Karthika Deepam 2 October 9th: దాస్‌తో శివన్నారాయణకి దొరికిపోయిన జ్యోత్స్న ... నిప్పు రాజేసిన కార్తీక్
Photo Courtesy: JioHotstar
అగ్రిమెంట్ రద్దు చేసుకునే అవకాశం వచ్చినా ఎందుకు వదులుకుంటున్నావని కార్తీక్‌ని నిలదీస్తుంది కాంచన. కార్తీక్ బాబు ఏం చేసినా ఆలోచించే చేస్తాడని, త్వరలోనే దీప - కార్తీక్‌లు రెండు కుటుంబాలని కలుపుతారని అంటుంది అనసూయ. సుమిత్ర కూతురు ఎవరంటూ పారును కన్‌ఫ్యూజ్ చేస్తుంది దీప. దాంతో టెన్షన్ పడ్డ జ్యోత్స్న.. దీపకి తన పుట్టుక గురించి నిజం తెలిసిపోయిందని డౌట్ వచ్చి నేరుగా తన అసలు తండ్రిని కలుస్తుంది.
నేను దీపకి నిజం చెప్పలేదని , ఆ రోజు బిడ్డల్ని మార్చేటప్పుడు ఇంకెవరైనా చూసి ఉండొచ్చని తండ్రి చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్న, ఆమె తండ్రి మాట్లాడుకోవడం చూసిన కాశీ .. నాన్న దగ్గరికి అక్క ఎందుకు వచ్చింది? ఏం మాట్లాడిందని ఆలోచిస్తాడు. సుమిత్ర- దశరథలని కలపాలని దీప ట్రై చేస్తుంది. పగిలిన కాఫీ కప్పులాగే నాకు నా భార్య మీదున్న నమ్మకం పగిలిపోయిందని.. అది తిరిగి అతకదని చెబుతాడు దశరథ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 9వ తేదీ 484వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కారులో వెళ్తుండగా శ్రీధర్ ఇంటికి వెళ్దామని, దాస్‌ని చూడాలని ఉందని కార్తీక్‌కి చెవిలో చెబుతుంది పారు. మీ ఇద్దరి గుసగుసలేంటీ అని శివన్నారాయణ అడుగుతాడు. దాంతో కార్తీక్ అసలు విషయం చెబుతాడు. నీ కొడుకుని చూడాలని అనుకుంటున్నావ్? దాంట్లో తప్పేముందని అంటాడు శివన్నారాయణ. దారిలో వెళ్తుండగా సడెన్‌గా కార్తీక్ బ్రేక్ వేస్తాడు. ఏం జరిగిందని శివన్నారాయణ అడగ్గా.. కలవాల్సిన వారు కళ్లముందే కనిపించడంతో బ్రేక్ వేశానని అంటాడు. ఎవరు వాళ్లు అని శివన్నారాయణ ప్రశ్నించగా.. దాస్ మావయ్య, జ్యోత్స్న అని చెప్పడంతో పారు, శివన్నారాయణలు షాక్ అవుతారు. దీపే సుమిత్ర - దశరథ్‌ల కూతురన్న విషయం చెప్పొద్దని దాస్ దగ్గర జ్యోత్స్న మాట తీసుకుంటుండగా శివన్నారాయణ షాక్ అవుతాడు.
ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? అని శివన్నారాయణ అడగడంతో జ్యోత్స్న, దాస్‌లు షాక్ అవుతారు. మీరు ఆఫీస్‌కి వెళ్లారని అనుకున్నానని అంటాడు కార్తీక్. నా లాగే దాస్‌ని చూడాలని వచ్చిందని పారు చెప్పగా.. అలా అయితే ఇంట్లో మాట్లాడుకుంటారు కానీ, రోడ్డు మీద అది కూడా తల మీద చేతులు వేసుకుంటారా? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. బావ మాటలకి తాతకి నా మీ అనుమానం వచ్చేలా ఉందని జ్యోత్స్న భయపడుతుంది. దాస్ మావయ్య చేయి నీ తల మీద ఎందుకుంది? అని కార్తీక్ అడుగుతాడు. నేను కూడా పోలీసుల లాగా సీన్ రీక్రియేట్ చేస్తా.. పెద్ద మేడం గారు ఏదో విషయం చెప్పమని, దాస్ మావయ్యని అడిగారని.. వరుసకు బాబాయ్ కాబట్టి నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు అని అంటుందని చెబుతాడు కార్తీక్.
