Karthika Deepam 2 Weekly: వైరాని కోలుకోలేని దెబ్బకొట్టిన కార్తీక్... సీఈవోగా రాజీనామా చేయనన్న జ్యోత్స్న
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు 481 నుంచి 486 ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

అక్టోబర్ 6వ తేదీ 481వఎపిసోడ్ లో..
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రెస్టారెంట్‌పై రైడ్ చేసిందని తెలుసుకున్న దశరథ, శివన్నారాయణలు హడావుడిగా వేలం పాట నుంచి వెళ్లిపోతారు. అయితే దశరథకి డౌట్ వచ్చి కార్తీక్‌ని ఇక్కడే ఉండమని చెబుతాడు. వేలం పాట మొదలవ్వగానే జ్యోత్స్నను రెచ్చగొట్టి 10 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని 20 కోట్ల వరకు తీసుకెళ్తాడు వైరా. వేలం పాడుకుంటూ వెళితే శివన్నారాయణ కంపెనీ నష్టాల్లోకి వెళ్లిపోతుందని.. అప్పుడు జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌ని కొట్టేయాలన్న వైరా ప్లాన్‌ని కార్తీక్ ఊహిస్తాడు. దాంతో వెంటనే ఫేక్ కాల్ చేయించడంతో జ్యోత్స్న వేలం పాట నుంచి వెళ్లిపోతుంది. జ్యోత్స్నని రెచ్చగొట్టడానికి 20 కోట్ల నష్టానికి వేలం పాట పాడాల్సి రావడంతో వైరా రగిలిపోతాడు. వేలం పాటలో నేను గెలవకుండా కార్తీక్ అడ్డుపడ్డాడని జ్యోత్స్న ఇంటిలో గొడవ చేస్తుంది. దాంతో శివన్నారాయణ, పారు, సుమిత్రలు కార్తీక్- దీపలపై మండిపడతారు. ఆ అగ్రిమెంట్ తీసుకొచ్చేయ్.. వీళ్లు ఈ ఇంట్లో ఉండకూడదని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
అక్టోబర్ 7వ తేదీ 482వ ఎపిసోడ్‌లో..
వేలంలో నువ్వు ఓడిపోయేలా చేసి, నీ పరువు తీసిన కార్తీక్‌ను ఏం చేయాలని జ్యోత్స్నను శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. మెడపట్టి బయటికి గెంటేయాలని చెప్పడంతో నోరు మూయమంటూ మనవరాలిపై శివన్నారాయణ మండిపడతాడు. కార్తీక్ లేకపోయుంటే మన కంపెనీకి ఈరోజు 11 కోట్లు నష్టం వచ్చేదని చెప్పడంతో పారు, సుమిత్రలకు ఏం అర్ధం కాదు. దాంతో జరిగింది ఏంటో వీళ్లకి అర్ధం అయ్యేలా చెప్పమని దశరథకు చెబుతాడు శివన్నారాయణ. వెంటనే వైరాకి ఫోన్ చేసి ఏం జరిగిందో వైరా నోటీతోనే చెప్పిస్తాడు దశరథ. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వాళ్లు మన రెస్టారెంట్‌పై రైడ్ చేయడం వెనుక జ్యోత్స్న పనేనని దశరథ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అగ్రిమెంట్ బ్రేక్ చేయాలంటే కార్తీక్ నీకు 10 కోట్లు కట్టాలి కాబట్టి... వాడు నీకు, మన కంపెనీకి 11 కోట్ల నష్టం రాకుండా ఆపాడని చెబుతాడు శివన్నారాయణ. మా కుటుంబానికి ఎంతో మంచి చేసి నువ్వు అవమానాలు పడొద్దని ఈ ఇంటిలో నుంచి వెళ్లిపోమ్మని కార్తీక్‌కు చెబుతాడు శివన్నారాయణ. నాకు, జ్యోత్స్నకి మధ్య అగ్రిమెంట్ జరిగిందని... ఆమె చెబితేనే నను వెళ్తానని కార్తీక్ తేల్చేస్తాడు. కార్తీక్ లాంటి తెలివైన వ్యక్తిని వదులుకోనని అంటుంది జ్యోత్స్న.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 8వ తేదీ 483వ ఎపిసోడ్‌లో..
వంటగదిలో భర్తకు స్వీట్ తినిపించి సంతోషం వ్యక్తం చేస్తుంది దీప. ఇంతలో సుమిత్ర వచ్చి కార్తీక్ దగ్గర మాట తీసుకుని అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేయడం లేదు, మా ఇల్లు ఎందుకు వదిలి వెళ్లడం లేదో చెప్పమంటుంది. నీ కూతురి కోసమే ఇదంతా చేస్తున్నానని చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఇంటి దగ్గర ఇదే అంశంపై కొడుకుని అడుగుతుంది కాంచన. కార్తీక్ బాబు ఏం చేసినా ఆలోచించే చేస్తాడని, త్వరలోనే దీప - కార్తీక్‌లు రెండు కుటుంబాలని కలుపుతారని చెల్లెలికి నచ్చచెబుతుంది అనసూయ. సుమిత్ర కూతురు ఎవరంటూ పారును టెన్షన్ పడుతుంది దీప. దాంతో దీపకి తన పుట్టుక గురించి నిజం తెలిసిపోయిందని అనుమానంతో దాస్‌ని కలుస్తుంది జ్యోత్స్న. నేను దీపకి నిజం చెప్పలేదని , ఆ రోజు బిడ్డల్ని మార్చేటప్పుడు ఇంకెవరైనా చూసి ఉండొచ్చని తండ్రి చెప్పడంతో జ్యోత్స్న ఉలిక్కిపడుతుంది. జ్యోత్స్న, ఆమె తండ్రి మాట్లాడుకోవడం చూసిన కాశీ షాక్ అవుతాడు. సుమిత్ర- దశరథలని కలపాలని దీప ట్రై చేస్తుంది.
