Karthika Deepam 2 Weekly: శౌర్య పాప పుట్టిన రోజు.. కార్తీక్ బాబుపై శివ నారాయణ ఫైర్.. దీపాకు సుమిత్ర షాక్

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు 463 నుంచి 468వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే...

సెప్టెంబర్ 15వ తేదీ ఎపిసోడ్ లో..
కార్తీక్ బాబు, దీపాలకు శౌర్య పాప షాక్ ఇస్తుంది. తన పుట్టిన రోజు అని కూడా గుర్తు పెట్టుకోనంతగా మీరిద్దరూ బిజీ అవుతున్నారని మండి పడుతుంది. ఇవ్వాళ కచ్చితంగా నేను మీతోనే ఉంటానని చెబుతుంది. మీరు తాత శివ నారాయణ ఇంటికి వెళ్తే నేను కూడా మీ వెంటనే వస్తానని అంటుంది. దాంతో శౌర్యపాపకు ఒక కండీషన్ పెడుతారు. నువ్వు మాతో రావాలంటే శివ నారాయణ తాతకు గానీ, ఆ ఇంట్లో ఎవ్వరికీ కూడా నీ పుట్టిన రోజు అనే విషయాన్ని అస్సలు చెప్ప కూడదని హెచ్చరిస్తారు. అందుకు శౌర్య పాప కూడా సరేనని చెబుతుంది. దాంతో శౌర్య పాపను కూడా తమ వెంటనే తీసుకొని వెళ్తారు. ఇక శౌర్య పాప అక్కడికి వెళ్లగానే శివ నారాయణ, దశరథ షాక్ అవుతారు. ఇవ్వాళ స్కూల్ ఉండగా నువ్వు డుమ్మా కొట్టి ఇక్కడి ఎలా వచ్చావని ప్రశ్నిస్తారు. మేమే తీసుకొచ్చామని కార్తీక్ బాబు దీపా ఇద్దరు బదులిస్తారు. కానీ శివ నారాయణకు మాత్రం శౌర్య పాప సడెన్ గా స్కూల్ మానేయడంపై అనుమానం వస్తుంది. ఎందుకు శౌర్య పాప స్కూల్ మానేసి ఇంటికి వచ్చిందనే విషయాలను తెలుసుకోవాలని అనుకుంటాడు.

Karthika deepam 2 Serial Weekly Episodes September 15th to September 20th

సెప్టెంబర్ 16వ తేదీ ఎపిసోడ్‌లో..
శౌర్య పాపకు శివ నారాయణ ఒక డ్రాయింగ్ బుక్ ను తీసుకొని వచ్చి ఇస్తాడు. శౌర్య పాప తన పుట్టిన రోజును తెలియజేసేలా డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. ఆ డ్రాయింగ్స్ ను చూసిన శివ నారాయణకు ఇవ్వాళ శౌర్య పాప పుట్టిన రోజు అనే సంగతి తెలిసిపోతుంది. ఇక స్పష్టం చేసుకునేందుకు పారుజాతాన్ని పిలిచి ఒక పనిచేయాలని చెబుతాడు. నువ్వు వెంటనే కాంచనకు ఫోన్ చేసి అసలు ఎందుకు శౌర్య పాప ఇలా స్కూల్ మానేసిందో అడగమని అంటాడు. దాంతో శౌర్య పాప ఎందుకు స్కూల్ కు వెళ్ల లేదని కాంచనకు పారుజాతం ఫోన్ చేసి అడుగుతుంది. కాస్తా పౌరుషం వచ్చేలా కాంచనతో పారుజాతం మాట్లాడుతుంది. దీంతో కాంచన శౌర్య పాప పుట్టిన రోజు కాబట్టి ఇవ్వాళ స్కూల్ కు వెళ్లలేదని చెబుతుంది. ఆ విషయం తెలుసుకున్న శివ నారాయణ ఇక కార్తీక్ బాబు, దీపాలపై ఫైర్ అవుతాడు. మరోవైపు కార్తీక్ బాబు దీపాలు శౌర్య పాప పుట్టిన రోజు అనే విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియక ముందే ఇంట్లో నుంచి తీసుకొని వెళ్లిపోదామని అనుకుంటారు. ఇక వెంటనే సగం పూట పనులు చేసి మేము వెళ్లిపోతున్నామని శివ నారాయణతో ఇద్దరూ చెబుతారు.

