twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam దీప నిద్రిస్తుండగా.. ఇంటికి నిప్పు పెట్టించిన మోనిత

    |

    శౌర్య అలియాస్ జ్వాలా పెద్ద మనిషి కావడంతో ఆమెకు ఎలాగైనా గ్రాండ్‌గా ఫంక్షన్ చేయాలనే ఆలోచనల్లో ఇంద్రుడు పడ్డాడు. ఫంక్షన్‌కు చాలా డబ్బు కావాల్సి ఉండటంతో ఏం చేయాలో తెలియక దొంగతనం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఎదురుగా ఒక వ్యక్తి నుంచి పర్సు కాజేస్తుండటంతో దీప వచ్చి ఇంద్రుడిని పట్టుకొన్నది. ఆటో నడుపుకొనే వాడివి.. దొంగతనం ఎందుకు చేస్తున్నావు అంటే.. చాలా అవసరం ఉంది. నన్ను పోలీసులకు పట్టించకండి. ఇంట్లో ఈ రోజు చాలా ముఖ్యమైన పని ఉంది. ఎప్పుడైనా మీ వద్ద డబ్బు కొట్టేస్తే క్షమించండి. ఇక ముందు నేను ఎప్పుడు ఇలాంటి పనిచేయను. నన్ను పోలీసులకు పట్టించవద్దు అని ఇంద్రుడు వేడుకొన్నాడు. అయితే ఇతను నీకు ముందే తెలుసా? అని దీపను కార్తీక్ అడిగితే.. మనం వెతుకుతున్నది ఇతడి కోసమే.. ఈ ఆటో కోసమే అని వంటలక్క సమాధానం ఇచ్చింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1494 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

    అప్పుడు ఏదో టెన్షన్‌లో ఉన్నా

    అప్పుడు ఏదో టెన్షన్‌లో ఉన్నా

    అమ్మ, నాన్న ఎక్కడున్నారు? అని రాసి ఉన్న ఆటో నీదేనా? అంటే అవును అని ఇంద్రుడు సమాధానం ఇచ్చాడు. ఇదే ఆటో కోసం మనం వెంటపడ్డాం. ఈ ఆటోలో కూర్చొని అమ్మాయితో మాట్లాడాను అని దీప అంటే.. నీతో మాట్లాడిన తర్వాత చాలా రోజులు మిమ్మల్ని కలువాలని ఆశపడింది అని దీపతో చంద్రుడు చెప్పాడు. ఆ రోజు బతుకమ్మ పండుగలో మిమ్మల్ని రమ్మంటే.. కసురుకొన్నారు అని చంద్రుడు అంటే.. అప్పుడు ఏదో టెన్షన్‌లో ఉన్నా... ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అని దీప అంటే.. ఇంట్లో ఉంది.. పాప పెద్ద మనిషి అయింది అని చంద్రుడు చెబితే.. అవునా అంటూ దీప ఆనందంతో కంటతడి పెట్టుకొన్నది.

    ఆడపిల్ల అచ్చట ముచ్చట తీర్చాలి

    ఆడపిల్ల అచ్చట ముచ్చట తీర్చాలి

    అమ్మాయి పెద్ద మనిషి అయినందుకు ఫంక్షన్ చేయాలి. మెడలో బంగారు చైన్ వేయాలి. కానీ డబ్బుల్లేవు. అందుకే ఈ దొంగతనం చేయాలనుకొన్నాను. మా జ్వాలకు దొంగతనం చేయడం ఇష్టం ఉండదు. అందుకే దొంగతనం చేసి పట్టుబడ్డానేమో అని చంద్రుడు అన్నాడు. అయితే పాప ఈ పరిస్థితుల్లో బిడ్డ ఉందా అని దీప కంటతడి పెట్టింది. అవును ఆడపిల్ల అచ్చట ముచ్చట చేయాలి కదా.. నువ్వు రావయ్య అంటూ చంద్రుడిని దీప, కార్తీక్ తీసుకెళ్లారు.

    ప్రియమణి ఎవరు అంటూ

    ప్రియమణి ఎవరు అంటూ

    ప్రియమణి ఎవరు? నీ పెళ్లి ఎప్పుడు జరిగిందని కార్తీక్ ప్రశ్నలు లేవనెత్తడంతో మోనిత కంగారు పడింది. కార్తీక్‌ను ప్రియమణి కలిసిందా? కలువకపోతే ప్రియమణి గురించి కార్తీక్ అడగడు. కచ్చితంగా ఆడగడానికి అవకాశం ఉంది. కలువగానే.. గతం గుర్తుకు లేదనే విషయం అర్ధమై ఉంటుంది. కానీ దీప గురించి ప్రియమణికి తెలుసా అని నన్ను అడగడం ఏమిటి? అంటే నిజం తెలిసి.. నాటకం ఆడుతున్నారా అంటూ మోనిత అయోమయంలో పడింది. అంతలోనే వాల్తేరు వాణి అక్కడికి రావడంతో కంగారు పడింది. నీవు వచ్చింది చూస్తే.. అనుమాన పడుతారు. దీప, దుర్గ పైకి పోతారని అనుకొన్నాను. కానీ పని జరగలేదు అని మోనిత అంటే.. సమయానికి కార్తీక్ వచ్చాడు. లేకపోతే ఈపాటికి పైకి వెళ్లేవారని వాణి అంటే... ముందు నీవు చేయాల్సింది చేయి అంటూ మోనిత చెప్పింది.