అక్టోబర్ 9వ వ తేదీ 484వ ఎపిసోడ్‌లో..
శివన్నారాయణ, కార్తీక్, పారులు కారులో గుడికి వెళ్తుండగా.. పారుకి తన కొడుకుని చూడాలని అనిపిస్తుంది. దాంతో కారును శ్రీధర్ ఇంటికి పోనివ్వమని చెబుతాడు పెద్దాయన. ఇంతలో దాస్‌తో నడిరోడ్డుపై జ్యోత్స్న మాట్లాడుతూ.. తన తండ్రిని నిజం చెప్పొద్దని తలపై ఒట్టు వేయించుకుంటుంది . అది చూసిన శివన్నారాయణ ఇక్కడేం జరుగుతుందని జ్యోత్స్నని ప్రశ్నిస్తాడు. ఊహించని పరిణామంతో పారు, జ్యోత్స్నలకి ముచ్చెమటలు పోస్తాయి. దాంతో ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటడు దాస్. జ్యోత్స్నలో భయం మొదలైందని అందుకే దాస్ మావయ్యని కలిసిందని దీపకి చెబుతాడు కార్తీక్. దాస్- జ్యోత్స్నలు ఎందుకు కలుసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారని దశరథ్‌ని అడుగుతాడు శివన్నారాయణ. నువ్వు పెళ్లి చేసుకుంటేనే కానీ ఈ సమస్యలకు చెక్ పడదని జ్యోత్స్నకి చెబుతుంది పార్ధు. నేను పెళ్లంటూ చేసుకుంటే అది బావనే అని తేల్చేస్తుంది జ్యోత్స్న.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 10వ తేదీ 485వ ఎపిసోడ్‌లో..
బోర్డ్ మీటింగ్ మొదలవ్వగానే కంపెనీ నష్టాల గురించి చెబుతాడు దశరథ. దాంతో మేం ఇకపై కొనసాగాలని అనుకోవడం లేదని, కంపెనీలో ఉన్న 50 శాతం వాటాను మరొకరికి అమ్మేయాలని అనుకుంటున్నట్లు చెబుతారు బోర్డు మెంబర్స్. ఎవరికి అమ్మాలని అనుకుంటున్నారని దశరథ అడగ్గా ఇంతలో అక్కడికి వైరా ఎంట్రీ ఇస్తాడు. అతనిని చూసి శివన్నారాయణ, దశరథ, జ్యోత్స్నలు షాక్ అవుతారు. మీరు ఎవరికైనా షేర్స్ అమ్ముకోవచ్చు కానీ ఇతనికి మాత్రం వద్దని చెబుతాడు దశరథ.. జ్యోత్స్న కూడ మా దగ్గర 50 శాతం షేర్లు ఉన్నాయని, మీ షేర్లు మీ ఇష్టమని చెబుతుంది. కంపెనీ చేజారిపోయేలా ఉందని మేనేజర్ వెళ్లి కార్తీక్‌కి చెబుతాడు. దాంతో కార్తీక్ తనని లోపలికి పిలవాల్సిందిగా స్లిప్ మీద రాసి శివన్నారాయణకి ఇవ్వమని అంటాడు. అది చూసిన శివన్నారాయణ వెంటనే కార్తీక్‌ని లోపలికి పిలుస్తాడు. బోర్డ్ రూల్స్ గురించి కార్తీక్ భయపెట్టడంతో బోర్డ్ మెంబర్స్ ముగ్గురూ షేర్స్ అమ్మాలనే తన ఆలోచనని విరమించుకుంటారు. కానీ సీఈవోగా జ్యోత్స్న ఉండకూడదని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతారు. అందరూ కలిసి తనని ఫూల్‌ని చేశారని జ్యోత్స్న అవమానంతో రగిలిపోతుంది.
అక్టోబర్ 11వ తేదీ 486వ ఎపిసోడ్‌లో..
శివన్నారాయణ కంపెనీని దక్కకుండా చేసిన కార్తీక్‌పై రగిలిపోతాడు వైరా. నీతో నాకు ఎలాంటి వైరం లేదు, కానీ నీ మావయ్య దశరథతో చాలా తేల్చుకోవాలని దానికి నువ్వు అడ్డు పడొద్దని వార్నింగ్ ఇస్తాడు. పడితే నీ కారును లారీ గుద్దొచ్చు, నీ ఫ్యామిలీ మీద దాడి జరగొచ్చని భయపెడతాడు. నువ్వు నా ఫ్యామిలీ జోలికి వస్తే పోతురాజుని నరికినట్లు నరుకుతానని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. బోర్డ్ మీటింగ్‌లో తనకు జరిగిన అవమానం గురించి గొడవ చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ లేకపోయుంటే ఈరోజు కంపెనీ మన శత్రువు జోలికి వెళ్లిపోయేదని చెబుతాడు శివన్నారాయణ. నెక్ట్స్ బోర్డ్ మీటింగ్‌లో కొత్త సీఈవోని అనౌన్స్ చేస్తామని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు నాకు తండ్రిగా ఏం చేయలేదని కాశీ అనడంతో దాస్ తన కొడుకుని కొట్టబోతాడు. ఇంతలో శ్రీధర్ వచ్చి తండ్రి కొడుకులికి నచ్చచెబుతాడు. దీప, జ్యోత్స్నల పుట్టుక గురించి దాస్‌ని నిలదీస్తాడు శ్రీధర్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications










