Karthika Deepam 2 Weekly: కార్తీక్ బాబుకు షాక్చిన జ్యోత్స్న.. జ్యోత్స్నకు వంటక్క ఊహించని ఎదురు దెబ్బ
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు 457 నుంచి 462వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే...
సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో..
కార్తీక్ బాబు దీపాల పెళ్లిలో తాళిబొట్టును మాయం చేస్తుంది సుమిత్ర. ఇక ఆ విషయం కాస్తా బయట పడుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. సుమిత్ర ఇలాంటి పని చేయడం ఏంటని ఆశ్చర్యపోతారు. ఇక సుమిత్ర ప్రవర్తనకు వదిన కాంచన, కార్తీక్ బాబు, దీపా ఎంతో బాధ పడుతారు. సుమిత్రను ఎంతగానో నమ్మితే చివకు ఇలా చేసిందని మండి పడుతారు. మరోవైపు సుమిత్ర చేసిన తప్పుకు దశరథ సుమిత్రపై పైర్ అవుతాడు. వెంటనే నువ్వు వెళ్లి కాంచన, కార్తీక్ బాబు, దీపాలకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తాడు. కానీ సుమిత్ర అస్సలు చెప్పనని అంటుంది. దాంతో దశరథ నువ్వు నా చెల్లి కాంచనకు క్షమాపణలు చెప్పే వరకు నీతో నేను అస్సలు మాట్లాడనని, నిన్ను క్షమించనూ లేనని అంటాడు. ఇక దశథర, సుమిత్ర మాట్లాడుకోవడం లేదనే విషయం శివ నారాయణకు కూడా తెలుస్తుంది. దాంతో ఎందుకు మాట్లాడుకోవడం లేదని ఆలోచిస్తూ ఉంటాడు.

సెప్టెంబర్ 9వ తేదీ ఎపిసోడ్‌లో..
దీపను ఉద్దేశించి జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని ఘటనలు మర్చిపోలేము కదా తాతయ్య. అందుకే అమ్మ నాన్న మధ్య మనస్ఫార్థాలు వచ్చాయని జ్యోత్స్న తాత శివ నారాయణతో అంటుంది. అందరూ దీపా, కార్తీక్ బాబులాగా చిలకా గోరింకల్లాగా ఉండలేరు కదా అని అంటుంది. దాంతో శివ నారాయణ స్పందిస్తూ అందరూ అలానే ఉండాలి జ్యోత్స్న అని అంటాడు. ఏదైనా గొడవలు ఉంటే ఇంట్లో వరకే ఉండాలి కానీ, ఇలా బయటికి వరకు రానివ్వకుండా చూసుకోవాలని అంటాడు. మరోవైపు శ్రీధర్ కార్తీక్ బాబుకు ఫోన్ చేస్తాడు. తనను అస్సలు పట్టించుకోవడం లేదని కార్తీక్ బాబును ప్రశ్నిస్తాడు. నీ అవసరం ఒడ్డెక్కిన తర్వాత ప్లేట్ తిప్పేశావని అంటాడు. నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? మాస్టర్ అని గట్టిగా క్లాస్ పీకుతాడు. ఇకపైనైనా నువ్వు అందరూ మెచ్చుకునేలా మారాలని కోరుకుంటున్నానని అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్నపై రెస్టారెంట్ ఉద్యోగులు ఫిర్యాదు చేస్తారు. కంపెనీ లాస్ లో ఉందని మేం ఉద్యోగాలు చేయలేమని చెబుతారు. దాంతో శివ నారాయణ జ్యోత్స్నపై మండి పడుతాడు.
సెప్టెంబర్ 10వ తేదీ ఎపిసోడ్‌లో..
నువ్వు కంపెనీకి సీఈవోగా మారినప్పటి నుంచి ఒక్క రోజు కూడా లాభాలు రాలేదని శివ నారాయణ జ్యోత్స్న పై ఫైర్ అవుతాడు. అసలు నీ వల్ల కంపెనీకి పూర్తిగా చెడ్డ పేరు వస్తోందని మండి పడుతాడు. ఇక నీకు 1 నెల సమయం ఇస్తున్నామని, ఆలోపు కంపెనీని లాభాల్లోకి తీసుకురాకపోతే నీ సీఈవో పదవీలోకి మరొకరు వస్తారని హెచ్చరిస్తాడు. మరోవైపు జ్యోత్స్నపై సుమిత్ర కూడా సీరియస్ అవుతుంది. మన చేతిలో పవర్ ఉంది కదా అని ఇష్టారీతినా నిర్ణయాలు తీసుకోవద్దని అంటుంది. మనకు అవి నిర్ణయాలు, కానీ మన నిర్ణయాలే ఉద్యోగులకు జీవితాలు అని మర్చిపోవద్దని అంటుంది. తప్పును ఒప్పుకొని వెంటనే సరిదిద్దుకోవాలి, లేదంటే నీపై ఉన్న నమ్మకం పోతుంది. ఒక్కసారి నమ్మకం పోతే నువ్వు ఎన్ని చేసినా మళ్లీ తిరిగి రాదు అని హెచ్చరిస్తుంది. మరోవైపు కాశీ ఉద్యోగం పోతుంది. ఆ షాక్ లో కాశీ యాక్సిడెంట్ చేస్తాడు. దాంతో పోలీసులకు చిక్కుతాడు. ఈ విషయాన్ని కాశీ భార్య దిల్ వెంటనే వచ్చి ఇంట్లో వాళ్లకు చెబుతుంది.