సెప్టెంబర్ 17వ తేదీ ఎపిసోడ్‌లో..
శౌర్య పాప పుట్టిన రోజు అనే విషయం చెప్పకుండా కార్తీక్ బాబు, దీపాలు ఇంటికి వెళ్తున్నామని చెప్పడంతో శివ నారాయణ మండి పడుతాడు. అసలు మీరు ఇంత త్వరగా ఎందుకు ఇంటికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. కానీ కార్తీక్ బాబు దీపా మాత్రం చెప్పడానికి ఒప్పుకోరు. వేరే పని ఉందని, మేము వేరే పనికి కుటుంబం మొత్తంగా వెళ్లాల్సి ఉందని చెబుతారు. అదే ఆ పనిఏంటో చెప్పొచ్చు కదా అని శివ నారాయణ మళ్లీ అడుగుతాడు. ఇంకేమీ లేదని చెబుతారు. దాంతో శివ నారాయణ ఫైర్ అవుతాడు. ఇక శౌర్య పాప పుట్టిన రోజు అనే విషయాన్ని తను వేసిన డ్రాయింగ్స్ ద్వారా శౌర్య పాపతోనే చెప్పిస్తాడు శివ నారాయణ. ఈ విషయాన్ని ఎందుకు దాచాలని చూశారని ప్రశ్నిస్తాడు. మరోవైపు దశరథ కూడా ఈ విషయాన్ని ఎందుకు దాచాలని చూశారని అడుగుతాడు. మాకే చెప్పడం ఇష్టం లేదని చెబుతాడు.

సెప్టెంబర్ 18వ తేదీ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్నతో దీపాకు ఘర్షణ ఏర్పడుతుంది. శౌర్య పాప పుట్టిన రోజును ఇంట్లో చెప్పకపోవడానికి కారణం జ్యోత్స్ననే అని దీపా అంటుంది. ఇప్పటికే శౌర్య ను ఇంటికి తీసుకువస్తుంటే మీకు దగ్గర కావడం కోసం తీసుకువస్తున్నామని అంటున్నారు. ఇక ఇప్పుడు శౌర్య పాప పుట్టిన రోజు అని చెబితే సింపథి కోసం ఇలాంటి నాటకం ఆడుతున్నామని నిందలు వేస్తారని చెప్పలేదని దీపా అందరికీ చెబుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత తిరిగి వాళ్ల ఇంటికి వెళ్లిపోతారు కార్తీక్ బాబు, దీపా. ఇక ఇంటి దగ్గర శౌర్య పాప పుట్టిన రోజుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తూ ఉంటారు.

సెప్టెంబర్ 19వ తేదీ ఎపిసోడ్‌లో..
శౌర్య పాప కార్తీక్ బాబు నుంచి ప్రామీస్ తీసుకుంటుంది. తన పుట్టిన రోజు ఎక్కడి వెళ్లొద్దని అంటుంది. అందుకు కార్తీక్ బాబు కూడా నేను అస్సలు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లను రౌడీ అని ప్రామీస్ చేస్తాడు. ఇదే సమయంలో జ్యోత్స్న నుంచి కార్తీక్ బాబుకు ఫోన్ వస్తుంది. జ్యోత్స్న మాట్లాడుతూ వెంటనే నువ్వు మా ఇంటికి రావాలి బావ అని అంటుంది. ఎందుకు ఏంటని అడగకుండా ఉన్న ఫలంగా ఇక్కడికి రావాలని చెబుతుంది. ఇది నా మాట కాదు శివ నారాయణ మాట అని అంటుంది. దాంతో కార్తీక్ బాబు వెంటనే శివ నారాయణ ఇంటికి వెళ్తాడు. దాంతో కార్తీక్ బాబును మళ్లీ వాళ్లు తిరిగి తీసుకొని కార్తీక్ బాబు ఇంటికే తీసుకొని వస్తారు. శౌర్య పాప పుట్టిన రోజుకు శివ నారాయణ కుటుంబం మొత్తం రావడంతో కాంచన, దీపా, శౌర్య, అనసూయ కూడా సంతోషిస్తారు.

సెప్టెంబర్ 20వ తేదీ ఎపిసోడ్‌లో..
శివ నారాయణ శౌర్య పాప పుట్టిన రోజు సందర్భంగా వస్తూ అన్నీ వస్తువులు, కేక్ లు, గిఫ్ట్ లు కూడా తీసుకొని వస్తాడు. దీంతో అందరూ సంతోషిస్తారు. ఇక శౌర్య పాప పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఇంటికి తిరిగి వెళ్తుండగా సుమిత్ర కార్తీక్ బాబును నీ ప్రాణదాతను పరిచయం చేయమని అడుగుతుంది. కానీ కార్తీక్ బాబు చాలా సంభాషణ తర్వాత దీపానే నా ప్రాణదాత అని చెబుతాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక దీపాకు థ్యాంక్స్ చెబుతారు. ఇదే సమయంలో సుమిత్ర దీపాను క్షమించాలని కార్తీక్ బాబు అంటాడు. కానీ సుమిత్ర ట్విస్ట్ ఇస్తుంది. మీరందరూ మా ఇంటికి వస్తే అక్కడ నేను క్షమాపణలు కోరుతానని చెబుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X