కార్తీక్‌కి అన్ని విషయాలు తెలుసు కదా? నాతో నిజం చెప్పొద్దని అన్నాడు కదా? అనుకుంటాడు దాస్. ఇక్కడేం జరుగుతుంది? దాస్‌తో నువ్వెందుకు రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నావ్? దాస్ దగ్గర ఏం ఒట్టు వేయించుకుంటున్నావని నిలదీస్తాడు శివన్నారాయణ. చెప్పమంటావా జ్యోత్స్న అని దాస్ అడగ్గా.. ఆమె టెన్షన్ పడుతుంది. కార్తీక్ కూడా చెప్పమని అనడంతో పారు, జ్యోత్స్నలకు ముచ్చెమటలు పడతాయి. జ్యోత్స్న గురించి మీకు నేనేం చెప్పలేనని అంటాడు దాస్. కాశీకి కానీ, మీకు కానీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే బాధపడొద్దు.. నాతో చెప్పమని జ్యోత్స్న అడిగిందని, నేను వద్దు అనేసరికి తన మీద ఒట్టు అని చెప్పిందని అంటాడు దాస్. ఆ మాటలతో పారు, జ్యోత్స్న రిలీఫ్ అవుతారు. ప్రస్తుతానికి తప్పించుకున్నా.. ఎన్నాళ్లో నిజం దాయలేమని అనుకుంటాడు దాస్.
జ్యోత్స్న దాస్ బాబాయ్ దగ్గర ఏం మాట్లాడటానికి వచ్చిందని కార్తీక్‌ను అడుగుతుంది దీప. ఇంట్లో జరుగుతున్న విషయాలు, మన ప్రవర్తన చూసి నిజం తెలిసిపోయిందన్న భయం జ్యోత్స్నలో మొదలైందని అంటాడు కార్తీక్. నిజం తెలియాలంటే ఒకటి పారు చెప్పాలి? రెండు దాస్ మావయ్య చెప్పాలి.. పారు ఎలాగూ చెప్పదు, దాస్ మావయ్య మంచోడు కాబట్టి ఎక్కడ నోరు జారతాడోనన్న భయం జ్యోత్స్నలో ఉంటుందని అంటాడు కార్తీక్. దాస్ మావయ్య ఇన్నాళ్లూ వాళ్ల అమ్మకోసం నిజం దాచాడు, ఇప్పుడు మన కోసం దాస్తున్నాడని చెబుతాడు. ఈ రోజు జ్యోత్స్న రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని, పారు గుండెకాయ గొంతులోకి వచ్చిందని అంటాడు. దాస్ మావయ్యకి నేను సైగ చేయడంతో ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాడని అంటాడు కార్తీక్.
తాతయ్య ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదలడని, ఆయనకి అనుమానం మొదలైందని, ఎవరు ఎంత కవర్ చేసినా జ్యోత్స్న దాస్ మావయ్య చేతిని తన నెత్తి మీద వేసుకుని మాట్లాడే విజువల్ ఏదైతే ఉందో అది మాత్రం తాత మైండ్‌లో నుంచి పోదని అంటాడు కార్తీక్. నీ పుట్టుక గురించి నిజం తెలిస్తే దానిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతాడు కార్తీక్. మా అమ్మని నాన్నని ఎలా కలాపాలా? అని ఆలోచిస్తుంటే, ఇప్పుడు నువ్వు చెప్పింది వింటే భయంగా ఉందని అంటుంది దీప. కార్తీక్ అన్నట్లుగానే జ్యోత్స్న, దాస్ ఎందుకు కలిశారా? అన్నదాని గురించి దశరథతో మాట్లాడతాడు శివన్నారాయణ. తల మీద ఒట్టు వేసుకుని మరి ఎందుకు మాట్లాడాడు, దాస్ ఏదో చెప్పాడు కానీ అతని మాటలు నమ్మేలా లేవని అంటాడు.
