For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam episode 1107: మోనితకు కడుపు చేసి తప్పించుకొంటావా? డాక్టర్ బాబును కడిగేసిన ఏసీపీ రోషిణి

  |

  కార్తీకదీపం సీరియల్‌లో పెళ్లికాకుండానే కడుపు తెచ్చుకొన్న మోనిత విషయం సుదీర్ఘంగా సాగుతున్నది. రకరకాల ట్విస్టులకు వేదికగా మారుతూ అందర్ని కంగారు పెట్టిస్తున్నది. ఈ క్రమంలో మోనిత కేసు పెట్టిన విషయంపై కార్తీక్‌తో ఏసీపీ రోషిణిగా ఘాటుగా స్పందించింది. రోషిణిని కలవడానికి వెళ్లిన కార్తీక్‌ను గట్టిగానే కడిగిపడేసింది. తాజా ఎపిసోడ్ 1107లో ఏం జరిగిందంటే...

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   మోనిత పైశాచికత్వంపై ఫిర్యాదు

  మోనిత పైశాచికత్వంపై ఫిర్యాదు

  ఏపీపీ రోషిణి ఇంటికి డాక్టర్ కార్తీక్ రావడంతో రండి అంటూ ఆమె ఆహ్వానించింది. ఏంటీ డాక్టర్.. మీరు డాక్టర్ వద్దకు వెళ్లేలా తయారయ్యారు. సరెండర్ అవ్వడానికి వచ్చారా? అని ఏసీపీ అడిగారు. దాంతో నేను తప్పు చేస్తే కదా సరెండర్ అయ్యేది అంటే.. మోనిత కడుపులో పెరుగుతన్న తప్పుకు మీరే కదా జవాబు అంటూ ఏసీపీ తనదైన శైలిలో ప్రశ్నించింది. దాంతో మోనిత కడుపుకు సంబంధించి నాకు ఏమీ తెలిదు. కానీ ఆమె పైశాచికత్వం రోజు రోజుకు పెరిగిపోతున్నది అంటూ కార్తీక్ చెప్పాడు. దాంతో మోనిత చేస్తున్నది న్యాయపోరాటమే కాదా అంటే ఏసీపీ సమాధానం ఇచ్చింది. అందుకు సమాధానం ఇస్తూ ఆమెకు అన్యాయం జరిగితే కదా అంటూ కార్తీక్ పేర్కొన్నారు.

  సంస్కారమా? అపరాధ భావమా?

  సంస్కారమా? అపరాధ భావమా?

  కార్తీక్ ప్రశ్నలకు ఎదురు ప్రశ్న వేస్తూ ఇన్ని రోజులు మోనితను ఎందుకు భరిస్తున్నారు. పిలువగానే కారు ఎక్కి వెళ్తారు. చేయి కోసుకొంటే పరుగెత్తుకొంటూ వెళ్తారు. ఇంటికి వస్తే ఆదరిస్తారు. ఆఖరికి గుండె పోటు తెప్పించినా క్షమించారు. ఎందుకు.. దీనికి నేను ఏం పేరు పెట్టాలి? సంస్కారమనా? అపరాధభావమనా? అని ఏసీపీ ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో నన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నదంటే... మీరు ఎందుకు కంప్లైయింట్ చేయలేదు. పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్న మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని ఏసీపీ ప్రశ్నించింది. దాంతో మీకు అంతా తెలుసు కదా అని కార్తీక్ అంటే.. మీ యాంగిల్ మీరు నిజం అనుకొంటున్నారు? వాళ్ల యాంగిల్‌లో వాళ్లు తమకు అనుకూలంగా చెబుతున్నారు. ఏది నిజం ఏది అబద్దం అని అన్నారు. ఒక ఆడదానికి మగవాడి అండ లేకపోతే పిండోత్పత్తి జరుగుతుందా? డాక్టర్‌గా మీరు చెప్పండి అంటూ ఏసీపీ ప్రశ్నించింది.

  ఆడ, మగ మధ్య గీతను చెరిపేశారు

  ఆడ, మగ మధ్య గీతను చెరిపేశారు

  మీరు స్నేహం పేరుతో మోనిత ఇంటికి వెళ్తు ఉంటారు. గంటలు గంటలు మందు కొడుతూనే ఉంటారు. మోనితకు మీ మీద మోజో, ప్రేమో ఉందని తెలిసినా కూడా వెళ్తున్నారు. సరి సరే.. మీ స్వచ్చమైన స్నేహమే అనుకొందాం. అయినా మోనిత మిమ్మల్ని ఎలా ఇంట్లోకి రానిచ్చింది? ఆడ, మగ స్నేహానికి చిన్న గీత ఉంటుంది. ఆ రేఖకు మీరు ఎటువైపు ఉన్నారా? అనేది చూసే వాళ్లకు తెలియదు. కానీ ఆ సరిహద్దు రేఖను దాటారు అని ఏసీపీ అంటే... స్టాపిట్ అని గట్టిగా అరిచారు. ఆ తర్వాత పోలీస్ అధికారితో మాట్లాడుతున్నాని తెలుసుకొన్న కార్తీక్ సారీ చెప్పారు.

