For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘కార్తీక దీపం’ అర్చనపై నిరుపమ్ షాకింగ్ పోస్ట్: కష్టాల్లో ఉన్నా సాయం చేయలేదని నిందలు

  |

  సాధారణంగా ఎక్కడైనా సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లకు మాత్రమే కోట్ల మంది అభిమానులు ఉంటారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీరియళ్లలో చేసే నటీనటులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఇక, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తర్వాత ఇది ఇంకాస్త ఎక్కువైంది. తమకు నచ్చిన నటీ నటులను దీని ద్వారానే ఫాలో అవుతున్నారు. ఇలా తెలుగు టెలివిజన్‌పై భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న వారిలో బుల్లితెర శోభన్ బాబుగా పేరొందిన నిరుపమ్ పరిటాల ఒకరు. 'కార్తీక దీపం' సీరియల్ ద్వారా అతడు మరింతగా ఫేమస్ అయ్యాడు. ఇక, ఇంటర్నెట్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిరుపమ్.. తాజాగా ప్రముఖ నటి అర్చన అనంత్‌పై షాకింగ్ పోస్ట్ చేస్తూ.. ఆమెపై నిందలు కూడా వేశాడు. ఆ సంగతులు మీకోసం!

  బుల్లితెరపై సందడి చేస్తున్న నిరుపమ్

  బుల్లితెరపై సందడి చేస్తున్న నిరుపమ్

  ప్రముఖ నటుడు ఓంకార్ కుమారుడిగా బుల్లితెరపైకి అడుగు పెట్టాడు నిరుపమ్ పరిటాల. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారి కొన్ని ధారావాహికల్లో నటించాడు. ఇలా వరుస సీరియళ్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ‘చంద్రముఖి' అనే సీరియల్ చేస్తోన్న సమయంలో అందులో హీరోయిన్‌గా చేసిన మంజులను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక, ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత నిరుపమ్ సందడి చేస్తుండగా.. మంజుల మాత్రం యాక్టింగ్‌కు దూరంగా ఉంటోంది.

  బాత్‌టబ్‌లో అందాలు ఆరబోసిన అనన్య నాగళ్ల: సర్‌ప్రైజ్ అంటూ మొత్తం చూపించిన తెలుగు పిల్ల

  కార్తీక దీపంతో నిరుపమ్ క్రేజ్‌ రెట్టింపు

  కార్తీక దీపంతో నిరుపమ్ క్రేజ్‌ రెట్టింపు

  నిరుపమ్ పరిటాలకు యాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఈ కారణంగానే అతడికి అభిమానులు కూడా భారీగా పెరిగారు. ఇక, ‘కార్తీక దీపం' సీరియల్ వల్ల హీరో కార్తీక్ పాత్రలో నటిస్తోన్న మన బుల్లితెర శోభన్ బాబుగా పేరిందిన నటుడు నిరుపమ్ పరిటాల కూడా తన సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. అద్భుతమైన నటనతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నాడు. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్నాడు. అదే సమయంలో పలు ఛానెళ్లలో సీరియళ్లు చేస్తూ హవాను చూపిస్తున్నాడు. దీంతో అతడి పేరు మారుమ్రోగిపోతూనే ఉంది.

  డాక్టర్ బాబుగా అందరి హృదయాల్లో

  డాక్టర్ బాబుగా అందరి హృదయాల్లో

  ‘కార్తీక దీపం' సీరియల్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది అందులో హీరోయిన్‌గా నటిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్ మాత్రమే. మలయాళ పరిశ్రమకు చెందిన ఆమెను.. ఈ సీరియల్ కోసం తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అదిరిపోయే నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఆమెతో పాటే ఇందులో డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్ పరిటాల కూడా మంచి ఆదరణను అందుకుంటున్నాడు. అతడి పాత్రను సొంతం చేసుకున్న తెలుగు అభిమానులు.. మా డాక్టర్ బాబు మా డాక్టర్ బాబు అంటూ సొంత మనిషిలా హృదయాల్లో నిలుపుకున్నారు.

  Paagal Movie Twitter Review: పాగల్‌కు ఊహించని టాక్.. ప్లస్‌లు మైనస్‌లు ఇవే.. మొత్తంగా ఎలా ఉందంటే!