దాస్‌ని జ్యోత్స్న చంపాలనుకుందని.. అలా ఎందుకు చేసిందో నాకు ఇంత వరకు సరైన ఆధారం దొరకలేదని మనసులో అనుకుంటాడు దశరథ. ఈ మధ్య జ్యోత్స్న ప్రవర్తన అనుమానంగా ఉందని.. దీప, కార్తీక్, దాస్ గురించి ఆలోచిస్తుంది కానీ తన గురించి, కంపెనీ గురించి ఆలోచించడం లేదని చెబుతాడు శివన్నారాయణ. ఈరోజు ఆఫీసులో బోర్డ్ మెంబర్స్‌తో మీటింగ్ ఉంది కదా? నాకు నిర్ణయం తీసుకునే టైం వచ్చిందని కొడుకుతో చెబుతాడు. నాన్న ఏదో పెద్ద నిర్ణయమే తీసుకోబోతున్నాడని దశరథ అనుకుంటాడు. వీరి మాటలను చాటుగా విన్న పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. జ్యోత్స్నని బయటికి తీసుకెళ్లిన పారు.. దాస్ దగ్గరికి వెళ్లేటప్పుడు నాకు చెప్పొచ్చు కదా అని అంటుంది.
నేను దాస్ కూతురిని అన్న విషయం కార్తీక్ బావకి తెలిసిపోయిందని అంటుంది జ్యోత్స్న. నీ తాత దగ్గర నిన్ను ఇరికించడానికి వాడు దొరికిన అవకాశాన్ని వాడుకుంటున్నాడని అంటుంది పారు. నాకు దీపను చూసినా అనుమానంగానే ఉందని, నేను అడిగిన దానికి దాస్ నిజం చెప్పే టైంకి మీరొచ్చారని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. తాత అంతలా నిలదీసినా నా కొడుకు అసలు నిజాలు చెప్పలేదు కానీ నోరు జారి ఉంటే నువ్వు ఎవరన్న సంగతి తెలిసిపోయేదని భయపడుతుంది పారు. ఎవ్వరికీ చెప్పొద్దని నీ కొడుక్కి నువ్వు చెప్పలేవా? అని జ్యోత్స్న మండిపడుతుంది. నువ్వు అసలైన కూతురివి కాదన్న నిజం తెలిసినా, నిన్ను ఏం చేయకుండా ఉండాలన్నా నువ్వు ఒక పనిచేయాలని చెబుతుంది పారు. పెళ్లి చేసుకోవాలని అంటుంది.
తాళి కట్టడానికి బావ రెడీ అయితే కట్టించుకోవడానికి నేను కూడా రెడీ అని చెబుతుంది జ్యోత్స్న. నువ్వు ఇలాంటి కండీషన్లు పెట్టావంటే కన్యగానే మిగిలిపోతావని అంటుంది పారు. బావతో తాళి ఎలా కట్టించుకోవాలో నాకు తెలుసని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఈ ఇంటికి వారసురాలివి కాదన్న విషయం తెలిసే సమయానికి పెళ్లి చేసుకుని వేరొక ఇంటికి కోడలిగా వెళ్లిపోతే ఈ ఆస్తి నీది అవుతుందని, పెద్దగా నష్టం జరగకుండా బయటపడతావని హెచ్చరిస్తుంది జ్యోత్స్న. నేను బావని తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోనని తేల్చేస్తుంది. అసలైన వారసురాలు బతికే ఉందని దాస్ చెప్పాడని, అది గనుక వస్తే ఎలా అని ప్రశ్నిస్తుంది పారు. నేను ఆలోచించాల్సింది నా పోస్ట్ గురించి అంటుంది జ్యోత్స్న. బోర్డ్ మీటింగ్‌లో కంపెనీ నష్టాల గురించి దశరథ చెబుతాడు. ఫుడ్ సరిగా లేదని సోషల్ మీడియాలో ఎవడో వీడియో పెట్టడం, అది వైరల్ కావడం వల్ల చాలా డ్యామేజి జరిగిందని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










