For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 7: ఏడో సీజన్ లో 'కార్తీక దీపం' మోనిత!.. బిగ్ బాస్ కు కలిసొచ్చిన సీరియల్! అందుకే తొలగించారా?

  |

  బుల్లితెరపై అనేక షోలు వచ్చినప్పటికీ అత్యధికంగా పాపులారిటీ సంపాందించుకున్న వాటిలో బిగ్ బాస్ ఒకటి. ఈ రియాలిటీ షో ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటుంది. అయితే ఈ షో సెలబ్రిటీషో గా వర్ణిస్తూ ముందుకొచ్చింది. దానికి అనుగుణంగానే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ అలాగే అందరూ సినీ సెలబ్రిటీలతో సాగింది. ఆ తర్వాత వచ్చిన సీజన్ నుంచి బుల్లితెర తారలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయర్స్, సీరియల్ యాక్టర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ముగిసిన ఆరో సీజన్ లో కూడా కార్తీక దీపం ఫేమ్ కీర్తి భట్ కంటెస్టెంట్ గా చేరి టాప్ 3లో చోటు దక్కించుకుంది. ఇప్పుడు ఏడో సీజన్ కు అదే సీరియల్ నుంచి మోనితను అంటే శోభా శెట్టిని తీసుకోనున్నారని తెలుస్తోంది.

  2017లో ప్రారంభమై..

  2017లో ప్రారంభమై..

  బుల్లితెరపై రకరకాల కాస్సెప్టులతో షోలు వస్తున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. ప్రస్తుతం సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. 2017లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటివరకు ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది.

  డిజాస్టర్ గా ఆరో సీజన్..

  డిజాస్టర్ గా ఆరో సీజన్..


  ఈ సీజన్లు అన్ని ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. సరికొత్త ప్రయోగాలు, ప్రైజ్ మనీ కోతలు ఏం చేసినా సరే మిగతా సీజన్లతో పోల్చుకుంటే ఈ ఆరో సీజన్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఫేక్ ఎలిమినేషన్స్, ఫేవరిజం వంటి తదితర కారణాలతో తీవ్రమైన నెగెటివిటీని మూటగట్టుకుంది.

  బీబీ నిర్వాహకుల నిర్ణయం..

  బీబీ నిర్వాహకుల నిర్ణయం..

  ఇలా పలు కారణాలతో బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ కావడంతో ఏడో సీజన్ ను ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో బిగ్ బాస్ మేనేజ్ మెంట్ టీమ్ ఉందని తెలిసింది. ఇందులో భాగంగానే దీన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే దీన్ని వచ్చే ఏడాది జూలైలోనే మొదలు పెట్టాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  సీరియల్ హీరో గ్రీన్ సిగ్నల్..

  సీరియల్ హీరో గ్రీన్ సిగ్నల్..

  బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ను ప్రారంభించడమే కాకుండా అందులోకి కంటెస్టెంట్స్ గా టాప్ యాక్టర్స్ ని తీసుకోవాలని బీబీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇందులో భాగంగానే జానకి కలగనలేదు సీరియల్, మిస్టర్ పెళ్ళాం వెబ్ సిరీస్ హీరో అమర్ దీప్ చౌదరిని ఇప్పటికే ఓకే చేశారని టాక్ వినిపిస్తోంది. కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు అమర్ దీప్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బయట టాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోక సీరియల్ నటిని బిగ్ బాస్ టీమ్ తీసుకోనుందట.

  సీరియల్ కు ఉన్న క్రేజ్ తోనే..

  సీరియల్ కు ఉన్న క్రేజ్ తోనే..


  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో కార్తీక దీపంలో హిమగా నటించిన కీర్తి భట్ ను కంటెస్టెంట్ గా తీసుకున్న విషయం తెలిసిందే. మొదట కన్నీళ్లతో హౌజ్ లో గడిపిన కీర్తి భట్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో ఆమె టాప్ 3లో నిలిచింది. కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ తో కీర్తి భట్ కు ఓట్లు ఎక్కువగా పడ్డాయని ఒక టాక్ అయితే వినిపించింది. ఇప్పుడు అదే సీరియల్ లో లేడీ విలన్ గా మెప్పించిన శోభా శెట్టిని కంటెస్టెంట్ గా తీసుకునేందుకు ఆమెను బీబీ టీమ్ అప్రోచ్ అయిందని సమాచారం.

  అభిమానులందరూ చూసే అవకాశం..

  అభిమానులందరూ చూసే అవకాశం..

  తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ తెలుగు 6 డిజాస్టర్ గా నిలవగా దాన్ని భర్తీ చేసే దిశగా ఏడో సీజన్ టీమ్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కార్తీక దీపం మోనితను (శోభా శెట్టి) తీసుకుంటే ఆ సీరియల్ అభిమానులందరూ బిగ్ బాస్ చూసే అవకాశం ఉందని బీబీ టీమ్ భావిస్తోందట.

  ముగిసిన మోనిత క్యారెక్టర్..

  ముగిసిన మోనిత క్యారెక్టర్..

  అయితే బీబీ ఆఫర్ కి శోభా శెట్టి ఒప్పుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే కార్తీక దీపం సీరియల్ లో మోనిత క్యారెక్టర్ ను ముగించారు. తన పాత్రను పూర్తి చేశారని సోషల్ మీడియా వేదికగా శోభా శెట్టి చెప్పుకుని బాధపడింది కూడా. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యేందుకు బిగ్ బాస్ ఆఫర్ మంచి అవకాశం. అందుకే శోభా శెట్టి అంగీకరించే ఛాన్సెస్ ఎక్కువ అని ప్రచారం జరుగుతోంది.

  బిగ్ బాస్ కి కలిసొచ్చే అంశాలు..

  బిగ్ బాస్ కి కలిసొచ్చే అంశాలు..


  మరోవైపు బిగ్ బాస్ కోసమే సీరియల్ లో మోనిత క్యారెక్టర్ ను తీసేశారని మరో వార్త వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇదే కార్తీక దీపం సీరియల్ లోని మరో పాత్ర శౌర్యగా నటించిన అమూల్య గౌడ్ కూడా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా చేసింది. అది ఎందులో అంటే కన్నడ బిగ్ బాస్ తాజా సీజన్ లో అమూల్య గౌడ్ తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది. ఇటు తెలుగులో చెల్లి హిమ అయిన కీర్తి భట్, అటు కన్నడలో అక్క శౌర్య అమూల్య గౌడ్ ఆకట్టుకున్నారు. చూస్తుంటే బిగ్ బాస్ కి కార్తీక దీపం సీరియల్ యాక్టర్స్ బాగా కలిసొచ్చే అంశంలా అనిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu 7 Season Team Approaching Karthika Deepam Serial Actress Shobha Shetty For Participating As Contestant.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X