  నిరుపమ్‌కు ఎన్నో రకాల ఫ్యాన్ పేజ్‌లు

  నిరుపమ్‌కు ఎన్నో రకాల ఫ్యాన్ పేజ్‌లు

  పలు ఛానెళ్లలో వరుస సీరియళ్లతో బిజీ బిజీగా గడుపుతున్నప్పటికీ ‘కార్తీక దీపం' హీరో నిరుపమ్ పరిటాల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తరచూ తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను అందులో పంచుకుంటూ ఉంటాడు. అదే సమయంలో సీరియల్ సెట్స్‌లో జరిగిన ఫన్నీ సంఘటనలను కూడా షేర్ చేసుకుంటాడు. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం పోస్ట్ చేస్తుంటాడు. ఇక, ఇందులోనూ అతడికి ఫాలోయింగ్ భారీగానే ఉంది. అందుకే బుల్లితెరపై ఏ నటుడికీ లేనన్ని ఫ్యాన్ పేజీలు నిరుపమ్‌కు మాత్రమే ఉన్నాయి.

  తుపాకీతో హల్‌చల్.. అరెస్ట్ అయ్యాడు

  తుపాకీతో హల్‌చల్.. అరెస్ట్ అయ్యాడు

  ‘కార్తీక దీపం' సీరియల్‌లో మోనిత చేస్తున్న మోసం గురించి కార్తీక్‌కు నిజం తెలిసిపోతుంది. దీంతో ఆమెను చంపడానికి రెడీ అవుతాడు. ఈ క్రమంలోనే తుపాకీ పట్టుకుని వెళ్తాడు. ఆ డమ్మీ గన్ పట్టుకునే నిరుపమ్ పరిటాల సోషల్ మీడియాలో ఇటీవల ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఇప్పుడు దాని వల్లే తాను అరెస్ట్ అయ్యానంటూ ఫన్నీగా పోస్ట్ చేశాడు. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఫలితంగా ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముందుగా ఇది చూసిన వాళ్లంతా అతడు నిజంగానే అరెస్ట్ అయ్యాడని భ్రమపడుతున్నారు.

  పబ్లిక్‌లోనే భర్తతో శ్రీయ శరణ్ రొమాన్స్: అలా రెచ్చగొట్టి మరీ ఘాటు ముద్దులు.. వీడియో వైరల్

  అర్చన అర్చనపై నిరుపమ్ షాకింగ్ పోస్ట్

  అర్చన అర్చనపై నిరుపమ్ షాకింగ్ పోస్ట్

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిరుపమ్ పరిటాల.. ఇటీవల ‘కార్తీక దీపం' సీరియల్ కోసం కటకటాల మధ్యలో ఉన్న నిరుపమ్.. ఆ ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు అందులో అతడి తల్లి పాత్రను చేస్తున్న అర్చన అనంత్‌పై ఈ స్టార్ హీరో షాకింగ్ పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందులో ఆమె ఫొటోను షేర్ చేసిన ఈ బుల్లితెర స్టార్ హీరో.. ఓ అదిరిపోయే క్యాప్షన్‌ను కూడా జోడించాడు. దీంతో ఈ పోస్ట్ తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  కష్టాల్లో ఉన్నా సాయం చేయలేదని నింద

  కష్టాల్లో ఉన్నా సాయం చేయలేదని నింద

  తాజాగా ‘కార్తీక దీపం' సౌందర్య అలియాస్ అర్చన అనంత్‌తో పోలీస్ స్టేషన్‌ సెట్‌లో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నిరుపమ్ పరిటాల. దీనికి ‘అడక్కుండానే డాక్టర్‌ను చేశావ్.. పిలవకుండానే స్టేషన్‌కు వచ్చావ్.. ఇంకా ఎందుకమ్మా నన్ను లోపలే ఉంచావ్? అయినా నువ్వు నాకు నచ్చావ్' అంటూ ఆమెను నిందిస్తూనే ఫన్నీగా పోస్ట్ చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇందులో నిరుపమ్ రాసిన క్యాప్షన్ అదిరిపోయిందని అందరూ అతడిని ప్రశంసిస్తున్నారు. అలాగే, వీళ్లిద్దరి ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Karthika Deepam Hero Nirupam Paritala Very Active In Social Media. Now He Did Shocking Post on Soudarya / Archana Ananth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X