Karthika Deepam 2 October 30th: ఒక్కటైన సుమిత్ర- దశరథ.. శివన్నారాయణ దెబ్బకు జ్యోత్స్నకు ముచ్చెమటలు
Photo Courtesy: JioHotstar
గుడిలో దశరథను, కార్తీక్‌ను చూసిన సుమిత్ర షాకై పక్కనే దాక్కొంటుంది. దశరథ, సుమిత్రల పేరు మీద అర్చన చేయించమని కార్తీక్ చెప్పగా.. ఇప్పుడే ఒకరు అదే పేర్లతో అర్చన చేయించారని చెబుతారు పంతులు గారు. మనిషిని పోలిన మనుషులు ఉన్నట్లే.. పేరును పోలిన పేర్లు ఉంటాయని అంటాడు కార్తీక్. దీప ఇంటికి పోలీసులతో వచ్చిన జ్యోత్స్న.. మర్యాదగా మా మమ్మీ ఎక్కడుందో చెబుతావా లేదా అని నిలదీస్తుంది. ఈ దీప మా డాడీని షూట్ చేసిందని, మా మమ్మీకి ఈమెకు పడదని, ఖచ్చితంగా మా మమ్మీని ఈ దీపే కిడ్నాప్ చేసుంటుందని పోలీసులను అరెస్ట్ చేయమని చెబుతుంది జ్యోత్స్న.
నువ్వు మా నాన్న కాళ్లు ఎందుకు పట్టుకున్నావని కాశీని స్వప్న నిలదీస్తుంది. నేను మావయ్య గారి ఆశీర్వాదం తీసుకున్నానని అబద్ధం చెప్పి తెచ్చుకుంటాడు. వీలైనంత త్వరగా ఉద్యోగం సంపాదించాలని అనుకుంటాడు. సుమిత్రను దూరం పెట్టి తప్పు చేశానని కార్తీక్‌తో చెప్పుకుని బాధపడతాడు కార్తీక్. మీ అత్తయ్యకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనని చెబుతాడు. వారిద్దరి మాటలు విన్న సుమిత్ర బాధపడుతుంది. ఇంతలో సుమిత్రను కార్తీక్ చూస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 30వ తేదీ 502వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
గుడిలో దశరథతో మాట్లాడుతున్న కార్తీక్.. సుమిత్రను చూస్తాడు. దాంతో ఆమె టెన్షన్ పడుతూ తాను వచ్చిన విషయాన్ని చెప్పొద్దని సైగలు చేస్తుంది. నేను చాలా పెద్ద తప్పు చేశానని దశరథ అంటుండగా.. అత్త నీ కోసం తప్పకుండా వస్తుందని, నేను వాటర్ బాటిల్ తీసుకుని వస్తానని చెబుతాడు కార్తీక్. కొడుకు, కోడల్ని కలపాలని ప్లాన్ చేసిన శివన్నారాయణ... కార్తీక్ ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతలో పారిజాతం వచ్చి కాఫీ ఇచ్చి మీకు సుమిత్ర ఎక్కడుందో తెలుసా? అని అడుగుతుంది. మనకి ఎవ్వరికీ కనిపించని ప్లేస్‌లో ఉందని అంటాడు శివన్నారాయణ. పోనీ దశరథ ఎక్కడికి వెళ్లాడో చెప్పండి అని అడుగుతుంది.. అది కూడా నాకు తెలియదని తప్పించుకుంటాడు పెద్దాయన.
