For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam.. వంటలక్కను చంపేస్తా.. కార్తీక్ మర్డర్ హైడ్రామాను బయటపెట్టిన మోనిత

  |

  అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి పిల్లలు శౌర్య, హిమ మధ్య, అలాగే ఆదిత్య, తల్లి సౌందర్య మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకొన్నాయి. కార్తీక్ పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఉండటంతో ఇంటి సభ్యులందరూ విచారంలో మునిగిపోయారు. తండ్రిని చూసేందుకు వెళ్దామని పిల్లలు పట్టుబట్టడంతో దీప డైలామాలో పడింది. తన కొడుకు నేరం చేయకుండా లాకప్‌లో ఉండటాన్ని సౌందర్య జీర్ణించుకోలేకపోయింది. ఇక కార్తీక్‌పై మోనిత పిచ్చి ప్రేమ అలానే కంటిన్యూ అయింది. తాజా ఎపిసోడ్ 1121లో ఇంకా ఏం జరిగిందంటే...

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   తండ్రి చూడాలని పట్టుబట్టిన పిల్లలు

  తండ్రి చూడాలని పట్టుబట్టిన పిల్లలు

  తండ్రి కార్తీక్‌ను చూడాలని ఉందని దీపతో తన పిల్లలు హిమ, శౌర్య పట్టుబట్డారు. దాంతో అక్కడికి పిల్లలు వెళ్లకూడదు అంటే నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అయితే అక్కడికి మేము వెళ్లకూడదంటే.. నాన్న అక్కడ ఎందుకు ఉంటున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నాన్న గుర్తుకు వచ్చినప్పుడల్లా మాకు ఏడుపు వస్తున్నది. నువ్వు రాత్రంతా కింద పడుకొనే ఏడుస్తున్నావా? నాన్న గురించి బాధగా ఉంది. మన ముగ్గురం వెళ్లాలి. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని ప్రశ్నించారు. నాన్న వద్దకు తీసుకెళ్లకపోతే మా మీద ఒట్టే అంటూ పిల్లలు గట్టిగా అడగడంతో దీప సందిగ్దంలో పడింది.

  నీతో ఏడడుగులు నడవాలని ఆశ పడ్డ కార్తీక్

  నీతో ఏడడుగులు నడవాలని ఆశ పడ్డ కార్తీక్

  ఇక ఊరు బయట ఇంటిలో ఉంటున్న మోనిత.. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న కార్తీక్‌పై పిచ్చి ప్రేమను కనబరిచింది. గుడ్ మార్నింగ్ బంగారం. నీతో కలిసి ఏడడుగులు నడవాలని, నీ జీవితంలోకి అడుగుపెట్టాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ ఇలా ఒంటరిగా బతకాల్సి వచ్చింది. నీ మీద ఉన్న పిచ్చి ప్రేమను ఈ ప్రపంచం ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నది. నిన్ను జైలుకు పంపినా అది నీ మీద ప్రేమే వల్లే. నీవు జైలులో ఎలా ఉన్నావు కార్తీక్. నీవు జైలులో అంధకారంలో ఉన్నావు. నీవు దీప మాయలో ఉన్నావు. నీవు మాములుగా ఉండాలంటే దీపకు దూరంగా ఉంచాలి. అందుకే నేను చచ్చినట్టు నాటకం ఆడి దూరంగా ఉండాల్సి వచ్చింది అంటూ మోనిత పిచ్చిదానిలా పూనకం వచ్చినట్టు బిహేవ్ చేసింది.

  నా కడుపులో పెరుగుతున్న బిడ్డ బయటపడే లోపు

  నా కడుపులో పెరుగుతున్న బిడ్డ బయటపడే లోపు

  నీకు నన్ను దూరం చేసిన ఎవరిని వదిలిపెట్టను. దీపను చంపేస్తాను. నీ పిల్లలిద్దరిని తప్ప.. అందర్నీ చంపేస్తాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ.. ఈ భూమిపై పడేలొగా నిన్ను పెళ్లి చేసుకొంటాను కార్తీక్. అప్పుడు నీ పిల్లలతో నా పుట్టబోయే బిడ్డ కలిసి హాయిగా ఉండవచ్చు. వీలైనంత తొందరగా నిన్ను చూడాలని ఉంది. అంతకంటే ముందు దీపను పైలోకాలకు పంపిస్తాను అంటూ మోనిత శపథం చేసింది.

   మోనిత నిన్ను చంపాలని ఉన్నా.. చంపలేకపోతున్నా

  మోనిత నిన్ను చంపాలని ఉన్నా.. చంపలేకపోతున్నా

  కార్తీక్ ఫోటోను పట్టుకొని 25వ తేదీ రోజున తన ఇంటిలో జరిగిన విషయాలను మోనిత గుర్తు చేసుకొన్నది. ఏ ప్రేమ కోసమైతే ఉన్మాదిగా మారావో.. ఆ ప్రేమ కోసం చచ్చిపో అంటూ కార్తీక్ తుపాకి గురిపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొన్నది. అయితే మోనితను చంపలేక వదలేసి వెళ్లిపోతుంటే.. కార్తీక్ చేతులు పట్టుకొని ఆగురా.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎవరు సమాధానం చెబుతారు. నన్ను పెళ్లి చేసుకో. అది ఎక్కడికి పోతే మనకేంది? దాని చావు అది చస్తుంది అంటూ మోనిత అంటే.. దీప ఏమైపోతే ఏందా.. దీప నా భార్య. నీవు అంటూ.. నిన్ను తలచుకొంటేనే జుగప్సా‌గా ఉంది. నిన్ను చంపాలని ఉన్నా.. చంపలేకపోతున్నాను. నాకు ప్రాణాలు పోయడమే తెలుసు. ప్రాణాలు తీయడం తెలియదు. నిన్ను చంపి ఆ నేరాన్ని నాపై వేసుకొని నా భార్యను ఒంటరిదాన్ని చేయలేను. ఇక ముందు నా కళ్లకు కనిపించకు. నీకు.. నీ ప్రేమకు గుడ్ బై అంటూ కార్తీక్ వెళ్లిపోయాడు.

  Karthika Deepam Vantalakka Live Video || కార్తీక దీపం సీరియల్‌ నుంచి తప్పుకోవడం పై దీప క్లారిటీ !
   మోనిత హైడ్రామా బట్టబయలు

  మోనిత హైడ్రామా బట్టబయలు

  అయితే కార్తీక్ తన ప్రేమను, పెళ్లిని నిరాకరించడంతో మోనిత అహం దెబ్బ తిన్నది. తన ఇంట్లోని పిస్టల్ తీసుకొని గురిపెట్టుకొంది. ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని మానుకొని రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపింది. ఆ తర్వాత కత్తి పట్టుకొని.. ప్రపంచం, పోలీసులు, నీ భార్య దృష్టిలో మోనిత చచ్చిపోయింది. మోనితను కార్తీక్ షూట్ చేసి చంపేశాడు అంటూ మోనిత కత్తితో కోసుకొన్నది. ఇందంతా మోనిత తన ఊహల్లో ఊహించుకోవడంతో ఆ రోజు ఏం జరిగిందనే విషయం తెలిసింది. ఆ తర్వాత ఎలా ఉంది నా ప్లాన్ అంటూ కార్తీక్ ఫోటోను పట్టుకొని తనలోని పిచ్చిని మరోసారి బయటపెట్టింది.

  English summary
  Karthika Deepam August 18th August's Episode preview. Latest episode of 1121 goes once again with emotional content.Karthik arrested in Monita murder case.In this occasion, emotional scenes took place between Karthik and Deepa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X