For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam Episode 1110: కార్తీక్‌ను చంపకుండా.. నిన్ను తూట్లు పడేలా కాల్చేస్తా.. మోనితలో ఒరిజినల్ పిశాచి!

  |

  కార్తీకదీపం సీరియల్‌లో దీప, మోనిత, కారు డ్రైవర్ అంజి మధ్య హైడ్రామా కొనసాగుతున్నది. సూర్యాపేటలోని రెస్టారెంట్‌లో ఉన్న అంజి ఆచూకీ తెలియడంతో దీప, మోనిత అక్కడకు వెళ్లారు. అంజి రూమ్‌లోకి వెళ్లిన మోనిత తాను మారిపోయానని ఆడిన కపటనాటకాన్ని అంజి నమ్మలేదు. సరికాదు కదా.. మోనితను అంతు చూస్తానని బెదిరించాడు. దాంతో తాను వేసుకొన్న ప్లాన్ ఫలించకపోవడంతో మోనిత ఎదురుదాడి ప్రారంభించింది. ఈ క్రమంలో దీపమ్మకు ఏదైనా హానీ తలపెట్టారంటే అంటూ అంజి కోపంతో ఊగిపోగా.. ఓరే రాస్కెల్.. దీపమ్మ దీపమ్మ అంటున్నావు. దీప నీకు ఏమైనా పెట్టిందా? నేను ఎంత డబ్బు ఇచ్చానో తెలుసా అంటూ పిస్టల్ తీసి అంజి తలకు గురిపెట్టింది. తాజా ఎపిసోడ్ 1110లో ఏం జరిగిందంటే...

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  హిమను చంపింది నేనే

  హిమను చంపింది నేనే

  అంజి, మోనిత మధ్య జరుగుతున్న వాగ్వాదాన్ని దీప కిటికిలో నుంచి చూస్తూ విస్తుపోయింది. కారు డ్రైవర్ నుంచి తీసుకొన్న మొబైల్ ఫోన్ తీసుకొని దీప మాటలను షూట్ చేయడం ప్రారంభించింది. అంజితో మోనిత రెచ్చిపోయి మాట్లాడుతూ.. దీపను కార్తీక్ వదిలేసినప్పుడు ఏం పీకారురా? హిమను చంపింది నేనే అంటూ ఎందుకు చెప్పలేకపోయావు రా. ఎందుకు కళ్లు తెరిపించలేకపోయావురా. మీరంతా మంచి వాళ్లని నమ్మితే నేను ఇన్ని నాటకాలు ఆడుతానురా? అంటూ మోనిత కోపంతో ఊగిపోయింది.

   కార్తీక్‌ను చంపకుండా మంచి పని

  కార్తీక్‌ను చంపకుండా మంచి పని

  అంజిని కడిగిపారేస్తూ.. నీ బతుకి నీవు ఒకటే పనిని కరెక్ట్ చేశావు. ఒకే కారులో ఉన్నా నా కార్తీక్‌కు ఏమీ కాకుండా యాక్సిడెంట్ చేశావు. ఆ హిమ మాత్రమే చచ్చేలా యాక్సిడెంట్ చేశావు. అదొక్కటే నాకు చేసిన ఫేవర్. చంపించిన నువ్వ ఎంత నేరస్తురాలివో.. చంపిన నువ్వు అంతే నేరస్థురాలివి అంటూ మోనిత చెప్పుకొంటూ పోతుంది. దీనిని అంతా దీప రికార్డ్ చేస్తూ టెన్షన్‌లో కనిపించింది. నీవు ఎంత క్రూరుడివో.. నేను కూడా అంతే... మనం మనం గొడవ పడటం అనవసరం. నాతో వస్తావా రావా? నాకు నిద్రోస్తున్నది. రేపే నా పెళ్లి. నిద్రపోకపోతే నా గ్లామర్ పాడైపోతుంది అంటూ మోనిత చెప్పింది.

  నీలోని ఒరిజినల్ పిశాచి బయటకు

  నీలోని ఒరిజినల్ పిశాచి బయటకు

  మోనిత అసలు రూపం గ్రహించిన కారు డ్రైవర్ అంజి.. నీవు ఇంత చెప్పినా నేను ఎందుకు నమ్మలేదు తెలుసా? ఇప్పుడు జుట్టు అందిందా? కాళ్లు వదిలేశావు. నీవు ఎక్కువ సేపు నటించలేవు. నీలోని ఒరిజినల్ పిశాచి వెంటనే వస్తుంది. నేను నీతో వచ్చేది ఏమిటే.. నిన్ను లాక్కెళ్లి కార్తీక్ బాబు, దీపమ్మ కాళ్లపై పడేసి మొత్తం బయటపెట్టిస్తాను అంటూ చేయిపట్టి లాగేయడంతో.. పరిస్థితి గ్రహించిన మోనిత వెంటనే తన బ్యాగులో ఉన్న పిస్టల్‌ను అంజికి తీసి గురిపెట్టింది.

  దీపమ్మ కోసం చచ్చిపోరా

  దీపమ్మ కోసం చచ్చిపోరా

  అంజి తలకు గురిపెట్టిన మోనిత ఉన్మాదిలా కనిపించింది. దీపమ్మ దీపమ్మ అంటూ భజన చేస్తావు కదా.. దీపమ్మ కోసం నీవు నీ దీపాన్ని ఆర్పేసుకో. దీపమ్మ కోసం చచ్చిపో. నేను కార్తీక్ వదలడం ఏమిటిరా? అది ఈ జన్మలో వదలను. నా పెళ్లికి నిన్ను అడ్డుపెట్టాలని దీప చూస్తుంది. అందుకే నిన్ను ఏరి పారేయాలని నేను ఇక్కడికి వచ్చాను. నా పెళ్లికి ముందు నిన్ను చంపేస్తే.. నా మెడలో మూడు మూళ్లు పడటం ఆగిపోతుందని నేను ఆగిపోతున్నాను. కానీ ఎదురు తిరిగితే ఇక్కడే.. ఇప్పుడే తూట్లు పడేలా కాల్చిపడేస్తాను అంటూ మోనిత చెప్పింది. నీ పెళ్లికి అడ్డు పడుతుందని దీపమ్మను ఏమైనా చేశావా అంటే.. ఎవరిని ఎప్పుడు అడ్డు తప్పించాలో నాకు బాగా తెలుసు అంటూ పిస్టల్‌ను చూపించింది.

   అంజి కళ్లల్లో ప్రాణభయం అంటూ మోనిత

  అంజి కళ్లల్లో ప్రాణభయం అంటూ మోనిత


  హిమను ఎలాగైతో నీతో చంపిచానో.. నిన్ను మరొకరితో చంపించడానికి ప్లాన్ చేశాను. ఓరేయ్ ద్రాక్షారామం అంటూ పిలువగానే ఒక రౌడీ తాడు పట్టుకొని సీన్‌లోకి ప్రవేశించాడు. రారా వీడిని తాళ్లతో కట్టేసి డిక్కీలో పడేయి.. నేను చెప్పేదాకా ప్రాణాలతో ఉంచు అని మోనిత చెప్పగానే.. ద్రాక్షారామం వచ్చి అంజిని తాళ్లతో కట్టి పడేస్తుంటే.. నన్నే కట్టి పడేస్తారా అంటూ అంజి అన్నాడు. ఏరా గొంతు మూగపోయింది. రివాల్వర్ కణతకు తగలగానే ప్రాణాలపై ఆశపుట్టిందా? అవసరం లేదు. వీడి కళ్లల్లో ప్రాణభయం కనిపిస్తున్నది. పిచ్చి వేషాలు వేస్తే ఏం జరుగుతుందో వీడికి తెలిసిపోయింది అంటూ మోనిత చెప్పింది. ఇక అక్కడ నుంచి అంజిని కట్టేసి.. వరంగల్ హైవేలోని ఫామ్‌హౌజ్‌కు తీసుకెళ్లింది. దీప ఇందంతా షూట్ చేసి అక్కడి నుంచి తప్పుకొన్నది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  దీప ఆచూకీ తెలియక కంగారులో

  దీప ఆచూకీ తెలియక కంగారులో

  ఇక దీప ఆచూకీ తెలియకపోవడంతో కార్తీక్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అంతలోనే కార్తీక్ వద్దకు డ్రైవర్ వారణాసి వచ్చాడు. ఈ సమయంలో రమ్మని పిలిచారు. ఎవరికి ఏమైంది? ముందు వాటర్ తాగు. దీపకు నీవు తోడపుట్టిన వాడికంటే ఎక్కువ. దీప కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నావు. నీతో చెప్పకుండా ఏదీ చేయదు. ఇప్పుడు మీ అక్క ఎక్కడికి వెళ్తానని చెప్పింది? అని కార్తీక్ అడిగితే మీకు చెప్పలేదా అని వారణాసి జవాబిచ్చాడు. నాతో చెప్పకుండా వెళ్లింది. నాకు చెప్పిన చోటికి వెళ్లలేదు అని కార్తీక్ అంటే.. నాకు తెలియదు బాబు అంటూ వారణాసి బదులిచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే.. వచ్చాక చెబుతానని చెప్పింది. ఒట్టు డాక్టర్ బాబు అని కార్తీక్ అంటే.. దీప ఏం ప్రమాదం తెచ్చుకొనేలా చేసుకొందనే భయం ఉంది. చివరకి నిన్ను కూడా నాలుగు పీకకుండా బతిమిలాడుతున్నానంటే.. నా మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకో. కానీ వెంకటేష్ కారులో వెళ్లింది అని చెప్పాడు. దాంతో కాల్ చేయగా ఫోన్ రీచ్ కాలేదు. దాంతో కార్తీక్ అసహనంతో మరింత ఆందోళనకు గురయ్యాడు.

  English summary
  Karthika Deepam August 5th August's Episode preview. Latest episode of 1110 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th...In this occasion, High drama between Monita and Deepa while Suryapet Journey.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X