  శీల పరీక్షకు అగ్ని పరీక్ష్ లేదు అంటూ ఏసీపీ

  శీల పరీక్షకు అగ్ని పరీక్ష్ లేదు అంటూ ఏసీపీ

  మోనిత కేసు పెట్టినందున మీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది? ఆ సాక్ష్యాలు మీ వద్దే ఉన్నాయి? మగవాడి శీలపరీక్షకు ఎలాంటి అగ్నిపరీక్ష లేదు మిస్టర్ కార్తీక్ అంటూ ఏసీపీ ఘాటుగా స్పందించింది. మీరు ఏది చెబితే అది చేస్తాను. దీపకు అన్యాయం చేయలేను అంటే.. మోనిత పెళ్లి ఆపడం ఎవరి చేతుల్లో ఉంది.. ఆపకుండా ఉండాలంటే ఎవరి చేతుల్లో ఉంది? మొదటి పెళ్లి జరిగిన తర్వాత మీరు రెండో పెళ్లి ఎలా చేసుకొంటారు? మోనితకు కడుపు చేసి ఎలా తప్పించుకొంటారు? ఇవన్నీ చట్టరీత్యా నేరం అనేది మీకు తెలియదా? చట్టం నుంచి ఎలా తప్పించుకొంటారు? అని ఏసీపీ రోషిణి అనగానే టెన్షన్ పడ్డ కార్తీక్ నీళ్లు తాగారు.

   దీపలో నిజాయితీ నచ్చింది?

  దీపలో నిజాయితీ నచ్చింది?

  టెన్షన్‌లో ఉన్నట్టు కనిపించిన కార్తీక్‌ను కూర్చోబెట్టి దీప గురించి మాట్లాడుతూ.. దీపలో స్త్రీ మూర్తి కనిపించింది. ఆమె కళ్లలో కరుణ కనిపించింది. ఆమె మాటల్లో నిజాయితీ ధ్వనిస్తుంది. ఆమె వ్యక్తిత్వం నచ్చింది. ఆమె మీ గురించి మంచిగా చెప్పింది. దానితో నేను ఆశ్చర్యానికి గురి అయ్యాను. దాంతో సందిగ్దంలో పడ్డాను. మోనితకు న్యాయం చేస్తే దీపకు అన్యాయం చేసినట్టు అవుతాను. దీపకు న్యాయం చేస్తే మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డ బతుకే ప్రశ్నార్థం అవుతుంది. భర్తలో మార్పు కోసం పదేళ్లు ఎదురు చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే... శిక్ష దీప, ఇద్దరు పిల్లలతోపాటు, మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా పడుతుంది అంటూ ఏసీపీ ప్రశ్నించింది. అందుకే నేను ఆగాను అంటూ ఏసీపీ చెప్పింది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  మోనితకు అన్యాయం చేయలేను..

  మోనితకు అన్యాయం చేయలేను..

  మోనిత పెట్టిన కేసు విషయంలో నేను అనేక రకాలుగా ఆలోచిస్తున్న సమయంలో దీప నాకు అంజి గురించి చెప్పింది. మోనితను అంజి గురించి అడిగితే ఆమె బాగా తడబాటుకు గురైంది. అని ఏసీపీ అంటే... నేను అదే విషయం మాట్లాడటానికి వచ్చాను. మీకు అంజి ఆచూకి తెలిస్తే చెప్పండి. నేను వెళ్లి తీసుకు వస్తాను అంటే.. ఈ కేసులో మీరు ఇన్వెస్టిగేషన్ చేయకండి. కేసును ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు. మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. దీప, పిల్లలతో సంతోషంగా గడపండి. ఆ తర్వాత దోషి, నిర్దోషి అనేది కాలమే సమాధానం చెబుతుంది అంటూ ఏసీపీ రోషిణి తనదైన శైలిలో స్పందించింది.

  English summary
  Karthika Deepam August 2nd July's Episode preview. Latest episode of 1107 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th...In this occasion, ACP Roshini grills Karthik over Monita pregnancy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X