సెప్టెంబర్ 11వ తేదీ ఎపిసోడ్‌లో..
కాశీ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని ఎలాగైనా వెంటనే తన భర్తను కాపాడాలని తండ్రి శ్రీధర్ తో మోర పెట్టుకుంటుంది దిల్. మరోవైపు కావేరి కూడా తమ అల్లుడు కాశీని రక్షించాలని లేందంటే తమ కూతురు జీవితం నాశనం అవుతుందని అంటుంది. ఇప్పుడు కాశీని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించకపోతే కాశీని పోలీసులు జైలుకు కూడా పంపిస్తారని కంగారు పడుతారు. వీళ్లు ఇంతలా కన్నీళ్లు పెట్టుకుంటున్నా శ్రీధర్ మాత్రం పెద్దగా స్పందించడు. దాంతో వాళ్లు శ్రీధర్ పై ఫైర్ అవుతారు. ఇక శ్రీధర్ వీళ్ల ఫోన్లు తీసుకొని బయటికి వెళ్లిపోతాడు. మరోవైపు దశరథ, సుమిత్ర మాట్లాడుకోకుండా దూరంగా ఉండటం సరికాదని శివ నారాయణ ఇద్దరికీ నచ్చజెపుతాడు. క్షమాపణలు చెప్పే వరకు తగ్గెదేలే అని దశరథ తేల్చి చెబుతాడు. ఇక కాశీని కాపాడమని దాసు జ్యోత్స్నకు ఫోన్ చేసి బతిమిలాడుతాడు. దాంతో జ్యోత్స్న కాశీని జైలుకు పంపించాలని ప్లాన్ వేస్తుంది.
సెప్టెంబర్ 12వ తేదీ ఎపిసోడ్‌లో..
తన భర్త జైలులో ఉండటంతో దిల్ ఏడుస్తూ ఇంట్లో కూర్చొంటుంది. ఇక తల్లి కావేరి దిల్ ను ఓదార్చుతూ ఉంటుంది. నువ్వేమీ ఏడ్వకు స్వప్న కాశీని ఎలాగైనా బయటికి తీసుకొద్దామని అంటుంది. ఇదే సమయంలో శ్రీధర్ ఇంటికి తిరిగి వస్తాడు. మేం ఇక్కడ ఏడుస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్లావని దిల్, కావేరి ఇద్దరు శ్రీధర్ పై మండి పడుతారు. దాంతో శ్రీధర్ సైలెంట్ గా ఉంటాడు. ఆయన వెనకాలే కాశీ, దాసు ఇంటి లోపలికి వస్తారు. కాశీ ఇంటికి తిరిగి రావడంతో దిల్, కావేరి సంతోషిస్తారు. ఇక శ్రీధర్ కాశీని విడిపించాడని తెలుసుకుని ఆనంద పడుతారు. ఇక మరోవైపు సుమిత్ర జ్యోత్స్నపై మరోసారి ఫైర్ అవుతుంది. దీపాపై కావాలని లేనిపోని మాటలు చెబుతున్నా జ్యోత్స్న నోరును మూయిస్తుంది సుమిత్ర. దీప విషయంలో ఏదైనా అనాల్సి ఉంటే నేను అంటాను. నువ్వు ఆ రెస్టారెంట్ గురించి చూడమని చెప్పి హెచ్చరిస్తుంది.
సెప్టెంబర్ 13వ తేదీ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్నకు దీపా ఊహించని షాక్ ఇస్తుంది. తన మెడలో నుంచి జ్యోత్స్న తెంచేసిన తాళిని తిరిగి జ్యోత్స్నకే ఇస్తుంది. అంతే కాదు నీతో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, మున్ముందు వాటి లెక్కలు తేలిపోతాయని హెచ్చరిస్తుంది. మరోవైపు కార్తీక్ బాబు కూడా జ్యోత్స్నపై మండి పడుతాడు. నీ తాళిబొట్టు నీకు వచ్చింది కదా అని అంటాడు. దాంతో జ్యోత్స్న మరింత ఫైర్ అవుతుంది. నన్ను ఇంతలా అవమానించిన నిన్ను, దీపాను అస్సలు మనశాంతిగా ఉండనివ్వను అని సవాల్ చేస్తుంది. ఇంట్లో వాళ్లందరికీ నన్ను దూరం చేస్తున్నావ్ కదా, అంతకంతకు అనుభవిస్తారని హెచ్చరిస్తుంది. మరోవైపు శ్రీధర్ మారడంతో దీపా, కావేరి చాలా సంతోషిస్తారు. ఆయన ఇంతలా మారడానికి కారణం కార్తీక్ అన్నయ్యే అయ్యి ఉంటాడని అనుకుంటారు.


Click it and Unblock the Notifications











