twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam దీప.. తెల్లారే లోపే.. నీ బతుకు తెల్లారుతుంది.. మరోసారి మోనిత పైశాచికత్వం

    |

    కార్తీకదీపం సీరియల్‌లో గుట్టుచప్పుడు కాకుండా జీవితాన్ని గడుపుతున్న డాక్టర్ మోనిత మరోసారి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకొన్నది. కార్తీక్‌కు తనకు మధ్య ఉన్న దీపను అడ్డు తప్పించడానికి పథకం రచించింది. తనను చంపడానికి కుట్ర పన్నింది. ఇలా ఉండగా, గతంలో మోనితతో కలిసి కుట్రలు చేసిన దుర్గ తెరపైకి వచ్చాడు. పోలీస్ స్టేషన్‌లో కార్తీక్‌ను ఏసీపీ రోషిణి ఇంటరాగేషన్ చేసింది. తాజా ఎపిసోడ్‌ 1124లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

    నేను నేరం చేయలేదు అంటూ

    నేను నేరం చేయలేదు అంటూ

    లాకప్‌లో ఉన్న కార్తీక్‌ను ఏసీపీ రోషిణి ఇంటరాగేషన్ మొదలుపెట్టింది. నాకు ప్రాణాలు పోయడమే తెలుసు. కానీ ప్రాణాలు తీయడం రాదు. నా వెనుక ఏదో కుట్ర జరిగింది. ఓ నిర్దోషికి కూడా నేరం చేశాడని ఒప్పుకొన్నాడంటే ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఆలోచించిస్తారని అనుకొంటాను. నేను నేరం చేయలేదు. మోనిత అనేక నేరాలు చేసింది.

    ఆమెకు పడాల్సిన శిక్ష నాకు వేస్తానని అంటున్నారు. ఇది ఎంత వరకు కరెక్టో మీకే వదిలేస్తున్నాను అని కార్తీక్ చెప్పాడు. మీరు నిర్దోషనే విషయం నాకు వదిలివేయడం వెనుక మీ మీద మీకు ఇంత ఉన్నత భావం ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు. మీరు మహాభావుడివి కాదు కదా.. ఆడ, మగ మధ్య బంధం గురించి అపార్ధం చేసుకొనే పురుషొత్తముడివి కదా.. మీ వ్యక్తిత్వం గురించి నాకు చెబుతావేమిటి రోషిణి గట్టిగా క్లాస్ పీకింది.

    మోనితను గర్బవతి చేసి.. హత్య అంటూ

    మోనితను గర్బవతి చేసి.. హత్య అంటూ

    మోనిత చేత ప్రేమించబడి ఆ తర్వాత గర్బవతిని చేసి.. పెళ్లి చేసుకొనని హత్య చేసి మీరు ఇక్కడికి వచ్చి పడ్డారు. మైండ్ ఇట్ మిస్టర్ కార్తీక్ అంటూ రోషిణి అంటే.. నిజమే. ఆడ మగ మధ్య స్నేహాన్ని మరోటని భావించి పదేళ్లు భ్రమల్లో బతికాను. ఆలస్యంగా తెలుసుకొని బయటపడ్డాను.

    కానీ ఇంకా తెలుసుకోలేని మూర్ఖుడిని కాను అంటూ కార్తీక్ చెప్పాడు. మోనితతో రిలేషన్‌ను స్నేహంగానే చూశాను. కానీ ఆమె దానికి ప్రేమ అని పేరు పెట్టుకొన్నది. అందులో నా ప్రమేయమేమీ లేదు అంటూ ఏసీపీకి కార్తీక్ ఘాటుగా సమాధానం చెప్పాడు.

    ఫిజికల్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం లేద..

    ఫిజికల్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం లేద..

    కార్తీక్ మాట్లాడే తీరుపై మోనిత ఆగ్రహం వ్యక్తం చేస్తూ. ప్రమేయం లేకున్నా.. ఆమె నోరు విప్పి మీ ఘనకార్యాన్ని ప్రపంచానికి చెప్పే ప్రమాదం ఉందని ఈ హత్య చేసి ఉండొచ్చు కదా అంటూ ఏసీపీ గట్టిగా అరిచింది. మీ పేరు ప్రతిష్టలు దెబ్బ తింటాయని మీరే మోనితను కాల్చి చంపి ఉంటారు కదా.. మీకంటూ ఓ హోదా ఉందని ఫిజికల్ ట్రీట్‌మెట్ ఇవ్వడం లేదు. అది గుర్తుంచుకోమని కార్తీక్‌ను ఏసీపీ రోషిణి హెచ్చరించింది.

