్ అంటాడు. టిఫిన్ చేయమన్నా దీప చేయకపోవడంతో రాత్రి నువ్వు ఏం తినలేదు, ఇప్పుడు కూడా ఏం వద్దా? నీ నిరాహారదీక్ష పూర్తి కాలేదా అని దీపపై మండిపడతాడు కార్తీక్. మా ఇంట్లో తింటానని చెప్పి తప్పించుకుంటుంది దీప.

కార్తీక్ - దీపల కోసం శివన్నారాయణ ఎదురుచూస్తుంటాడు. లోపలికి వెళ్లబోతున్న వారిద్దరినీ పెద్దాయన గుమ్మం దగ్గర ఆపుతాడు. మీరు ఈ ఇంట్లో పనిచేయాల్సిన అవసరం లేదని, వెళ్లిపోమ్మని తేల్చిచెబుతాడు శివన్నారాయణ. మేం ఏమైనా తప్పు చేశామా? అని కార్తీక్ అడగ్గా.. నిన్న జరిగిన దానికి మీరు ఈరోజు పనిలోకి రారని అనుకున్నానని అంటాడు శివన్నారాయణ. వీళ్లకి గుండె ధైర్యం ఎక్కువ, పైగా అవమానాల్ని పట్టించుకోని ఆదర్శ పనివాళ్లని, ప్రళయం వచ్చినా ఆగరని సెటైర్లు వేస్తుంది పారిజాతం.

నా భార్య తప్పు చేసిందని మీరు కూడా నమ్ముతున్నారా? అని కార్తీక్ అడగ్గా.. నా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడని చెబుతాడు శివన్నారాయణ. నా వల్ల ఇకపై ఏ సమస్యా రాదని దీప చెప్పబోతుండగా.. మిమ్మల్ని వెళ్లిపోమనడానికి కారణమే నువ్వని అంటాడు శివన్నారాయణ. పనిచేస్తే ఎదురుపడాలని, అది కొందరినీ ఇబ్బందిపడొచ్చని.. అగ్రిమెంట్ గురించి మీరు బాధపడొద్దు, నేను జ్యోత్స్నతో మాట్లాడతానని అంటాడు పెద్దాయన. మేం ఎక్కడికి వెళ్లమని కార్తీక్ చెప్పగా.. నీ భార్యను ఇంటి దగ్గర దించేసి నువ్వు రా అని తేల్చిచెబుతాడు శివన్నారాయణ.

ఇంతలో జ్యోత్స్న వచ్చి దీప, బావ ఎవరు అనుకున్నావ్? బావ సంగతి పక్కనపెడితే, దీప ఎవ్వరికీ భయపడే రకం కాదని అంటుంది. కానీ నీ మాటలకు కట్టుబడి వీళ్లు వెళ్లిపోయేలా ఉన్నారని చెబుతుంది. తట్టుకుని నిలబడాలంటే, ఫోన్‌లో కథలు చెప్పడం కాదు..తట్టుకుని నిలబడే ధైర్యం ఉండాలని అంటుంది జ్యోత్స్న. ఫోన్‌లో కథలు చెప్పడం ఏంటీ? అని శివన్నారాయణ అడగ్గా.. పెద్ద మేడం గారు ఏదో ఒకటి అంటూనే ఉంటారని, మీరేం పట్టించుకోవద్దని చెబుతాడు కార్తీక్. మేం హాయిగా వర్క్ చేసుకుంటాం.. ఎవరినీ ఇబ్బంది పెట్టమని అంటాడు. దాంతో పెద్దాయన సరేనని అంటాడు.

ఏదైనా అనుభవంతోనే తెలుస్తుందని, ఆల్‌ ది బెస్ట్ అంటూ జ్యోత్స్న సెటైర్లు వేస్తుంది. పెద్ద మేడం ఆల్ ది బెస్ట్ చెప్పారంటే ఏదో పెద్ద ప్లానే వేశారని కార్తీక్ అంటాడు. మీ కారణంగా అది తన్నులు తినిందని, దశరథ్‌కి సుమిత్రకి మధ్య గొడవ జరిగిందని.. సుమిత్రను సపోర్ట్ చేస్తూ దశరథ్‌ను జ్యోత్స్న ఏదో అందని దాంతో సుమిత్ర లాగిపెట్టి కొట్టిందని జరిగినది చెబుతుంది పారిజాతం. ఇదంతా మీ వల్లేనని, ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని మండిపడుతుంది. దాంతో వెళ్లిపోదామని దీప చెప్పగా.. ఇది మన ఇల్లు, మనమే సమస్యను చక్కదిద్దాలని, ముందు మీ నాన్నతో మాట్లాడమని చెబుతాడు కార్తీక్.

ఆడవాళ్లకి భర్తే లోకమని.. అందరూ వెలేసినా భర్త తోడుగా ఉంటే చాలని, అదే భర్తే దూరం పెడితే తట్టుకోలేరని దశరథ్‌కు చెబుతుంది దీప. మీరు సుమిత్ర అమ్మగారిని దూరం పెట్టారని, ఒక టైం తర్వాత కోపం చల్లారిపోవాలని అంటుంది. కానీ నా కారణంగా సుమిత్ర అమ్మగారు బాధపడుతున్నారని, నా కారణంగా మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని బాధపడుతుంది దీప. నా కోపం నా భార్య మీద కాదని, ఆమె చేసిన తప్పు మీద అని తేల్చిచెబుతాడు దశరథ్. నా భార్య మనసు బంగారమని, దానికి మకిలి పట్టింది దానిని నేను వదిలిస్తున్నానని చెబుతాడు. ఈ మాటలు విన్న సుమిత్ర బాధపడి వెళ్లిపోతుండగా జ్యోత్స్న ఆపుతుంది. దీపను ఎందుకొచ్చావ్? అని అడిగి బయటికి గెంటేయమని తల్లికి చెబుతుంది జ్యోత్స్న. డాడీని ఎదిరించి మాట్లాడటం నా తప్పేనని, కానీ దీనికి కారణం ఆ దీపేనని చెబుతుంది. దాంతో మండిపడ్డ సుమిత్ర.. దీప మాట్లాడిన దాంట్లో తప్పులేదని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X