    జ్వాలా నా వద్ద ఉందని తెలుసా?

    జ్వాలా నా వద్ద ఉందని తెలుసా?

    ఇంద్రుడికి బట్టలు, నగలు కార్తీక్, దీప కొనిచ్చారు. ఇక మళ్లీ దొంగతనం చేస్తావా? అని కార్తీక్ అన్నాడు. నీవు అమ్మాయి కోసం చేశావని అర్ధం చేసుకొన్నాం అని అన్నాడు. అయితే ముందు ఆటో తీయి.. పాపను చూడాలని ఉందని దీప అంటే.. వంటలక్క, డాక్టర్ బాబు అంటే.. జ్వాలా అమ్మ, నాన్నలా? వీరు బతికే ఉన్నారా? జ్వాలా నా వద్ద ఉన్నదని తెలుసా? అని ఇంద్రుడు మనసులో అనుకొన్నాడు. ముందు ఆటో తీయి.. వంటలక్క మీ ఇంటికి వస్తాను అని దీప అంటే.. లేదు.. ఈ రోజు వద్దు.. మేము పని హడావిడిలో ఉంటాం. చుట్టాలను రావొద్దని చెప్పాం.. కాబట్టి మీరు రేపు రండి. మా బాధను అర్ధం చేసుకోండి అని ఇంద్రుడు అన్నాడు.

    మా పాప ఫోటోలు లేవు అంటూ

    మా పాప ఫోటోలు లేవు అంటూ

    అంటే.. సరే.. నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ నీ ఫోన్ ఇవ్వు.. నీ ఫోన్‌లో అమ్మాయి ఫోటో చూపిస్తే.. దీప డౌట్ తీరిపోతుంది అని కార్తీక్ అంటే.. జ్వాల వీరి అమ్మాయి అయితే.. వెంటనే తీసుకెళ్తారు. కాబట్టి చూపించకూడదు అని ఫోటోలను డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఫోటోలు లేవంటే.. మీ పాప ఫోటో మీ ఫోన్‌లో ఒక్కటి కూడా లేవా? అని దీప అడిగింది. అయితే మీ ఇంటికి పోదాం పద.. అంటే.. ఈ రోజు వద్దు అని ఇంద్రుడు ప్రాధేయపడ్డాడు. దాంతో ఇన్ని రోజులు ఆగావు.. ఒక్క రోజు ఆగు అని కార్తీక్ చెప్పాడు. దాంతో ఈ ఊరు కొత్త.. నీవే ఇక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్లు అంటూ దీప చెప్పింది.

    అమ్మ, నాన్నను చూడాలి.. అంటూ

    అమ్మ, నాన్నను చూడాలి.. అంటూ

    అయితే పెద్ద మనిషి అయి కూర్చున్న శౌర్య బయటకు వెళ్లాలని ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా కూర్చోవాలి. నేను బయటకు వెళ్లి అమ్మ, నాన్నలను చూడాలి అని అంటే.. మేము అమ్మ, నాన్నలు కాకపోయినా.. వారిలా చూసుకొన్నాం. కానీ అమ్మ, నాన్నలం కాలేము కదా అని చంద్రుడు అనుకొన్నది. నీకు అమ్మ, నాన్నలు లేకపోయినా.. అన్నీ వేడుకలు బాగానే చేస్తాం అని అంది. అయితే నాకు కావాల్సిన వేడుకలు కాదు.. నన్ను ఇలా మా అమ్మ చూడాలి. ఆ సంతోషాన్ని చూడాలి అని శౌర్య అనుకొన్నది. ఇక ఇంద్రుడు రాకపోవడంతో చంద్రుడు కంగారుపడిపోయింది. బట్టలు, నగలు తీసుకొన్న ఇంద్రుడు ఆటోలో వెళ్తూ జ్వాలా గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. జ్వాలా తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్లిపోతుందా అనే బాధలో మునిగి కంటతడి పెట్టుకొన్నాడు.

    ఇంటికి నిప్పు పెట్టిన వాల్తేరు వాణి

    ఇంటికి నిప్పు పెట్టిన వాల్తేరు వాణి

    కార్తీకదీపం ప్రోమోలో మరో ట్విస్టుకు తెరలేపారు. శౌర్యను చూడాలనే ఆనందంలో ఉన్న కార్తీక్, దీప ఇద్దరు పిండి వంటలు సిద్దం చేశారు. ఇవన్నీ మన శౌర్య కోసమేనా? అని కార్తీక్ అంటే.. అవును.. ఎప్పుడు తెల్లారుతుందో.. ఎప్పుడు చూడాలని ఉందో అని దీప అంది.. ఇక మోనిత ఆవేశంతో కనిపించింది. ఇక వాళ్లు సూర్యోదయం చూడొద్దు అంటూ వాణితో మోనిత చెప్పింది. దాంతో ఒకే.. మీరు ఉదయానికల్లా.. క్యాష్ రెడీ చేసుకొండి అని వాణి వెళ్లింది. దీప నిద్రిస్తుండగా.. అగ్గిపుల్ల గీకి.. ఇంటిపై వేసి.. రెస్ట్ ఇన్ పీస్ అంది.

    English summary
    Twist October 27th Episode number 1494 in Karthika Deepam serial: Vani lit up fire of Deepa's House
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X