    దుర్గ, అంజిని కలిసిన దీప

    దుర్గ, అంజిని కలిసిన దీప

    ఇక కార్తీక్ అరెస్ట్ తర్వాత రౌడీలు దుర్గ, అంజి కలుసుకొన్నారు. అంతలోనే దుర్గ, అంజి ఉన్న ఇంటికి దీప, డ్రైవర్ వారణాసి వచ్చారు. కార్తీక్ హత్య చేసి ఉంటాడా అనే అనుమానాన్ని అందరూ వ్యక్తం చేశారు. కానీ కార్తీక్ హత్య చేసి మోనిత శవాన్ని మాయం చేశాడని ఏసీపీ అంటున్నది అని దీప చెప్పింది. దాంతో ఇంతకు ఆ రోజు ఏం జరిగింది దీపమ్మ అంటూ దుర్గ అడిగాడు. దాంతో మోనిత ఎంతకైనా తెగిస్తుందని ఆ రోజు అర్ధమైంది అని దీప అంటే.. ఆ రోజు మోనిత గురించి అంతా చెప్పినా వినకుండా వెళ్లిపోయాడు. కానీ నా మాట నమ్మకపోవడం మోనితపై ఉన్న ఆయనకు ఉన్న నమ్మకమే అని అంజి చెప్పాడు.

    మోనిత బతికే ఉంటుంది

    మోనిత బతికే ఉంటుంది

    సూర్యాపేటలో షూట్ చేసిన వీడియోను కార్తీక్‌కు చూపించాను. ఆ తర్వాత మోనిత ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. ఆ సమయంలో ఆ ఇంట్లో కట్టిపడేసిన మా పిన్ని ఆ వాదనలు అంతా విన్నారు దీప అంటే.. కచ్చితంగా కార్తీక్ హత్య చేసి ఉండరు అంటూ అంజి గట్టిగా చెప్పాడు. చివరకు మోనిత బతికే ఉంటుంది. ఆ రోజు ఏం జరిగిందో కార్తీక్‌ను పూర్తిగా కనుక్కో. మోనిత బతికే ఉంటుంది. ఆమెను మేము పట్టుకొని వస్తామని అంజి, దుర్గ చెప్పడంతో దీప అక్కడ నుంచి వెళ్లిపోయింది.

    మీకు అందుకే సహాయం చేస్తున్నా..

    మీకు అందుకే సహాయం చేస్తున్నా..

    ఇదిలా ఉండగా, మోనిత ఉంటున్న పాడుబడ్డ ఇంట్లోకి కానిస్టేబుల్ రత్నసీత వెళ్లింది. పోలీస్ స్టేషన్‌లో ఏం జరుగుతున్నదని మోనిత అడిగితే.. కార్తీక్‌ను ఏసీపీ ఇంటరాగేషన్ చేసింది అని రత్నసీత చెప్పింది. అయితే దాని బొంద.. మొదట నాకేదో న్యాయం చేస్తుందని అనుకొన్నా. కానీ ఆమె దీపకే సపోర్ట్ చేసింది అంటూ ఏసీపీ‌పై మోనిత మండిపడింది.

    దాంతో మీరు అక్కకు చేసిన మేలు కారణంగా చట్టానికి వ్యతిరకంగా వ్యవహరిస్తూ మీకు సహాయం చేస్తున్నాను. రేపు నాకు ఏదైనా అయితే అంటూ కానిస్టేబుల్ రత్నసీత ఆందోళన పడింది. నీకేం కాదు రత్నసీత.. ఒకవేళ పోతే నీ ఉద్యోగం పోతుంది. నీకు వచ్చే జీతం కంటే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం మా హాస్పిటల్‌లో ఇప్పిస్తాను అంటూ కానిస్టేబుల్ రత్నసీతకు మోనిత ధైర్యం చెప్పింది.

    Recommended Video

    Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
    దీప.. చవడానికి రెడీగా ఉండు అంటూ మోనిత

    దీప.. చవడానికి రెడీగా ఉండు అంటూ మోనిత

    తన ముందు కూర్చొని ఉన్న కానిస్టేబుల్ రత్నసీతను చూస్తూ.. నన్ను చూడు. డబ్బు, హోదా, పరపతి అన్నీ ఉన్నాయి. కానీ ఏం లాభం. అన్నీ వదిలేసి ఏమీ లేని దానిలా ఉంటున్నాను. ఎందుకోసం.. నా కార్తీక్ గురించే.. కాబట్టి నీవు కూడా నా కోసం ఆలోచించు. నాకు సహకరించు.

    నేను నిన్ను చూసుకొంటాను అంటూ మోనిత చెబితే సరే అని రత్నసీత బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత మోనిత కోపంతో ఊగిపోతూ.. దీప.. రేపు తెల్లవారే లోపే నీ బతుకు తెల్లారిపోతుంది. చవడానికి రెడీగా ఉండు అంటూ మోనిత మరోసారి తనలోని పైశాచికత్వాన్ని బయటపెట్టింది.

    English summary
    Karthika Deepam August 21st August's Episode preview. Latest episode of 1124 goes once again with emotional content.Karthik arrested in Monita murder case.In this occasion, emotional scenes took place between Karthik, Hima, Shourya and Deepa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X