మరి మీకేం తెలుసు అని ప్రశ్నిస్తుంది పారు.. పక్కవాడి సంసారంలో దూరకూడదని తెలుసు, పుల్లలు పెట్టి చెడగొట్టకుండా ఉండటం తెలుసు, సోది మాట్లాడకుండా ఉండటం తెలుసు అని అంటాడు శివన్నారాయణ. మీకు అన్ని తెలిసినా ఏమీ తెలియనట్లు ఉంటారని మండిపడుతుంది పారు. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందని శివన్నారాయణ అడగ్గా.. ఆఫీసుకు వెళ్లిందని చెబుతాడు శివన్నారాయణ. దానికి 24 గంటలు కంపెనీని ఎలా పైకి తీసుకురావాలా అని అంటుంది పారు. ఆ మాట నిజమైతే కంపెనీ ఎప్పుడో లాభాల్లో నడిచేదని సెటైర్లు వేస్తాడు శివన్నారాయణ. ఎక్కడ ఏ అరాచకాలు చేస్తుందో ఏంటో అని అనుకుంటాడు పెద్దాయన.
గుడిలో నుంచి నేను వెళ్లిపోతానని కార్తీక్‌తో అంటుంది సుమిత్ర. ఆయన మాటలన్నీ విన్నాను కాబట్టే వెళ్లిపోతున్నానని చెబుతుంది. ఆయనకి నేను ఎదురుపడితే నా భర్త నా ముందు తలదించుకుని నిలబడతాడని, అది నాకు ఇష్టం లేదని అందుకే వెళ్లిపోతున్నానని అంటుంది. ఇంట్లో నుంచి బయటికొచ్చాక నాకు ఏదో అయ్యిందని, నేను ఏం చేస్తున్నానో నాకే అర్ధం కావడం లేదని అంటుంది సుమిత్ర. నేను చేసిన తప్పేంటో నాకు తెలుస్తోంది.. మరి ఎలా నేను ఆయనకి ఎదురుపడగలను అని ప్రశ్నిస్తుంది సుమిత్ర. ఆయన నన్ను చూసేలోపు నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని అంటుండగా దశరథ పిలుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్లొద్దని, నన్ను క్షమించమని అంటాడు. దాంతో సుమిత్ర ఏడుస్తుంది.
మీరిద్దరూ మాట్లాడుకోండి... సతీ సమేతంగా మీ ఆశీర్వాదం తీసుకుంటామని అంటాడు కార్తీక్. అత్తని దీపే తీసుకొచ్చిందని కార్తీక్ చెప్పగా.. నన్నెవరూ తీసుకురాలేదని నేనే వచ్చానని అంటుంది సుమిత్ర. నేను ఎవ్వరికీ చెప్పకుండా వచ్చానని చెబుతుంది. దాంతో దీప గురించి కార్తీక్ టెన్షన్ పడతాడు. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో.. ఇది మా ఫ్యామిలీ ఇష్యూ అని మా ఇంటి దగ్గరే తేల్చుకుంటామని అంటుంది కాంచన. దీపను పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చేసరికి ఇది ఫ్యామిలీ ఇష్యూ అయిపోయిందా అని అడుగుతుంది జ్యోత్స్న. ఇప్పటికే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావని ఇక్కడితో ఆపేయమని వార్నింగ్ ఇస్తుంది దీప. సుమిత్ర గారు ఎక్కడున్నారో నాకు తెలియదని అంటుంది.
మర్యాదగా కూర్చోబెట్టి అడిగితే నిజం చెప్పవని, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని పోలీసులకు చెబుతుంది జ్యోత్స్న. దాంతో దీప, కాంచనలు షాక్ అవుతారు. సెల్‌లో వేసి మీ లేడీ కానిస్టేబుల్స్‌తో సౌండ్ బయటికి వచ్చేలా కొట్టమని చెబుతుంది. ఇంతలో దీపకు కార్తీక్ ఫోన్ చేయడంతో ఫోన్ లాక్కుని మాట్లాడుతుంది జ్యోత్స్న. కాంచన, దీపల వాయిస్ వినిపించడంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. దీప మా మమ్మీని కిడ్నాప్ చేసిందని, నేను పోలీస్ స్టేషన్‌లో నీ భార్య మీద కంప్లయంట్ చేసి ఎస్ఐ గారిని తీసుకుని మీ ఇంటికి వెళ్లాను.. ఎక్కడో ఇన్ఫర్మేషన్ లీకైంది, అందుకే మా మమ్మీని కనిపించనీయకుండా దాచేశారని అంటుంది జ్యోత్స్న. దాంతో నీ భార్యను అరెస్ట్ చేయించి స్టేషన్‌కు తీసుకొచ్చానని, నా కోడలు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని అత్త కూడా వచ్చేసిందని చెబుతుంది.
ఇప్పుడు అత్త నీ భార్య పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారని, ఎంత అడిగినా నిజం చెప్పడం లేదని.. అసలు ఈ కథకు జగన్నాటక సూత్రధారివి నువ్వే కదా అంటుంది జ్యోత్స్న. 10 నిమిషాల్లో నా భార్య నా ఇంట్లో ఉండాలని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నువ్వు 20 నిమిషాల తర్వాత కాల్ చేసినా నీ భార్య వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే ఉంటుందని, నువ్వు మా మమ్మీని తీసుకొచ్చి నీ భార్యను తీసుకెళ్లమని అంటుంది జ్యోత్స్న. నీ భార్య అన్నందుకు థ్యాంక్స్ అంటాడు కార్తీక్. నువ్వు శివన్నారాయణ గారి మనవరాలివే అయితే, సుమిత్ర - దశరథల కూతురివే అయితే ఓ పావుగంట అక్కడే ఉండటానికి ట్రై చేయ్ అంటాడు కార్తీక్. నేను ఇక్కడే వెయిట్ చేస్తానని పొగరుగా ఆన్సర్ ఇస్తుంది జ్యోత్స్న.
నువ్వు కాంచన ఇంట్లోనే ఉంటే కార్తీక్ నాకెందుకు చెప్పలేదని దశరథ అడగ్గా.. నేనే ఎవ్వరితోనూ చెప్పొద్దని అంటుంది సుమిత్ర. నన్ను వదిలేసి ఎలా వెళ్లిపోతావు? జరిగిన దానిలో ఇద్దరి తప్పూ ఉందని అంటాడు దశరథ. గుడిలో నా కంటే ముందే అర్చన చేయించింది నువ్వేనని అనుకున్నానని చెబుతాడు. మీ మాటలు విన్నాక మీ ముందుకు రావడానికి భయం వేసిందని అంటుంది సుమిత్ర. ఇంకా మనం చాలా దూరం ప్రయాణించాలి, కూతురి పెళ్లి చేయాలని అంటాడు దశరథ. ఇంతలో కార్తీక్ వచ్చి మీరిలా మనసు విప్పి మాట్లాడుంటే ఎప్పుడో కలిసిపోయేవారని అంటాడు కార్తీక్. నువ్వు నన్ను చాలా చీట్ చేశావని అంటాడు దశరథ.
కార్తీక్ ఏం చేస్తాడోనని జ్యోత్స్న వెయిట్ చేస్తుంది.. ఇచ్చిన గడువు అయిపోయింది వీళ్ల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని జ్యోత్స్న చెబుతుంది. ఇంతలో పారు వచ్చి ఆగండి అంటుంది. ఆమె వెనకాలే శివన్నారాయణ రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మమ్మీని దీప కిడ్నాప్ చేసి ఇంట్లో దాచిందని, అందుకే అరెస్ట్ చేయించానని అంటుంది. సుమిత్ర అన్న మాట వింటే దీప మీద కేసు పెట్టేస్తావా అని మండిపడతాడు శివన్నారాయణ. మీరు ఈ శివన్నారాయణ కూతురిని స్టేషన్‌కు తీసుకొస్తారా అని పోలీసులపై ఫైర్ అవుతాడు శివన్నారాయణ. నా కొడుకు ఇంట్లో లేని టైం చూసి నా కోడలిని స్టేషన్‌కు తీసుకొస్తే నేను వచ్చానని అంటుంది కాంచన. శెభాష్.. ఈ శివన్నారాయణ కూతురివి అనిపించుకున్నావని మెచ్చుకుంటాడు పెద్దాయన. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










